Thursday, 23 November 2023

🙏 భీష్మపంచకం🙏

 



కార్తిక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు భీష్మ పంచక వ్రతం

🙏స్కాంద, పద్మ, బ్రహ్మాండ పురాణాలనుసారం కార్తిక శుద్ధ ఏకాదశి నుండి 5 రోజులు అనగా పౌర్ణమి వరకు భీష్మ పంచక వ్రతం ఆచరించాలి.

ఏకాదశినాడు ప్రాత:కాలమే గోమయమును శరీరానికి రాసుకుని నదీజలముతో స్నానం చేసి మౌనవ్రతమున, పంచామృతాలతో, పంచగ వ్యముతో శ్రీమహావిష్ణువుకు అభిషేకించి పాయసమును నివేదన చేసి ద్వాద్వశాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించి ‘ఓం నమో విష్ణవే’ అని శడక్షర మంత్రముతో నేతితో తడిపిన యవలతో, వ్రీహులతో 108సార్లు హోమము చేసి నేలపై పరుండాలి. ఈ విధముగా 5 రోజులు ఆచరించాలి.

మొదటి రోజున అనగా ఏకాదశి నాడు శ్రీహరిపాదములను పూజించి మూడు పెసరగింజల ప్రమాణమంత గోమయమును భుజించవలెను.

ద్వాదశినాడు మారేడు ఆకులతో శ్రీమహావిష్ణువు మోకాళ్ళను పూజించి పంచమాష ప్రమాణముగా గోమూత్రమును సేవించవలెను.

త్రయోదశినాడు బృంగరాజు పత్రముతో శ్రీహరరి నాభిని పూజించి 5 ఉద్దరిణుల గోక్షీరమును సేవించవలెను. చతుర్దశినాడు సంపంగి పూలతో శ్రీహరి భుజములను పూజించి ఆవు పెరుగును సేవించవలెను.

ఈ నాలుగు రోజులు ప్రాత:కాలమే పైన చెప్పిన హోమం చేసిన పిదప ఈ విధిని ఆచరించవలయును.

పూర్ణిమనాడు హోమం అనంతరం ఇనుముతో ఖడ్గం, చక్రం, హస్తంలో ఉన్న పరమాత్మ ప్రతిమను నిర్మింపచేసి నల్లని వస్త్రంతో చుట్టి 21 కిలోల నువ్వులపై ఉంచి ధర్మరాజు నామములతో గన్నేరు పూలతో

యదస్య జన్మ నికృతం ఇహజన్మని వాపున:

తత్సర్వం ప్రశమం యాతు యత్‌ పాపం తవ పూజనాత్‌

అను మంత్రముతో ఆ కృష్ణప్రతిమను పూజించి బ్రాహ్మణునకు దానం ఇచ్చి సమారాధన చేసి తాంబూల దక్షిణాదుల ను అర్పించి పూర్ణిమనాడు రాత్రి భుజించవలయునని నారదీయ మహాపురాణం ద్వారా తెలుస్తుంది.

శ్రీమహావిష్ణువు సషడ్కర మంత్రముతో పంచగవ్యములను భుజించవలయునని హేమాద్రి పురాణ వచనం. భవిష్య పురాణానుసారం ఈ 5 దినములు శాకములతో మున్యన్యములతో గడపవలెనని తెలుపబడినది.

యత్‌ భీష్మ పంచకమితి వ్రతం పృధివ్యాం

ఏకాదశీ ఫ్రభృతి పంచదాశీ నిరుద్ధం

మున్యన్న భోజన పరశ్య నరశ్య తస్మిన్‌

ఇష్టం ఫలం దిశతి పాండవ శార్గధన్వా

పద్మపురాణానుసారం...

పంచాహం పంచగవ్యాసి భీష్మాయ అర్ఘ్యంచ పంచశు

అహస్వపి తధా గద్యాత్‌ మంత్రేణానేన సూరత:

అనగా కార్తిక శుద్ధ ఏకాదశి నుండి 5 రోజులు పంచగవ్యమును భుజించుచూ పగటిపూట భీష్మునికి క్రింది చెప్పిన మంత్రముతో అర్ఘ్యము మరియు తర్పణమును విడువవలెను.

సత్యవ్రతాయ శుచయే గంగేయాయ మహాత్మనే

భీష్మాయైతత్‌ ప్రదామ్యర్ఘ్యం ఆ జన్మ బ్రహ్మచారిణే

వైయాఘ్ర ప ద్యగోత్రాయ అర్ఘ్యం దద్యాం విశేషత:

సవ్యేన్యానేన మంత్రేణ తర్పణం సార్వవర్ణికమ్‌

ఈ తర్పణమును ఆచరించినవారికి మోక్షము తప్పక లభించునని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment