Friday, 23 June 2017

'శనీశ్వరుడు'



హిందూ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' , నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవుడు. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.


శనీశ్వరుడి జననం

శనీశ్వరుని తల్లిదండ్రులు:

సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి, అతని రెండవ భార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి, ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.


ఇతర నామాలు: ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి స: అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.

శనీస్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు:
నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రత, మందకొడిగా ఉండటం.

ధర్మ రక్షకుడు

ఎద్దు వాహనముపై శని దేవుడు

సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.
గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.(మరి అదే నిజమయితే మన మధ్య నిత్యం జరుగుతున్న అరాచకాలు, అవినీతి, మోసాలు నిరాటకంగా ఎలా సాగి పోతున్నాయి? అని సందేహం కలగవచ్చు. శని దేవుడి ప్రణాళికలేమిటో సామాన్యులమైన మనకు తెలుస్తుందా!). తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.
నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.
శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .

శని మహత్యం

 

శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్థించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

శనీశ్వర జపం

శనీశ్వరుడి జప మంత్రాలు

నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం


|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం:
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.


|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||

బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":

||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||
||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం
శనిగ్రహ జపం
ఆవాహము
అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర
గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే
శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః
కరన్యాసం
ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః
ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః
ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః
ఓం శంవాతః - అనామికాభ్యాం నమః
ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః
ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః అంగన్యాసము:
ఓం శమగ్ని: - హృదయాయ నమః
ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ
ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్
ఓం శంవాతః - కవచాయహు
ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్
ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం
ఆదిదేవతాః
ఇమం యమ ప్రస్తరమాహి సీదాంగి రోభి: పితృభిప్సం విధానః!
అత్వా మంత్రాః కవిసహస్త్వా వహ న్వైనారాజన్ హవిషామదయస్వ!!
ప్రత్యథి దేవతా: ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ!
యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం!!
వేదమంత్రం
ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః
శని కవచ స్తోత్రము శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు!
నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు!
హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు!
ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు!
పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః!
ఫలశ్రుతి:
య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్!
శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః!
నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం!
షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!
శన్యష్టోత్తర శతమామావళి ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః
ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః
ఓం సౌమ్యాయ నమః ఓం సురవంద్యాయ నమః ఓం సురలోక విహారిణే నమః
ఓం సుఖాననోవిష్టాయ నమః ఓం సుందరాయ నమః ఓం ఘనాయ నమః
ఓం ఘనరూపాయ నమః ఓం ఘనాభరణధారిణే నమః ఓం ఘనసారవిలేపాయ నమః
ఓం ఖద్యోతాయ నమః ఓం మందాయ నమః ఓం మందచేష్టాయ నమః
ఓం మహనీయగుణాత్మనే నమః ఓం మర్త్యపావనపాదాయ నమః
ఓం మహేశాయ నమః ఓం ఛాయాపుత్త్రాయ నమః ఓం శర్వాయ నమః
ఓం శ్రతూణీరధారిణే నమః ఓం చరస్థిరస్వభావాయ నమః ఓం చంచలాయ నమః
ఓం నీలవర్ణాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నీలాంబసనిభాయ నమః
ఓం నీలాంబరవిభూషాయ నమః ఓం నిశ్చలాయ నమః ఓం వేద్యాయ నమః
ఓం విధిరూపాయ నమః ఓం విరోధాధార భూమయే నమః
ఓం వేదాస్పదస్వాభావాయ నమః ఓం వజ్రదేహాయ నమః ఓం వైరాగ్యదాయ నమః
ఓం వీరాయ నమః ఓం వీతరోగభయాయ నమః ఓం విపత్పరంపరేశాయ నమః
ఓం విశ్వనంద్యాయ నమః ఓం గృద్రహహాయ నమః ఓం గుధాయ నమః
ఓం కూర్మాంగాయ నమః ఓం కురూపిణే నమః ఓం కుత్సితాయ నమః
ఓం గుణాధ్యాయ నమః ఓం గోచరాయ నమః ఓం అవిద్యామూలనాశాయ నమః
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ఓం ఆయుష్యకారణాయ నమః ఓం ఆపదుద్దర్త్రే నమః
ఓం విష్ణుభక్తాయ నమః ఓం వశినే నమః ఓం వివిధాగమనేదినే నమః
ఓం విధిస్తుత్యాయ నమః ఓం వంద్యాయ నమః ఓం విరూపాక్షాయ నమః
ఓం వరిష్టాయ నమః ఓం వజ్రాంకుశధరాయ నమః ఓం వరదాయ నమః
ఓం అభయహస్తాయ నమః ఓం వామనాయ నమః ఓం జేష్టాపత్నీసమేతాయ నమః
ఓం శ్రేష్టాయ నమః ఓం అమితభాషిణే నమః ఓం కస్టౌఘనాశకాయ నమః
ఓం ఆర్యపుష్టిదాయ నమః ఓం స్తుత్యాయ నమః ఓం స్తోత్రగమ్యాయ నమః
ఓం భక్తివశ్యాయ నమః ఓం భానవే నమః ఓం భానుపుత్త్రాయ నమః
ఓం భావ్యాయ నమః ఓం పావనాయ నమః ఓం ధనుర్మందల సంస్థాయ నమః
ఓం ధనదాయ నమః ఓం ధనుష్మతే నమః ఓం తనుప్రకాశ దేహాయ నమః
ఓం తామసాయ నమః ఓం అశేషజనవంద్యాయ నమః ఓం విశేషఫలదాయినే నమః
ఓం వశీకృతజనిశాయ నమః ఓం పశూనాంపతయే నమః ఓం ఖేచరాయ నమః
ఓం ఖగేశాయ నమః ఓం ఘననీలాంబరాయ నమః ఓం కాఠిన్యమానసాయ నమః
ఓం అరణ్యగణస్తుత్యాయ నమః ఓం నీలచ్చత్రాయ నమః ఓం నిత్యాయ నమః
ఓం నిర్గుణాయ నమః ఓం గుణాత్మనే నమః ఓం నిరామయాయ నమః ఓం నింద్యాయ నమః
ఓం వందనీయాయ నమః ఓం ధీరాయ నమః ఓం దివ్యదేహాయ నమః ఓం దీనార్తి హరణాయ నమః
ఓం దైన్య నాశకరాయ నమః ఓం ఆర్యజనగణణ్యాయ నమః ఓం క్రూరాయ నమః
ఓం క్రూరచేష్టాయ నమః ఓం కామక్రోధకరాయ నమః ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః
ఓం పరిపోషితభక్తాయ నమః ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః

