Friday 23 June 2017

జ్యోతిష్యశాస్త్రంలో శని స్తానం

వేదసంబంధమైన జ్యోతిష శాస్త్ర ప్రకారం, శని భగవానుడు నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలలో ఒకడు. శని అత్యంత శక్తివంతమైన ప్రతికూల ప్రభావములు కలుగచేయువానిగా, మరియు సహనము, కృషి, ప్రయత్నం, ఓర్పులకు ప్రతీక అయిన దృఢమైన గురువుగా; మరియు ఆంక్షలను, నియమాలను విధించేవాడుగా పరిగణింపబడ్డాడు. ఏమైనప్పటికీ, ఒక వ్యక్తి యొక్క జాతకచక్రంలో శని అనుకూల స్థానంలో ఉన్నచో ఆ వ్యక్తికి శక్తివంతమైన వృత్తి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం మరియు అన్ని విషయములు సానుకూలముగా ఉండును. నిజానికి, జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే ప్రతి హిందూ మతస్థుడు తన జాతకచక్రంలో శని అనుకూల స్థానంలో ఉండాలని కోరుకుంటాడు, ఎందుకనగా మరి ఏ ఇతర 'గ్రహం' అనుకూలమైన స్థానంలో ఉన్నా కుడా శని ఇచ్చే మంచి ఫలితాలను ఇవ్వలేదు. మరోవైపు "ప్రతికూల" స్థానంలో ఉన్న శని, పై విషయములన్నింటిలో సమస్యలు సృష్టించును.
శని ప్రతికూల స్థానములో ఉన్నచో కలిగే "దుష్ఫలితాలు" చాలా తీవ్రముగా ఉండుటచే, జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే హిందువులు శని అనగా మిక్కిలి భయపడతారు. ఏమైనప్పటికీ, శని ఒక వ్యక్తి అనుభవించే సుఖాలు లేదా కష్టాలకు కారణభూతుడుగా భావించబడుతున్నాడు, శని "ఉనికి"ని అనుసరించి ఆ వ్యక్తి యొక్క కర్మ ఫలితాలుగా గుర్తించబడినవి. కావున "ప్రతికూల స్థానం"లో ఉన్న శని ఒక వ్యక్తి యొక్క చెడు కర్మల ఫలితాలకు కారణభూతుడుకాగా, అనుకూల స్థానంలో ఉన్న శని మంచి కర్మల ఫలితాలు కారణభూతుడు ఔతాడు. ఆరోగ్యపరంగా చూస్తే క్షీణత, బిగుసుకుపోవడం, క్షీణించిన రక్త ప్రసరణ, కృశించిపోవడం, మొదలైన అనారోగ్యాలు, మరియు సరిగా ఆలోచించలేకపోవుట, అసమత్వ బుద్ధి కలిగుండటం వంటి మానసిక సమస్యలు శని భగవానుని ప్రభావముచే కలుగును. ఈ రొగములన్నీ జాతకచక్రంలో శని ఉపస్థితను అనుసరించి నిర్ణయించబడతాయి.
శని గ్రహం ఒకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమించటానికి 30 సంవత్సరాలు పడుతుంది, అనగా ఈ 30 సంవత్సరాలలో ఇది 12 రాశులు లేదా సంపూఋణ సూర్యభ్రమణం చేయుటకు పట్టు కాలం. కావున ప్రతి రాశి లేదా చంద్ర రాశులలో శని భగవానుడు సగటున రెండున్నర సంవత్సరాలు గడుపును. రాశుల గుండా శని యొక్క ఈ ప్రయాణానికి హిందూ జ్యోతిష్యశాస్త్రంలో మరియు భవిష్యత్తును చెప్పుటలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏలిన నాటి శని యొక్క ప్రభావం వారి యొక్క జన్మ రాశికి ముందు రాశిలో ప్రవేశించినపుడు ప్రారంభమై జన్మరాశి తరువాత రాశిలోనికి ప్రవేశించడంతో ముగుస్తుంది. మొత్తము ఈ 7.5 సంవత్సరాల (2.5 సంవత్సరాలు×3) కాలాన్ని సాడెసాతి లేదా "ఏల్నాటి శని"గా పరిగణిస్తారు, ఇది జీవితంలో అత్యంత కష్ఠ కాలం. శని మహాదశ లోనికి ప్రవేశించే ముందు ఈ గ్రహం యొక్క దుష్ప్రభావాలు చాల ఎక్కువగా ఉంటాయి. ఈ దశలో శని రాజును కూడా దరిద్రునిగా మార్చగలడని చెప్పబడింది.
శని మకర (కాప్రికార్న్) మరియు కుంభ (అక్వేరియస్) రాశులను పాలించువాడుగా, తుల (లిబ్రా) లో ఉన్నతమైన వాడుగా మరియు మేషరాశి (ఏరిఎస్) లో నిస్త్రాణుడుగా ఉండును. బుధుడు, శుక్రుడు, రాహు, కేతులు శనికి స్నేహితులుగా, సూర్యుడు, చంద్రుడు మరియు అంగారకుడు శత్రువులుగా పరిగణింపబడ్డారు. గురు లేదా బృహస్పతి శనితో తటస్థ వైఖరిని అవలంబించును. శని పుష్యమి, అనురాధ, మరియు ఉత్తర బాధ్రపద నక్షత్రాల, చంద్రభావనాల అధిపతి.
