Thursday, 16 November 2023

🌷సకల శుభాలను కలిగించే 41 రోజు అమ్మవారి పూజ.

 


పసుపుకొమ్ములతో పూజ♦️


🌷41 రోజు పూజ ఇంట్లో చేసుకునే అమ్మవారి పూజకు ముందుగా మీరు ఏ కోరికతో చేస్తున్నారో సంకల్పం చెప్పుకోవాలి..

🌷ప్రతి రోజు ఉదయం ఇల్లు వాకిట్లో శుభ్రం చేసి ఈ 41 రోజు గడపకు పసుపుకుంకుమా పెట్టాలి...

🌷 అమ్మవారి విగ్రహం ఉన్న వారు అయితే అమ్మవారికి పసుపు నీటితో అబీషేకం చేయాలి, చేస్తున్న సమయంలో శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేయాలి... విగ్రహం లేని వారు అమ్మవారి ఫోటో ని అలంకరించిన చాలు, 

🌷విగ్రహం ఉన్నవారు అభేషేకం ఐయ్యాక అమ్మవారికి అలంకారం చేసి, పూజకు కావాల్సిన వి సిద్ధం చేసుకుని దీపాలు అన్ని పెట్టి వినాయకుడికి ముందుగా పూజ చెసుకోవాలి, 

🌷కొన్ని పసుపు కొమ్ములు తీసుకుని అమ్మవారికి దండలాగా కట్టాలి ఈ దండను రోజు కట్టాల్సిన పని లేదు మొదటి రోజు కట్టిన పసుపుకొమ్ముల దండను 41 రోజులు వేయవచ్చు, తర్వాత మీ కోరిక ను అమ్మవారికి చెప్పుకుని యదా శక్తి పూజ చేస్తున్నాము అని విన్నవించు కుని, 108 పసుపు కొమ్ములతో అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో పసుపుకోమ్ము అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి, (దుర్గ, లలిత, లక్ష్మీ,గాయత్రి, కాళీ,)ఈ దేవతలలో ఏ అష్టోత్తరం అయినా పర్వాలేదు కానీ 41 రోజూ అదే అష్టోత్తరం చదవాలి.. 🙏

🌷అర్చన ఐయ్యాక నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి.. ఈ 41 రోజు పూజ ప్రారంభంలోనే చిన్న గిన్నెలో పానకం పెట్టాలి పూజ ఐయ్యాక ఆ పానకం తీర్థo లాగా సేవించాలి. వారంలో ఒక్కసారి అయినా తీపి అన్నం, పులిహోర వండి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరించడం శుభాన్ని కలిగిస్తుంది.

🌷ఆ పసుపు కొమ్ములు మరుసటి రోజు వరకు అలానే అమ్మవారి పాదాల దగ్గరే ఉంచాలి... మరుసటి రోజు మళ్ళీ పూజ సమయంలో శుభ్రం చేసే టప్పుడు ఆ పసుపుకొమ్ముల పక్కకు తీసి పెట్టి ,అవే పసుపు కొమ్ములు మళ్ళి అర్చనకు వాడాలి, అలా 41 రోజు అదే పసుపుకొమ్ముల లు వాడాలి.. 

🌷41 రోజు అమ్మవారికి, పంచామృతము అభేషేకం చేసి 11 మంది ముత్తైదువులకు.. తాంబూలం ఇవ్వాలి ఏదైనా తీపి వండి మహా నివేదన చేసి ఆ ముత్తదువులకు తాంబూలంలో పండు తో పాటు ఒక పసుపుకొమ్ము, చిల్లర, పువ్వులు, మీరు వండిన ప్రసాదం వారికి ఇవ్వాలి..అక్షింతలు  వేయించుకుంటే మంచిది.. 

🌷మీరు 11 మందికి ఇచ్చే వారిలో ఒక కన్నె ముత్తైదువు కూడా ఉండాలి... ఇది చాలా విశేషమైన అర్చన, ఇంటిల్ల పాదికి సకల శుభాలు కలుగుతుంది, గ్రహ దోషం తో పాటు అన్ని సమస్యలు తీరిపోయే పరిస్కారం దొరుకుతుంది.. ♦️ఆటంకం వస్తే 7 వ రోజు నుండి మళ్ళీ కొనసాగించవచ్చు♦️..శ్రీ మాత్రే నమః

♦️నియమాలు: ఆటంకం రాకూడదు, ఆడవారికి అయితే మైలు స్నానం అయ్యాక 7 వ రోజు నుండి కొనసాగించాలి, ఈ 41 రోజు మాంసాహరం తినకూడదు, పూజ పూర్తి అయ్యాక ఆహారం తినాలి కానీ ఉపవాసం చేయకూడదు మీరు ఎంత సంతోషంగా శ్రద్ధగా పూజ చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది.. వివాహితులు  రోజూ తలస్నానమ్ చేయాలి(బ్రహ్మచర్య నియమం లేదు కనుక). ఆవివాహితులు మంగళ, శుక్ర,  నాడు తల స్నానం చేస్తే సరిపోతుంది, ఎట్టిపరిస్థితుల్లోనూ 9 am లోపు పూజ ఐపోవాలి , ఈ పూజ అంతా అరగంట సమయం పడుతుంది అంతే ఆ కాసేపు అయినా ప్రశాంతంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి , ఈ 41 రోజూ కూడా రోజంతా శ్రీ మాత్రే నమః అనుకుంటూ ఉండటం చాలా మంచిది... ఒకవేళ ఏదైనా పని మీద ఊరికి వెళ్ళితే వచ్చాక మళ్ళీ మొదటి నుండి చేయాలి... ఇందులో ఏలాంటి మార్పు ఉండదు.. (మిగిలిన పసుపుకొమ్ములు వంటకు వాడుకోవచ్చు)

🌷శ్రీ మాత్రే నమః🌷


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment