Monday, 26 June 2017

రంజాన్, ఇఫ్తార్ విందుల ప్రత్యేకత ఏమిటో తెలుసా..!?




మహమ్మదీయుల క్యాలెండర్‌లోని తొమ్మిదో నెలలో "రంజాన్ పండుగ" వస్తుంది. మన క్యాలెండర్‌లో లాగా వారి క్యాలెండర్‌లోని నెలల్లో 30, 31 రోజులు ఉండవు. కేవలం 28 రోజులు మాత్రమే ఉంటాయి. అమావాస్య తర్వాత చంద్రదర్శనం నుంచి వారికి నెలా మొదలవుతుంది. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భుజిస్తారు. ఈ సందర్భంగా వారు ఖీర్ (పాయసం), బిరియానీ మామిడితో స్వీట్లు తదితరాలు చేసుకుని భుజిస్తారు.


ఈ ఉపవాసాల సమయంలో మహమ్మదీయులు ఇచ్చే విందునే "రంజాన్ విందు" అని పిలుస్తారు. రంజాన్ పండుగ నాడు ఇచ్చే విందుకు, రంజాన్ మాసంలో ఇచ్చే విందుకు మధ్య చాలా తేడాలు ఉన్నాయంటారు ముస్లిం సోదరులు. రంజాన్ నెల చివరి పది రోజుల్లో పవిత్ర గ్రంధం ఖురాన్ భూమికి చేరిందని ముస్లింల నమ్మకం.
సంవత్సరమంతటా ఏ దానాలు, చేయకపోయినా, ఉపవాసాలు ఉండపోయినా రంజాన్ నెలలో మాత్రం ముస్లిం సోదరులు తప్పకుండా దానధర్మాలు చేస్తారు. అనారోగ్యం కలిగిన వారు, వృద్ధులు, పిల్లలు తప్ప అందరూ ఈ రోజాలు (ఉపవాసాల)ను తప్పక పాటిస్తారు.




రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా' రోజా' ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే 'రోజా ' కాదు. నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున భోజనం చేసిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని' సహర్' అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ' ఇఫ్తార్' అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు. 



ఉపవాసదీక్ష పాటించేవారు అబద్దం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే. దీనిని ఖురాన్ 'తఖ్వా' అని అంటుంది.


No comments:

Post a Comment