Thursday, 23 November 2023

🌹 అరుణాచల మాహాత్మ్యము. 🌹

 



             మొదటి అధ్యాయము

                      మొదటి భాగము

                  'శనం!' (గ్రంథం ప్రారంభించినపుడు భగవాన్ ఉపయోగించే శుభ ఆశీస్సులు). పూర్వము సత్యలోకంలో పద్మమునందు ఆసీనుడై వున్న బ్రహ్మను వినయముతో సమీపించి, చేతులు జోడించి నమస్కరించి సనకమహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు.

               "ఓ వేదవేద్యా! (వేదములచే తెలియబడేవాడా!), అన్ని లోకముల చేత పూజింపబడేవాడా! దేవదేవా! నాలుగు ముఖములు కలిగినవాడా! నీ అనుగ్రహముచేత నేను చక్కటి విజ్ఞానమును పొందాను. నీ ఉపదేశముచే నా హృదయంలో భక్తి నిండి ఉండడంచేత ఎల్లపుడూ సకల విజ్ఞానము తెలుస్తున్నది. నీ అనుగ్రహం వలన నేను వేదముల సారమును, స్థిరమైన శివజ్ఞానమును పొందాను. ఓ దయానిధీ! ఈ భూలోకంలో దేవతలచేత, మనుష్యులచేత, భూతములచేత, సిద్ధులచేత ప్రతిష్టింపబడిన శివలింగములు అనేక క్షేత్రములలో వెలసి ఉన్నాయి. ఇవి కాకుండా శాశ్వత వైభవము కలిగినది, స్వయంగా ఉద్భవించినది, తేజోమయమైన లింగము ఎక్కడైనా ఉంటే దయతో నాకు తెలుపమని ప్రార్థిస్తున్నాను. నామస్మరణ మాత్రముచేత మన పాపములను పోగొట్టగలిగినది, శివుని సన్నిధికి చేర్చగలిగిన అద్భుత లింగము ఎక్కడైనా వున్నదా? శాశ్వతమైనది, పుట్టుక లేనిది, జగత్తుకు ఆధారము అయినది, నాశనం లేనిది, కేవల దర్శనం చేతనే మానవులను కృతార్థులను చేయగలిగినది, శివ తేజస్సు లింగాకృతి ధరించిన దివ్య పుణ్యక్షేత్రము ఏదైనా ఉంటే దయతో నాకు తెలుపవలసినదిగా ప్రార్థిస్తున్నాను."

                       అరుణాచల శివ


సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment