Saturday, 24 June 2017

ఈరోజు 24-6-2017 శని అమావాస్య



















శనివారం రోజు వచ్చే అమావాస్యను శని అమావాస్య అంటారు. శని అమావాస్య రోజు చేసే దానధర్మాలు, పూజలు, పరోపకారం వంటివి ఎక్కువ శుభఫలితాలనిస్తాయి. అదే విధంగా శని అమావాస్యనాడు చేసే పాపాలు కూడా విపరీతమైన చెడ్డఫలితాలను కలిగిస్తాయి. కాబట్టి శని అమావాస్య రోజు చెడు చేయకుండా ఉండటమే మేలు.
జననకాల రీత్యా శని బాగాలేనివారు, శని మహర్దశ జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, గోచార రీత్యా గ్రహబాధలు అనుభవిస్తున్నవారు రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల గ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చని శాస్త్రం చెబుతోంది.అలాగే నువ్వుల నూనెతో శనికి అభిషేకం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, నల్ల చీమలకు పంచదార వేయటం, నల్ల కుక్కకి ఆహారం, కాకి కి అన్నం పెట్టడం, ఇనుము, నల్లని వస్త్రాలు, నల్లని గొడుగు దానం చేస్తే దోష పరిహరం జరుగుతుంది.
స్వామి కి బెల్లం ,నల్ల నువ్వులు నివేదన చెయ్యాలి.

ఈ రోజు పూజ ,అభిషేకం,మూకుడు దీపం,హోమం,జపం చేయించుకున్న వాళ్ళందరికీ ఆ స్వామి కటాక్షం లభించాలని ఆకాంక్షిస్థూ...

విధాత 
ఆస్ట్రో న్యూమరాలజీ,

No comments:

Post a Comment