శనీశ్వరుడు ప్రసన్నుడవాలంటే

కంటక శని : (చాంద్రయానాన్ని అనుసరించి జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంటిలోనికి శని ప్రవేశించినప్పుడు) లేదా, ఏలినాటి శని: (చాంద్రయనాన్ని అనుసరించి జన్మరాశి నుండి పన్నెండు, మొదటి మరియు రెండవ ఇంటిలోనికి శని యొక్క గమన సమయంలో) ఉన్నా శని ప్రస్సనుడవాలంటే:
  1. అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి.
  2. విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ 'ఓం నమో నారాయణాయ', 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..' అని జపించాలి.
  3. హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై, చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలంఅంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకుని, "న్నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు" అని దీవించాడట.
  4. శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్ఠమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి.
  5. బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.
  6. నల్ల గోవు (కపిల గోవు) కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి.
  7. శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉందాలి.
  8. కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి.
  9. వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి.
  10. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.
  11. శని క్షేత్రాలు సందర్శించాలి.
  12. ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
  13. దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి.
  14. శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి.
  15. మూలమంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది.
  16. శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది.
  17. శనైశ్వర దీక్ష, శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి.
  18. 'రామ నామం', హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతులను జపించటం.
  19. హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది.
  20. పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి.
  21. అనాథ బాలలకు అన్నదానం చేయాలి.
పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.

No comments:

Post a Comment