శని భగవానుని వర్ణన పురాణాలు మరియు జ్యోతిషశాస్త్రంలో ఇలా వర్ణించబడి ఉంటుంది. ఆయన వర్ణం నలుపు లేదా ముదురు నీలం, లోహం ఇనుము మరియు రత్నం నీలం. ఈయన మూలసూత్రం లేదా తత్త్వం వాయువు, దిక్కు పడమర (సూర్యుడు అస్తమించి చీకటి ప్రారంభమయ్యే చోటు) మరియు అన్ని ఋతువులను పాలించును. నువ్వులు, మినుములు, నల్లని ధాన్యాలు శని యొక్క సంప్రదాయ ఆహారపదార్థాలు, ఈయన పుష్పం ఉదారంగు మరియు అన్నీ నల్లని జంతువులు ఇంకా అన్నీ పనికిరాని మరియు అసహ్యమైనవాటిగా పరిగణించబడే వృక్షములతో జోడించబడ్డాడు.
శని సమూహములను పరిపాలించును. వారివారి జాతకాలలో శనిగ్రహం అనుకూల స్థితిలో లేకున్న జన సమూహం పాలించడం అనేది చాలా కష్టం. వ్యక్తి యొక్క జాతకచక్రంలో శని ప్రాబల్యం (లేదా లగ్నం) ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, సదరు వ్యక్తి జన సమూహమందు మంచి నాయకునిగా గుర్తింపు మరియు కీర్తిని పొందును. అంతేకాక, అటువంటి వ్యక్తులు తమ చేతిలో ఉన్న కార్యము పట్ల మిక్కిలి అంకితభావం మరియు పట్టు కలిగివుంటారని చెప్పబడింది. మరోవైపు, వ్యక్తి జాతకచక్రంలో శని బలహీనునిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి 'కర్మ' బలహీనమై తన బాధ్యతల పట్ల అంకితభావం మరియు పట్టు లేకపోవడంచే బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమగును. అందుచే వ్యక్తి జాతకంలో శనీశ్వరుని దీవెనలు లేనిదే 'మోక్షం' లభించుట కష్టం.
శనీశ్వర భగవానుడు న్యాయమూర్తిగా కూడా పిలువబడతాడు. ఈయన, వ్యక్తి చేసిన పాప కార్యములకు తన దశలో శ్రమ పెట్టును. శని దోషం ఉన్న సమయంలో కూడా వ్యక్తి ధర్మంగా మరియు భక్తితో ఉన్నచో కచ్చితంగా చెడు ప్రభావములనుండి బయటపడగలడు.
శని భగవానుడు తన చెడు ప్రభావములకంటే కూడా దీవెనలకు ప్రసిద్ధుడు. దీవెనలు అందించుటలో మరి ఏ ఇతర గ్రహాన్ని శనితో పోల్చలేము. తన దశ చివరిలో ఆయన దీవెనల వర్షం కురిపించును. ప్రజాపతి ఈయన అది-దేవత కాగా యముడు ప్రత్యాది-దేవత. శనిదేవుడు వ్యక్తి యొక్క సహనాన్ని పరీక్షించును, చిరాకులను మరియు జాప్యాన్ని కలుగచేయుటచే మన అధర్మమైన పనులను సరిదిద్దును. చివరిలో మనం చేసే తప్పులను తెలుసుకొనే జ్ఞానమును ప్రసాదించును. ఆయన శిక్షించడం ద్వారా అంతరంగములో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టును, జీవి లేదా వ్యక్తి ఆత్మను పరిపూర్ణం చేయుటద్వారా వ్యక్తి లోపలినుండి రాగి నుండి బంగారముగా మారును అనగా అతను జీవిత సత్యాలను, తాను అజ్ఞానముచే చేసిన పనుల నిరర్థకతను అర్థంచేసుకుంటాడు. శని దశ తరువాత మానవుల అధీనంలో పెద్దగా ఏమి లేదని మనిషి అర్థంచేసుకుంటాడు. ఇదంతా మానవులపై దేవతలు కర్తలుగా, పవిత్ర స్వరూపం చేయించును. శని దేవుడు గొప్ప పరిశుద్ధుడు, అసత్యమైనదంతా నశించిపోయి సత్యమైనది మాత్రమే ప్రకాశిస్తుంది అనేది ఆయన సందేశం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 8వ సంఖ్యలో జన్మించినవారు శనిదేవునిచే పాలింపబడతారు. ఏ నెలలోనైనా 8, 26 తేదిలలో జన్మించిన వారు జీవితంలో కష్టాలను ఎదుర్కుంటారు అనేది రుజువు చేయబడిన యదార్థం. ఈ కష్టాలకు కారణం ఉంటుంది, ఇంకా ఆ కారణాన్ని వారి జీవిత కాలంలో గుర్తించటం ముఖ్యం. చెడు పనులకు బాధ్యత వహించటం, ఆత్మవిమర్శ మరియు కష్టించి పనిచేయుట వంటివి శనిదేవుని శాంతింపచేయుటకు మార్గాలు. శనివారాలలో నీలపు వస్త్రాన్ని దానం చేయటం మరియు పేదవారిని సేవించటం కూడా సహాయపడును.

No comments:

Post a Comment