Tuesday 20 June 2017

సమస్యను బట్టి ప్రార్థన చేయాల్సిన శ్లోకాలు


వివాహం కానివారికి,(మగవారికి)
పత్నీం మనోరమామదేహి మనో వృత్తాను సారిణి,
తారిణిం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం.
వివాహం కానివారికి,(స్త్రీలకు)
కాత్యాయనీ మహామాయే మాహా యోగిన్యధీశ్వరీ
నందగోపసుతం దేవి పతింమే కురుతేనమః
సంతానం లేనివారికి
(మర్రి,మామిడి,మేడి,జువ్వి,రావి వంటి పుణ్యవృక్షాలకు ప్రదక్షిణచేయడం,ఎక్కువసేపు గడపడం వల్ల గర్భసంబధ రోగాలు తగ్గుతాయి)
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే
దేహిమే తనయంకృష్ణ త్వామహం శరణం గతః ॥
నమోదేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతంనమః।
పుత్రసౌఖ్యం దేహిదేహి గర్భరక్షాంకురుష్వనః॥
ఉద్యోగం లేనివారుంప్రమోషన్‌ కోరేవారు
శ్రీ రాజమాతంగ్యై నమః
ఇంటిలో అశాంతి తొలగుటకు
ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం।
లోకాభిరామంశ్రీరామం భూయో భూయో నమామ్యహం॥
అప్పులబాధ తీరడానికి
శ్రీగణేశ ఋణంఛింది అనే మంత్రాన్ని ఎక్కువసార్లు జపించాలి.
(లేదా సంకటనాశన గణేశస్త్రోత్రంకానీ,దారిద్య్రద్ణుఖదహనస్తోత్రంకానీ,కనకధారాస్తోత్రంకానీ) చదవాలి.

No comments:

Post a Comment