1. ఏదోషానికైనా పాపఫలం కారణం అని గుర్తించాలి,దానికి మనదగ్గర ఉన్నదాంట్లో 20 శాతం ,డబ్బు సులభంగా ఎక్కువగా పొందేవారు ఇంకా ఎక్కువాగా దానంచేస్తే మంచిది)
2. ఆయాగ్రహాలకి బ్రాహ్మణాదుకి ఇవ్వడంతోపాటు తమదగ్గర పనిచేసేవారికి,చుట్టు ఉండే బంధువులకి ,స్నేహితులకి పంచుకోవడం,బీదలకి అనాధలకి ఇవ్వడం కూడా పుణ్యకార్యమే)
ఈక్రమంలోనే క్రిందివ్వబడ్డ దానాలు ఎవరెవరికి ఎలాంటివి ఇవ్వవచో ఆలో చించుకొని దానాలు చేయాలి.అవిచేస్తూ కిందిజపాలు,ఆయాదేవతాపూజలు చేయడం మంచిది.
3. రత్నాలు అందరూ అన్నీ ధరించకూడదు అవిసూచనిబట్టే ధరించాలి(పూజ ,జపం,దానం లేకుండా రత్నధరణ ఫలించదు)
4. ప్రతీ గ్రహానికి (జపం (అనగా ఇవ్వబడ్డ సంఖ్య) + తర్పణం + హోమం + దానం) ఇవన్నీ చేయడాన్ని మాములు పరిహారం అంటారు.
5. విశేష సమస్యలకు ఆయపరిహారాలు పాటించండి.
చేయాల్సిన పరిహార విధులు
సూర్య గ్రహానికి
గ్రహాణాం ఆదిరాదిత్యః లోకరక్షణకారకః ।
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే రవిః ॥ ఈశ్లోకాన్ని 6 వేలసార్లు జపించాలి
దానాలు: గోధులు,గోధుమపిండి పదార్థాలు రొట్టెలవంటివి,రాగివస్తువులు.
పూజలు- విష్ణుమూర్తికి పూజ,సూర్యోపాసన.
రత్నాలు- కెంపు ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
చంద్ర గ్రహానికి
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సురాశనః ।
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే విదుః ।। ఈ శ్లోకాన్ని (10 వేలసార్లు జపించాలి)
దానాలు తపాలు,తెల్లబట్టలు,బియ్యం వెండి వస్తువులు.నీరుదానంచేయవచ్చులేదా నీటి ట్యాంకర్ కట్టించడం.శివాలయం,ఏదైనా తీర్థాలు,
పూజలు-శివారాధన,చంద్రపూజ,చంద్రుడి అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- ముత్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
కుజ గ్రహానికి
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్‌సదా ।
వృష్టికృత్ సృష్టిహర్తాచ పీడాంహరతుమే కుజః ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి
దానాలు కారం వస్తువులు,ఎర్రవస్త్రాలు,కందులు,కందిపప్పు.రక్తదానం
పూజలు-దుర్గారాధన,సుబ్రహ్మణ్యారాధన ,కుజపూజ ,కుజఅష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- పగడం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
బుధ గ్రహానికి
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రోమహాద్యుతిః ।
సూర్యప్రియకరోవిద్వాన్ పీడాంహరతుమే బుధః । ఈశ్లోకాన్ని 17 వేలసార్లు జపించాలి
దానాలు పెసలు,ఆకుపచ్చని దుస్తులు,ఎలక్ట్రానిక్‌వస్తువులు,రోగులకు మందులు ఇవ్వడం,
రత్నాలు- పచ్చ (దీన్నేమరకతం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
పూజ.విష్ను ఆరాధన,వణిగింద్రపూజ,కుబేరపూజ ఆయాదేవతలఅష్టోత్తరశతనామాలుచదవటం
గురు గ్రహానికి
దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః ।
అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః॥ ఈశ్లోకాన్ని 16 వేలసార్లు జపించాలి
దానాలు పుస్తకాలు,బంగారువస్తువులు,తీపి పిండివంటలు,పట్టుబట్టలు.పండ్లు.
పూజలు.హయగ్రీవ,సరస్వతీ,లలితా ,బుధగ్రహాల పూజలు ఆయాదేవతలఅష్టోత్తరశతనామాలుచదవటం.
రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
శుక్ర గ్రహానికి
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భృగుః ॥ ఈ శ్లోకాన్ని 20వేలసార్లు జపించాలి
దానాలు చక్కెర,బబ్బెర్లు,అలంకరణ వస్తువులు.పూలు.ఆవు
పూజలు.లలితా ,కాలీ ,శుక్రగ్రహంపూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- వజ్రం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
శని గ్రహానికి
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః ॥ ఈ శ్లోకాన్ని 19 వేలసార్లు జపించాలి
దానాలు వాడుకున్నవస్త్రాల్లోచినిగిపోనివస్త్రాలు,నల్లని వస్త్రాలు,నూనె,నువ్వులుండలు.అవిటివారు,రోగులకుమందులు,ఆహారం ఇవ్వడం,సిమెంట్,నేరేడుపండ్లు,దానంచేయడం,నువ్వులనూనెతో శరీరాన్ని రుద్ది తర్వాత స్నానం చేయడం.
పూజలు,రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారం వ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం.
రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
రాహు గ్రహానికి
అనేకరూప వర్ణైశ్చ శతశఃఅథసహస్రశః ।
ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః ॥ ఈ శ్లోకాన్ని 18 వేలసార్లు జపించాలి
దానాలు ముల్లంగివంటి దుంపలు ,మినప్పప్పుతో చేసినవడలు,మినుములు,ఆవాలు
పూజలు,దుర్గారాధన,కాలసర్పపూజలు,సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
కేతు గ్రహానికి
మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః।
అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి
దానాలు ఉలవలు,మిక్స్‌డ్ కలర్స్ వస్త్రాలు,ఆహారం,
పూజలు,దుర్గారాధన,కాలసర్పపూజలు,సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
No comments:
Post a Comment