Wednesday, 15 November 2023

🙏గోవర్ధన పూజ :🙏

 



🙏గోవర్ధన పూజ అనేది దీపావళి పూజలో ఒక భాగంగా ఉంది. మరియు ఇంద్రుడి పై శ్రీ కృష్ణభగవానుని విజయం గౌరవార్థం ప్రశంసించబడుతుంది.

🙏ఇది దీపావళి యొక్క నాలుగో రోజు జరుపుకుంటారు. గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు.

🙏 శ్రీకృష్ణుడు.. శ్రీమహావిష్ణువు అవతారమని ఇంద్రునకు తెలిసినా., మానవుడుగా జన్మించాడు కనుక శ్రీకృష్ణుడు కూడా తనను పూజించాలని భావించాడు ఇంద్రుడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు, ఇంద్రుని గర్వం అణచాలని సంకల్పించాడు. ఎప్పటిలాగే ‘ఇంద్రయాగం’ చేసేరోజు రానే వచ్చింది. గోకులంలోని వారంతా ఇంద్రుని పూజించడానికి  సర్వం సిద్ధం చేసారు.

🙏అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి, గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ ‘ఈ రోజు నుంచి ఇంద్రుని పూజించడం మానేయండి. మనందరికీ పంటలు., మన పశువులకు మేత ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతమే. కనుక  నేటినుంచి ఈ పర్వతాన్నే పూజిద్దాం’ అన్నాడు.

🙏గోకులంలో వారందరకూ శ్రీకృష్ణుని మాటంటే వేదం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాలలో, ఎందరో రాక్షసుల బారి నుంచి గోకులవాసులను కాపాడాడు.

అందుచేత గోకుల ప్రజలంతా శ్రీకృష్ణుని మాట గౌరవించి ఇంద్రుని పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు. ఈ సంగతి నారదుని ద్వారా తెలుసుకున్న ఇంద్రుడు కోపగించి.. గోకులంమీద రాళ్ళతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. గోకుల వాసులంతా శ్రీకృష్ణుని శరణు కోరారు.


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371   

No comments:

Post a Comment