యోగశాస్త్రం అనాదిగా మన దేశంలో ఉన్న సంప్రదాయం. ఉపనిషత్తుల్లో చాలా చోట్ల యోగం యొక్క ప్రస్తావన ఉంది. మనస్సును పవిత్రం చేసుకోవడానికి ఉపయోగించే మార్గంగా దీన్ని ఉపాసనలతో జోడించి చెప్పారు. భగవద్గీత ఆరవ అధ్యాయం అంతా యోగాభ్యాసానికి సంబంధించినదే. నాస్తిక సంప్రదాయాలైన బౌద్ధ, జైన మతాల్లో కూడా చాలా నిశితంగా వీటిని అభ్యాసం చేశారు. బహుశా బౌద్ధుల కాలంలోనే యోగశాస్త్రం మనదేశం ఎల్లలు దాటి టిబెట్, చైనా తద్వారా మిగతా ఆసియా దేశాలకు కూడా విస్తరించింది. అన్ని భారతీయ సంప్రదాయాలూ యోగాన్ని అంగీకరించినా ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశాల్ని సూత్రాల రూపంలో పతంజలి అనే ఋషి వ్రాశాడు. వీటినే పతంజలి యోగసూత్రాలు అంటారు. ప్రపంచంలోని మేధావులందరూ ప్రశంసించిన గ్రంథమిది.
యోగం అనే పదానికి కలయిక అని అర్థం. ఇది వరకు లేనిదాన్ని పొందడం, లేదా ఇది వరకూ తెలియనిదాన్ని తెలుసుకోవడం. భగవద్గీతలో ప్రతి అధ్యాయం పేరులో యోగ అనే పదం ఉంటుంది. అది ఆ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని సూచిస్తుంది. ప్రస్తుత వ్యాసం అలాకాక యోగశాసా్త్రనికి సంబంధించినది. దీన్ని అభ్యాసం చేసే వ్యక్తి ఇది వరకు తెలియనిదాన్ని తెల్సుకోవడం ఇందులోని విషయం. జీవుడు తాను కేవలం శరీరం, ఇంద్రియాలు కాదనీ, చైతన్యం తన నిజరూపమనీ తెలుసుకోవడం.
శరీరానికి, మనస్సుకు ఉన్న సంబంధాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రం యోగశాస్త్రం. సాధారణంగా యోగమంటే ఏవో ఆసనాలు వేయడం, శరీరాన్ని అనేక రీతుల్లో వంచడం, గాలిని బిగబట్టడం మొదలైనవేనని భావిస్తూ ఉంటాం. ఈ విధమైన ఆసనాలు, గాలిని బిగబట్టడం లాంటివి యోగశాస్త్రంలో ప్రాథమిక అభ్యాసాలు మాత్రమేనని యోగసూత్రాల్ని చూస్తే గమనించగలం. మరి ఇందులో అసలైన విషయమేమిటి అని పరిశీలిద్దాం.
చైతన్యం అనే రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చర్చ అన్ని భారతీయ దర్శనాల్లో చూడగలం. జడం నుండి చైతన్యం వచ్చిందని కొందరు, చైతన్యమే జడంగా మారిందని కొందరు, చైతన్యం జడంగా కనిపిస్తుందని మరికొందరు ప్రతిపాదించారు. ఈ సమస్యకు సమాధానానికై ఈనాటికీ భౌతిక శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు కలిసి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఆధునిక మనస్తత్వశాస్త్రజ్ఞులు మన యోగశాస్త్రం చేసే ప్రతిపాదనల్ని స్వీకరించి ఈ యోగ విధానాల్ని అభ్యాసం చేసే సాధువులు, బౌద్ధభిక్షువులు మొదలైన వారితో కూడా కలిసి పనిచేస్తున్నారు.
ఇలాంటి ప్రయోగాలకు మనిషి(అన్ని జీవుల) శరీరమే ప్రయోగశాలలాంటిది. దీనిలో ఒక ఆలోచనాశక్తి ఉంది, శరీరం, ఇంద్రియాలు, అవయవాలు ఉన్నాయి. ఆలోచనాశక్తి చైతన్యానికి సంబంధించిన అంశం. శరీరం, ఇంద్రియాలు జడానికి చెందిన అంశాలు. ఈ రెండూ కలగాపులగంగా విడదీయరానివిగా శరీరంలో ఉన్నాయి. ఏది దేనిపైన ఆధారపడి ఉంది, ఏది ప్రధానమైనది అని తెలియాలంటే శరీరము, మనస్సు అనే లేబొరెటరీతోనే పరిశీలన చేయాలి.
