వేదాలలో శని
వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.
అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.
చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.
గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.
శని
తొలిసృష్టిలో వేడికి సకలచరాచరముల మలమల మాడిపోవుచున్నప్పుడు బ్రహ్మ సూర్యుని జూచి దేవతలే నీవేడిమి కాగలేకున్నారు; ఇక మానవుల లెక్కయేమి అని అనగా సుర్యునకు కోపము వచ్చెనట అందులకె శని పుట్టెనట అని పరాశరడు చెప్పెను.పురాణములలో చాయా సూర్యుల కుమారుడు శని. ఇతడు నల్లనివాడు.ఇతనికి చాయాసుతుడు, అసితుడు, అసితాంబరుడు అని పేర్లు.
పురాణాలలో శనీశ్వరుడు
శని భగవానుడి జీవిత కథ శ్రీ శనిమహాత్మ్యం అనే అతి ప్రాచీన గ్రంథంలో తెలుపబడింది. ఈ గ్రంథంలో శని దేవుడిని ప్రార్తించి, మెప్పించి ఆయన కృపను, ఆశీస్సులు పొందుటకు ఎంత కష్టమో,ఎంతటి భక్తి శ్రద్ధలు అవసరమో వివరించబడింది. శ్రీ శని మహాత్మ్యం ఇతర గ్రహాల యొక్క ప్రాముఖ్యత, వాటి బలాబలాలను గూర్చి వివరిస్తూ ప్రారంభమవుతుంది. మొట్ట మొదటగా ఈ విషయాలను విశ్లేషించిన ఘనత ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్యుని ఆస్థాన పండితులకు దక్కుతుంది.హనుమంతుడు
హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో, హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైతే హనుమంతుని, ముఖ్యంగా శనివారాలలో, పూజ చేసి ప్రార్థిస్తారో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.శని భగవానుడు మరియు హనుమంతునడి మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతుడిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుడి భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచి, శనిని, తన భుజాలు, పైకప్పు మధ్య పెట్టి బంధించి, నొక్కడం మొదెలెట్టాడట. నొప్పిని భరించలేక శననీశ్వరుడు, తనను విడిచిపెట్టమని పతరి విధాల వేడుకుంటూ, హనుమంతుడిని ప్రార్థించాడట. తనను విడిచి పెట్టినట్టయితే, ఎవరు హనుమంతుడిని ప్రార్థిస్తారో, వారిపై తన (శని) యొక్క దుష్ప్రభావాలు లేకుండ చేసెదనని శనీశ్వరుడు, హనుమంతుడికి మాట ఇచ్చిన తరువాత శనిని విడిచిపెట్టాడట.
No comments:
Post a Comment