Monday 12 June 2017

రాశిఫలం 12 - 19 జూన్ 2017



  మేషం : 
అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
 వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం. ప్రతిఫలం స్వల్పం. అధిక శ్రమ, విశ్రాంతి లోపం, గృహంలో కలతలకు ఆందోళన కలిగిస్తాయి. ఆది, గురు వారాల్లో ఏ విషయంపైనా శ్రద్ద వహించలేరు. ఆత్మీయులను కలుసుకోవాలనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు. పుస్తక పఠనంపై దృష్టిసారించండి. దైవకార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. పనివారల నిర్లక్ష్యం ఆగ్రహం కలిగిస్తుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆస్తి పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా మెలగాలి.


వృషభం : 
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
మంగళ, శని వారాల్లో ఇతరుల గురుంచి చేసిన వాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ఎటువంటి సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కొంటారు. మీ సమర్థన నిరూపించుకునే అవకాశం వస్తుంది. సహాయనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. వృత్తి వ్యాపార, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ద్యోగస్తుల వివరణ, పనితీరు అధికారులను సంతృప్తిపరుస్తాయి. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. బ్యాంకు పనుల్లో జాగ్రత్త. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. స్త్రీల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం . ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం, అన్యోన్యోత నెలకొంటాయి. చెక్కుల జారీ, చెల్లింపుల్లో మెలకువ వహించండి. 

మిధునం : 
మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
 వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటారు. భాగస్వామిక సమావేశాలకు అర్థాంతరంగా ముగించ వలసి వస్తుంది. వృత్తి పరంగా ప్రజాసంబంధాలు బలపడతాయి. ధనం కంటే ఇచ్చిన మాటకు విలువనిస్తారు. బంధువులకు మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కొబ్బరి, పండ్ల పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ది. దైవకార్యాలకు సహాయ సహాకారాలందిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. విందులు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత అవసరం. తొందరపాటుతనం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం వద్దు. గురు, శుక్ర వారాల్లో ఏ పని సవ్యంగా సాగక విసుగు చెందుతారు.

కర్కాటకం :
 పునర్వసు 4 వ పాదం.పుష్యమి, ఆశ్లేష
 అయిన వారి గురించి ఆరాటపడతారు. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో శ్రద్ద అవసరం. శనివారం అనవసర విషయాల్లో జోక్యం వల్ల చిక్కులు తప్పవు. అధికారుల ఆగ్రహావేశాలు మనస్తాపం కలిగిస్తాయి. ఆకస్మిక ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పొదుపు పథకాల ధనం ముందుగానే తీసుకోవలసి వస్తుంది. పనులు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల మేలే జరుగుతుంది. విద్యార్థులకు స్నేహ సంబంధాలు బలపడతాయి. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారాల విస్తరణ, ప్రాజెక్టులు, ఏజెన్సీల కోసం మరికొంత కాలం వేచిఉండటం ఉత్తమం. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహవాస్తు సవరణ, మార్పు వల్ల ఆశించిన మార్పులు సులభం.

సింహం : 
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
 పనులు అనుకున్న విధంగా సాగక విసుగు కలిగిస్తాయి. పెద్దలు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. హామీలు, మోహమ్మాటాలు ఇరకాటానికి గురిచేస్తారు. కుటుంబ క్షేమం కోసం బాగా శ్రమిస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులు సాదర వీడ్కోలు పలుకుతారు. నిస్తేజం వీడి ఇంటర్వ్యూలకు హాజరవ్వండి. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సునిశిత పరిశీలన ముఖ్యం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు జరిమానాలు. చికాకులు తప్పవు.  ఈ వారం కీలకమైన వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ వ్యయాలు ఫర్వలేదనిపిస్తాయి. దైవకార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పాతమిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది.

కన్య : 
ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యాపారాల్లో స్వల్ప లాభాలు, అనుభవం గడిస్తారు. వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కోర్టు, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. రోజువారి ఖర్చులే ఉంటాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. మీ యత్నాలకు సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ చదువులు, ఉద్యోగయత్నంలో సఫలీకృతులవుతారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. సమావేశాల్లో పాల్గొంటారు. చిన్న వ్యాపారులుకు ఆశాజనకం.  పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. స్త్రీలకు గృహాలంకరణ, విలువైన వస్తువులు పట్ల ఆసక్తి నెలకొంటుంది. ధన సహాయం, హామీలు, మధ్యవర్తిత్వాలు ఇరకాటానికి గురిచేస్తాయి. అధికారుల హోదా పెరగటంతో పాటు స్థాన చలనం తప్పదు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 