శాస్త్రవేత్తలు దేన్నీ నిర్ధారించి చెప్పనప్పటికీ వేదాంతం. సాంఖ్యము, యోగశాస్త్రమూ చైతన్యమే ప్రధానమైనదని చెపుతాయి. ప్రాణుల శరీరం, ఇంద్రియాలు, మనస్సు అనేవి సృష్టిలో ఉన్న పృథివి, జలం, అగ్ని మొదలైన ఐదు భూతాల పరిణామంగా ఏర్పడినవే (్ఛఠిౌజూఠ్ఛి) అని ఇది వరకు వ్యాసాలలో గమనించాం. శరీరం, అవయవాలు స్థూలమైనవి, అంటే బండవి, చైతన్యం లేనివి అని చెప్పవచ్చు. మనస్సు వీటికన్నా మెరుగైనది. దీనికి విషయాల్ని గ్రహించే శక్తి ఉంది. అందుకే దీన్ని సూక్ష్మమైనది అన్నారు. మనిషికి ‘నేను’ అనే భావన ముఖ్యంగా స్థూలమైన శరీరంపై ఉంటుంది. దీనికి ఆకలి, దప్పికతో పాటు, ఇంద్రియాల సంతోషానికై అనేక కోరికలు ఉంటాయి. మనస్సు వీటి వెంబడి పరిగెడుతూ ఉంటుంది. ఈ కోరికలు తీరనప్పుడు మనస్సు తీవ్రంగా కలత చెందుతుంది. దాని ప్రభావం శరీరంపై ఉంటుంది. కానీ మనిషి స్వరూపం శరీరం, ఇంద్రియాలు కాదు, చైతన్యం అని ఉపనిషత్తులు చెప్పినట్లే పతంజలి కూడా చెబుతాడు. అందువల్ల సాధన మార్గంలో ఉన్న వ్యక్తి ‘నేను’ అనే భావనను స్థూల శరీరం నుండి తీసివేసి తన స్వరూపం చైతన్యమే అని గమనించాలనేది యోగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇలా గమనించడానికి మనస్సుకు చాలా అభ్యాసం కావాలి. ఇలాంటి అభ్యాసాన్నే యోగశాస్త్రం చెప్తుంది.
మనస్సు శరీరంపై ప్రభావం చూపుతుందని మనకు తెలుసు. ఏదైనా ఎక్కువ సంతోషాన్ని, దుఃఖాన్ని కలిగించే వార్తలు విన్నప్పుడు మనిషి ఉద్వేగానికి లోనౌతాడు. కానీ శరీరాన్ని నియంత్రించడం ద్వారా మనస్సును ప్రభావితం చేయగలం అనేది యోగశాస్త్రంలో మౌళికమైన సూత్రం.పతంజలి తన యోగసూత్రాల్లోని మొదటి మూడు సూత్రాల్లోనే విషయాన్నంతా సంగ్రహంగా చెప్పాడు. యోగమంటే మనస్సులోని అన్ని ఆలోచనల్నీ నిరోధించడం అని, అలా చేసినపుడు సాధకుడు తన అసలు స్వరూపమైన చైతన్యంలో ఉంటాడని, అలా చేయలేనప్పుడు బయటి ప్రపంచంతో మమేకమై కష్టసుఖాలు అనుభవిస్తుంటాని మొదటి మూడు సూత్రాలు. మిగతా గ్రంథమంతా ఈ మూడింటిపైన వచ్చిన వ్యాఖ్య. మనస్సును అదుపులో తేవడానికి ఎనిమిది మెట్లు చెప్పారు. దీన్నే అష్టాంగయోగం అన్నారు. మొదటగా శరీరానికి సంబంధించిన అభ్యాసాలు. ఒక విషయంపై కోరిక కలిగినపుడు బలవంతంగా శరీరాన్ని నిగ్రహించుకోవడం మొదటి మెట్టు. మంచి, చెడులు విచారించి, మనస్సును కోరికలవైపు వెళ్ళకుండా చేయడం రెండవ మెట్టు. మూడవమెట్టు మనందరికీ తెలిసిన ఆసనాలు. ఇవి శరీరానికి కష్టం కలిగించేటట్టుగా లేకుండా ఆలోచించడానికి అనువైన పద్ధతిలో ఉండాలి. ఆ తర్వాత గాలిపై నియంత్రణ మొదలైన మెట్లు చెప్పబడ్డాయి. వీటిని పుస్తకాల ద్వారానే కాక ఒక మంచి సాధకుడైన గురువు పర్యవేక్షణలో అభ్యాసం చేయడం ముఖ్యం.
