Tuesday, 20 June 2017

ది బిగ్‌ డే జూన్‌ 21


ఉత్తరార్థగోళంలో నేడు పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే జూన్‌ 21ని బిగ్‌ డే అంటారు. ఈ ఏడాది నుంచి జూన్‌ 21 మరో ప్రత్యేకమైన రోజుగా మారింది. ప్రపంచమంతా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది. ఇలాంటి మరెన్నో ప్రత్యేకతలు జూన్‌ 21కి ఉన్నాయి. ప్రపంచ ప్రజలు ఈ ఆదివారాన్ని ఎన్ని రకాలుగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారో తెలుసుకుందాం!
ఇంటర్నేషనల్‌ యోగా డే: 2014 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా డే గా ప్రకటించింది. భారతీయ సంప్రదాయంగా ఉన్న యోగాను ప్రపంచదేశాలన్నీ స్వాగతిస్తున్నాయి. కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా రాజకీయనాయకులు మొదలుకొని ఇతర ప్రముఖుల వరకూ మానసిక, శారీరక ఆరోగ్యాలకు దోహదపడే ఐదు వేల ఏళ్లనాటి యోగాకున్న మతపరమైన, మతాతీతమైన అనుబంధం గురించిన చర్చల్లో మునిగి తేలుతున్నారు. ఆసనాలు వేసి మనం కూడా ఇంటర్నేషనల్‌ యోగా డేని సెలబ్రేట్‌ చేసుకుందాం.
ఫాదర్స్‌ డే: జూన్‌ మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌డేగా జరుపుకుంటూ ఉంటారు. అలా ఈ నెల మూడో ఆదివారం 21న రావడంతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్‌ డే సంబరాలు మొదలయ్యాయి. బహుమతులతో, సందేశాలతో పిల్లలు తమ తండ్రుల మీదున్న ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు.
వరల్డ్‌ మ్యూజిక్‌: 1982 జూన్‌ 21ని ‘ఫెటె డి లా మ్యూజిక్‌’గా జరుపుకునే సంప్రదాయం ఫ్రాన్స్‌లో మొదలైంది. మొట్టమొదటి వరల్డ్‌ మ్యూజిక్‌ డే సెలెబ్రేషన్స్‌కు ప్యారిస్‌ వేదికైంది. వరల్డ్‌ మ్యూజిక్‌ డేని అంతర్జాతీయ సంగీత దినోత్సవంగా ప్రపంచంలోని 120 దేశాలు జరుపుకుంటున్నాయి. ఆ రోజున అన్ని ప్రధాన పట్టణాల్లో ఫ్రీ మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌ ఏర్పాటు చేస్తారు.
నేషనల్‌ అబారిజినల్‌ డే: ఐన్యూట్‌, మెటిస్‌ మొదలైన ఆదివాసీ ప్రజల సంస్కృతులు, సంప్రదాయాల గౌరవార్థం 1996నుంచి కెనడాలో జూన్‌ 21ని జాతీయ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకునే సంప్రదాయం మొదలైంది. ప్రస్తుతం కెనడాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వివిధ కమ్యూనిటీల సంస్కృతి, భిన్నత్వం, భాషలు, సాధించిన విజయాల ప్రాతిపదికగా ఈ సెలబ్రేషన్స్‌ జరుగుతాయి.
ఇంటర్నేషనల్‌ టీ షర్ట్‌ డే: ఈ దినోత్సవాన్ని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మొదలైన సోషల్‌ మీడియాలో సెలబ్రేట్‌ చేసుకునే అలవాటు ఏడేళ్ల క్రితం నుంచే మొదలైంది. టీ షర్ట్‌ ప్రేమికులు తమకు దాని మీదున్న ప్రేమను చాటుకునేందుకు ఈ రోజును ఉపయోగించుకుంటారు. టీ షర్ట్‌తో తీసుకున్న సెల్ఫీలను సోషల్‌ వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేస్తుంటారు. ఏడాది పొడుగునా టీ షర్ట్‌ వేసుకుని సందర్శించిన ప్రదేశాలు, అనుభవాలను తమ ఫొటోల ద్వారా పదిమందితో పంచుకుంటారు.



No comments:

Post a Comment