Friday, 17 November 2023

రాశి ఫలితాలు

 


శనివారం, నవంబరు 18,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులకు సహాయం చేయడానికి ఇబ్బంది పడతారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీని వల్ల ఎక్కువ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి తొందర పడకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

తుల:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభిస్తారు.సంతానము నుండి శుభవార్త వింటారు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

కుంభం:


ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపలేక పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో వాదనలకు దిగకపోవడమే మంచిది.

మీనం:


ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని సమస్యలు దూరం అవుతాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment