Thursday 1 June 2017

చనిపోయిన తరువాత తలదగ్గర దీపం ఎందుకు పెడతారు.........!!


దీపం వెలుగు చూపిస్తుంది. హిందూ ధర్మంలో దీపం అనేది ఒక జ్ఞాన చిహ్నం. హిందువులు ప్రతి ఒక్కరు తమ ఇంట్లో దీపం వెలిగిస్తారు. ఇది మన హిందూ ఆచారం. ఏ కార్యాన్ని అయినా మొదలు పెట్టాలంటే దేవుడి ఎదుట దీపాన్ని వెలిగించి అప్పుడే మొదలు పెడతారు. శుభకార్యాలలో దీపం లేనిదే ఏ పని చేయరు. ముందు దీపం వెలిగించాల్సిందే. అలాగే చనిపోయిన తరువాత కూడా దీపాన్ని తల దగ్గర వెలిగిస్తారు. ఇలా ఎందుకు వెలిగిస్తారంటే శవాన్ని చీకటిలో ఉంచకూడదు కాబట్టి దీపాన్ని వెలిగించి వెలుగులో ఉంచుతారు. మరి రాత్రి అయితే చీకటి ఉంటుంది మరి వెలుగులో కూడా మనం దీపాన్ని వెలిగిస్తాము కదా అనే కదా మీ ప్రశ్న ? దీనికి కూడా ఒక రీజన్‌ ఉంది.
మనం బ్రతికి ఉన్నప్పుడు మనకి చీకటిలో దీపం ఎలా దారి చూపిస్తుందో.. చనిపోయిన తర్వాత కూడా దీపం మనిషికి మోక్ష మార్గం చూపుతుందట. చనిపోయిన తరువాత వారి ఆత్మ బ్రహ్మ కపాలం నుండి బయటకు రావాలి అప్పుడే వారి ఆత్మకు మోక్ష మార్గం దొరుకుతుందట.
చనిపోయిన తర్వాత బ్రహ్మ కపాలం నుండి, శరీరం నుండి బయటకు వచ్చిన ఆత్మకు మోక్ష మార్గం వెళ్ళేందుకు రెండు మార్గాలు ఉన్నాయట. అవి ఒకటి ఉత్తర మార్గం రెండు దక్షిణ మార్గం. ఉత్తర మార్గంలో వెలుగు ఉంటుంది. దక్షిణ మార్గంలో పూర్తిగా చీకటి కమ్మి ఉంటుంది. బయటకు వచ్చిన ఆత్మకు తలపక్కన ఉన్న దీపం ఉత్తర దిక్కుగా వెళ్ళమని దారి చూపిస్తుందట. తల దగ్గర ఉన్న దీపమే వెలుగు చూపించి సహయం చేస్తుందట. అందుకే శవం తల దగ్గర దీపం పెడతారు.

No comments:

Post a Comment