Friday, 16 June 2017

దారిద్ర్య నివారణ లక్ష్మీ ప్రయోగము.....................!!



ఇది ఇరవై రోజుల ప్రయోగము. సాధకులు ప్రాతః స్నానమాచరించి, పరిశుభ్ర వస్త్రాలు ధరించి పూజాగదిలో తెల్లని ఆసనం పై తూర్పుముఖంగా కూర్చోవాలి. ఎదుట అగరు వత్తులు, దీపం వెలిగించాలి. తరువాత చేతిలోకి నీరు తీసుకొని మనస్సు లోనే "దరిద్ర నివారణ కోసం ఈ సాధన ప్రారంభిస్తున్నాను" అని సంకల్పం చెప్పుకోవాలి. ఇలా ప్రతి రోజూ జపానికి ముందు ఈ సంకల్పం చెప్పుకోవాలి.
ఆ తరువాత మరల చేతిలోకి నీరు తీసుకొని ఈ క్రింది వినియోగాన్ని చెప్పాలి.ఇది ప్రతి రోజూ చెప్పాలి.
అస్యశ్రీ సర్వ బాధా వినిర్ముక్తేతి మంత్రస్య , శంకర ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ ధనదా దేవతా , హ్రీం బీజం , స్వాహా శక్తిః, మమాభీష్ట సిధ్యర్థే జపే వినియోగః
తర్వాత మంత్ర జపం ప్రారంభించాలి.
మంత్రము:---
ఓం సర్వ బాధా వినిర్ముక్తో ధన ధాన్య సమన్విత మనుష్యో మత్ప్రసాదేనా భవిష్యతి న సంశయః

ఈ మంత్రాన్ని రోజూ 500 సార్లు జపించాలి. 20 రోజులు ఖచ్చితంగా చేయాలి. మొత్తం 10,000 మంత్ర జపం తో ఈ సాధన చేయాలి.

No comments:

Post a Comment