Wednesday, 7 June 2017

ద్వారక..... శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక....



 








చరిత్ర చెప్పినదానిని పోల్చి చూస్తె... ఈ ద్వారక నగరం గౌతమి నది అరేబియా సముద్రంలో కలిసే దగ్గర ఉన్నదని తెలుస్తూంది... కంస సంహారానంతరం శ్రీకృష్ణుడు (Feb 9, Friday , 3219 BC ) ... సముద్రుని సహకారంతో విశ్వకర్మ సారధ్యంలో 12 యోజనాల విస్తీర్ణంతో 6 సేక్టర్ల తో.... ఈ పట్టణాన్ని సువర్నమయంగా నిర్మించినదని తెలుస్తుంది... అందులో ఉండే వీధులు... ఆకాశ హర్మ్యాలు అన్నీ ఎంతో అధ్బుతంగా ఉండేవని వర్ణన... (సముద్ర మధ్యం లో ఇంత పెద్ద నిర్మాణాన్ని నెలకొల్పాలంటే ఎంత విజ్ఞానాన్ని వాడి ఉండాలి..)




మన పురాణాల ప్రకారం...అర్జునుడు శ్రీ కృష్ణుడు చనిపోయినతర్వాత ద్వారక సముద్రంలో కలిసిపోయే సమయంలో అక్కడే ఉన్నడని.. చివరి సౌధం మునిగిపోయి మామూలు సరస్సు మాదిరి అయ్యే వరకు.. ఆ స్తలాన్ని వదలలేదట (బాధతో నిష్క్రమిస్తాడట).... ఆ సమయాన్ని పోలిస్తే సుమారు ఈ సంఘటన క్రీ. పూ. 3102 సంవస్త్సరంలో జరిగింది...






ప్రస్తుతం ఈ ప్రాంతంలో లభించిన అవశేషాలను... పురావస్తు శాస్త్రజ్ఞులు లెక్క వేసే దాని ప్రకారం ఖచితంగా కృష్ణుడి ఉనికి సూచిస్తున్నాయి.... వీటన్నిటి ఆధారాలు లభిస్తున్నాయి.... దీని వెంట ఆ చరిత్రకు సంబంధిన చిత్రాలను కూడా ఉంచుతున్నాను... వీక్షించండి...


సముద్రంలో పరిశోధించిన ఆ కాలానికి సంభందించిన పాత్రలు.... గంట.... వీటన్నిటిని పరిశోధిస్తే అవి (క్రీ. పూ. 3103 ) 5102 సంవత్సరాల క్రిందవని తెలిసింది.. ప్రపంచం లోహన్నే కనుగొనని సమయాన పెద్ద పెద్ద లంగరులు లభించాయంటే ఎంత పెద్ద ఓడల నిర్మాణం చేపట్టి ఉండవచు.. ఇక్కడ దొరికిన లంగరులను చూస్తే అదే తెలుస్తుంది.... ఆ కాలంలో వాడిన పాత్రలు చూస్తే అవి మిశ్రమ లోహానికి సంభందించినవి.... అప్పటికి ఇంకా అల్యూమినియం కనుక్కోలేదు.... మన శాస్త్రజ్ఞులకు సింధు నాగరికత... హరప్పా మొహంజొదారో నాగరికత కు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రమే దొరికాయి.... కాని అవి క్రీ.పూ. 3200 వి కావు... అవి 1300 BC కు సంబందిచినవి...
ద్వారకకు సంభందించిన నాగరికత చాల పురాతనమయినది.... ఈ ఆనవాళ్ళు ఎవరికీ దొరకక పోవటం... చరిత్రలో ఎక్కక పోవటం .. విచిత్రం... హాస్యాస్పదం....

No comments:

Post a Comment