తుల : 
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
 విద్యార్థుల ఆలోచనల పక్క దారి పట్టే సూచనలున్నాయి. మీ సంతానం కదలికలను గమనిస్తుండాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. దైవ కార్యాలు, వైద్యసేవలకు బాగా వ్యయం చేస్తారు. మీ ఆరాటం, ఉత్సాహాలను అదుపులో ఉంచుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకమైన మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. నిరుద్యోగులకు తాత్కలిక అవకాశం లభిస్తుంది. ఒప్పందాలు, సంప్రదింపులు ఫలిస్తాయి. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. రహస్యాలు దాచిపెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. సందర్భానుగుణంగా సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆది, సోమ వారాల్లో పనివారలతో జాగ్రత్తగా మెలగాలి.

వృశ్చికం : 
విశాఖ 4వ పాదం అనూరాధ, జ్యేష్ట 
 స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యల ప్రభావం అధికం. కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా పోవాలి. వ్యవహారాల్లో మొహమ్మటాలు వీడండి. స్వయంకృషితోనే అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తి, స్వస్థలానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఒక సంఘటన మనస్థిమితం లేకుండా చేస్తుంది. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ముఖ్యం ప్రతి విషయాన్ని సునిశితంగా గమనించాలి. అధికారుకు ఒత్తిడి. ప్రలోభాలుకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు కోరుకున్న అవకాశం లభిస్తుంది. మిమ్ములను కాదన్న వారే మీ సాన్నిహిత్యం కోరుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దైవ, పుణ్యకార్యాలకు బాగా వ్యయం చేస్తారు. మంగళ, బుధ వారాల్లో ఆరోగ్యం జాగ్రత్త. దంతాలు, ఎముకల, నేత్ర సమస్యలు తలేత్తే సూచనలున్నాయి. 

ధనస్సు : 
మూల, పూర్వషాడ, ఉత్తరాషాడ 1వ పాదం 
 వృత్తుల వారికి ఆదాయాభివృద్ది, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచింది. మీ యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. బకాయిలు, సహోద్యోగులుతో సాన్నిహిత్యం నెలకొంటుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాల్లో కొత్త పనివారలతో చికాకులు తప్పవు. చిరు వ్యాపారులకు పురోభివృద్ది.  గతంలో ఇచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులు తప్పవు. చెల్లింపులు, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం, పట్టింపులు చోటు చేసుకుంటాయి.

మకరం : 
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్టం 1, 2 పాదాలు 
 శనివారం నాడు మనస్థిమితం లేక అన్యమస్కంగా ఉంటారు. మిమ్ములను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధం చేసుకుంటారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. చేపట్టిన పనుల్లో ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. రిటైర్డు ఉద్యోగస్తులకు గ్రాట్యుటీ, ఇతరత్రా రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. పొదుపు పథకాలే మీకు అనుకూలం. ప్రైవేట్ ఫైనాన్సుల్లో మదుపు చేయటం మంచిది కాదు. వాహన చోదకులు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయులతో సంభాషణలు, ప్రియతముల కలయిక సంతోషం కలిగిస్తుంది. స్తోమతకు మించిన ధన సహాయం, హామీలు ఇరకాటానికి గురిచేస్తాయి. వ్యాపార రంగాల వారికి సామాన్యం, వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లు, మార్కట్ రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి.

కుంభం : 
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
 అర్థాంతరంగా నిలిపి వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఆది, సోమ వారాల్లో దంపతుల మధ్య పట్టింపులు, చిరు కలహాలు చోటు చేసుకుంటాయి. అనునయంగా మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం మంచిది కాదు. గృహ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించాలి. విద్యార్థులు క్యాంపస్ ఎంపికలకు బాగా శ్రమించాలి. ఉపాధ్యాయుల ఆగ్రహం అనర్థాలకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పనిభారం అధికం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వృత్తుల వారి ఆదాయం ఆశించినంత సంతృప్తినీయదు. నూతన వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు. వ్యాపారాల విస్తరణ, ప్రాజెక్టులు, జాయింట్ వెంచర్ల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి. మీ భావాలు, అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.

మీనం : 
పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
 సమయస్ఫూర్తితో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అనుభవం. మెళకువలు గ్రహిస్తారు. చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, అదనపు బాధ్యతలు నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. గృహ వాస్తు దోష నివారణ క్షేమ దాయకం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పనులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ మాటపై అవతలి వారికి నమ్మకం కలుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయాలి. స్త్రీలు కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. మంగళ, బుధ వారాల్లో అయిన వారి గురించి ఆందోళన చెందుతారు.
 

 

 

 

 

 

 

 

 


 

No comments:

Post a Comment