యోగశాస్త్రంలో దేవుడి ప్రస్తావన కేవలం ఒకే సూత్రంలో ఉంది. మనిషికున్న క్లేశాలు, కర్మఫలం మొదలైన వాటికీ, దేశకాలాలకూ అతీతంగా ఉన్న సర్వజ్ఞుడైన వ్యక్తి అని మాత్రమే చెప్పబడింది. కావున ఇది ఏ మతవిశ్వాసానికీ, ఏ దేవుడికీ చెందింది కాదు. ప్రపంచంలో ప్రతి మనిషికీ శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఒకటే. అందువల్లే ఈ శాస్త్రంలోని విశ్లేషణపై మనకన్నా ఎక్కువగా ఇతరులు శ్రద్ధ చూపుతున్నారు. పాశ్చాత్య మనస్తత్వశాసా్త్రనికి మూల పురుషుడు అని పిలవబడే (హార్వర్డ్ విశ్వవిద్యాలయం) వివేకానందుని శిష్యుడు. వివేకానందుడు ఇతని ఆతిథ్యంలో ఉండేవాడు. ఇతడు చెప్పిన టఛిజీౌఠటుటట అనే భావన యోగసూత్రంలోనిదే. హిందూ, బౌద్ధ సంప్రదాయాల్ని క్షుణ్ణంగా చదివాడు. అలాగే ఒఠుజ కుండలిని యోగంపై అనేక సెమినార్లు నిర్వహించాడు. బ్రిటీష్ పరిపాలన సమయంలో కలకత్తాలో జడ్జిగా ఉండిన అతను శరీరంలోని వివిధ చక్రాలు, కుండలిని మొదలైన పుస్తకాలు వ్రాశాడు. యోగంలో చెప్పే ధ్యానాన్ని అనే పేరిట మనస్తత్వవేత్తలు బోధిస్తున్నారు. ప్రస్తుతం యోగవిధానాల్ని హిందూ సంప్రదాయంలో కన్నా బౌద్ధులు ఎక్కువ అభ్యాసం చేస్తూండడం, ఆదరణ పొందడం ఒక విశేషం.
యోగం అనే పదానికి కలయిక అని అర్థం. ఇది వరకు లేనిదాన్ని పొందడం, లేదా ఇది వరకూ తెలియనిదాన్ని తెలుసుకోవడం. భగవద్గీతలో ప్రతి అధ్యాయం పేరులో యోగ అనే పదం ఉంటుంది. అది ఆ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని సూచిస్తుంది. ప్రస్తుత వ్యాసం అలాకాక యోగశాసా్త్రనికి సంబంధించినది. దీన్ని అభ్యాసం చేసే వ్యక్తి ఇది వరకు తెలియనిదాన్ని తెల్సుకోవడం ఇందులోని విషయం.
భారతీయ విద్యలలో యోగశాస్త్రం చాలా ప్రధానమైనటువంటిది.
యోగం అనేది భారతదేశం నుంచి వచ్చింది అనేది ఎంత వాస్తవమో వేదాలలోంచి వచ్చింది అనేది కూడా అంత కఠినమైనటువంటి సత్యం.
హిందూధర్మం నుంచి యోగాను వేరు చేయాలని చూడడం అజ్ఞానం.
విశ్వజనీనమైన యోగా ఒక మతానికి చెందినదిగా చూడకూడదు అంటూ ఉంటారు చాలామంది. కానీ విశ్వజనీనమైన యోగాన్ని అందించిన మతం హిందూమతం గనుక హిందూమతం కూడా విశ్వజనీనమైనదే అని తెలుసుకోగలగాలి.
ప్రపంచం మొత్తం మీద మొదటి మానవ సాహిత్యం ఋగ్వేదం అని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు.
పతంజలి చెప్పిన యోగశాస్త్రమే ప్రపంచానికి ఇప్పుడు శిరోధార్యం. ఆ పతంజలికి హిందూధర్మం శిరోధార్యం.
ఉపనిషత్తులలో, వేదాలలో చెప్పబదినదే యోగం.
భారతీయుల ఆధ్యాత్మిక సాధన అంతా యోగమే.
యోగాన్ని ప్రపంచంలో ఇతరులు తలకెత్తుకుంటున్న ఈ దశలో ఇది మనది అని మనం మర్చిపోతే తిరిగి వాళ్ళదిగా మనకి వాళ్ళే నేర్పే దుస్థితి ఏర్పడుతుంది గనుక హిందువు మేల్కొని యోగా పూర్తిగా హైందవమని గ్రహించి ఆ యోగమార్గంలో మనం తరించి ఇతరులకు మార్గదర్శకంగా నిలబడదాం
No comments:
Post a Comment