ఇతర ప్రభావాలను వదులుకుని భగవంతునిపై పూర్తి ఏకాగ్రతను నిమగ్నంచేయడానికి విగ్రహాలను పూజిస్తారు. స్థిరచిత్తాన్ని ధ్యానం అంటారు. మనస్సు స్థిరంగా లేనప్పుడు విగ్రహ పూజ అవసరం. మనస్సు నియంత్రణ కోసం విగ్రహారాధనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఇది మనస్సు స్థిరపడటానికి అవసరమయ్యే జ్ఞానాన్ని, స్ఫూర్తినిస్తుంది.
ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని గురువుగా ఆరాధిస్తూ, అర్జునుడికి మించి గొప్ప నిపుణుడయిన సంగతిని సదా స్మరణకు తెచ్చుకోవాలి. ఇలా మన ప్రతి ఆచారం వెనుకా ఓ పరమార్థం వుంది. పెద్దవాళ్ళు చేశారు కదా అని ఆచారాల్ని యాంత్రికంగా అనుసరించకుండా.. ఆచార సంప్రదాయాల వెనుక వున్న సారాంశాన్ని అర్థం చేసుకోవాలి.
విగ్రహాలను ఎందుకు పూజిస్తారో తెలుసా?
ReplyDelete