Saturday 10 June 2017

భక్తుడికి కష్టం ఎందుకు వస్తుంది అంటే

No automatic alt text available.

దేవుడు నిన్ను రక్షిస్తాడనే నమ్మకం నీకు వుందా లేదా అనే నిరూపణ కోసమే అని చెప్పాలి

కొన్ని దృష్టాంతములు చూద్దాం
హిరణ్యకశిపుడి తో బద్ద వైరం వున్నప్పడికిని ప్రహ్లాదుడు ఎన్నడు అతనిని నిగ్రహించి మాట్లాడలేదు పుట్టింది రాక్షస వంశం లో ఐన పెరిగింది రాక్షస జన మద్యం లో ఐన తను నమ్ముకున్న దేవుడి రాక కోసం సహనం తో వేచివున్నాడు ఒకానొక సందర్బం లో ఏనుగులతో తొక్కించిన శూలాలతో పొడిపించిన గద లతో నేట్టిన్చినా అందులో కూడా తను నమ్ముక్కున్న భగవంతుడి రూపాన్నే చూసి ఆనందించాడు కాని నేను ఇంత పూజ చేశాను నాకు ఎందుకు కష్టం కష్టం ఇచ్హావ్ అని ఏనాడు అడగలేదు పానియంబుల్ త్రాగుచున్, తిరుగుచున్,బాశించుచున్ హాస్య లీల క్రీడల్ చేయుచున్, నిద్రించుచున్ అని సర్వ క్రియలు భగవద్ అర్పితం గా చేయడం ప్రహ్లాదుని గొప్పతనం ఇది భక్తుని యొక్క స్థితి...........

No automatic alt text available.

హిరణ్య కసిపుడి కి బ్రహ్మ గారి వరాలు :- గాలిన్ కుమ్బిని అగ్ని అమ్బూల ఆకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ గస్రములన్ తమ ప్రభల బురిగ్రాహ రక్షో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్థ్రాలిన్ లోకాదీశ మృత్యువు లేని జీవనము ఇప్పించవె
గాలి లో ధూళి లో అగ్ని లో నీటి లో నిప్పులో ఇంట్లో బయట దిక్కుల లోంచి అస్త్రము చేతే శస్త్రము చేత పన్నగము చేత యక్షుల చేత కిన్నెరుల చేత స్త్రీ చేత పురుష చేత చావకూడని వరం అడిగాడు
భగవంతుడి తత్వం :- ఇందుగలడు అందు లేడని సందేహంబు వలదు అని తన భక్తుడు చెప్పిన మాట వ్యర్దం కాకూడదని తలచినశ్రీ నరసింహ స్వామి ప్రపంచమంతా నిండి పోయి వేచి చూస్తూ తానంటూ వస్తే హిరణ్య కసిపుడిని సంహరించేల రావాలి బ్రహ్మ గారి వరం నిజం చేసేలా రావాలి అనుకుని శ్రీ నరసింహకృతిన్ దాల్చేనచ్చ్యుతుడు నానా జంగమ స్తావరోత్కర గర్భంబుల అన్నిదేశముల ఉద్దండ ప్రభావంబునన్
ఇలా విశ్వం అంత నిండి భక్తుడి కోసం స్తంభం నుండి ఉద్భవించి అసుర సంహారం చేసిన ఘట్టమే ఇందుకు నిదర్సనం నమ్మకము తో పూజించే మనసు నీకున్నప్పుడు నిన్ను రక్షించడానికి స్వామీ ఎప్పుడూ సిద్దమే కృత యుగం లో నే కాదు నేటి కలి యుగం లో కూడా

No automatic alt text available.

సాయి బాబా గారి అభయం :- సర్వ జీవుల హృదయమందు భగవంతుడే ఉన్నాడని చెప్పే సాయి బాబా గారు
ఒక జీవి కి నిన్ను జన్మజన్మలా కాపాడతాను అని చెప్పినందు కు
తరువాతి జన్మ లో ఆ జీవి తన కర్మ వశాత్తు కప్ప గా జన్మించింది ఒకనాడు దాన్ని తన పూర్వ శత్రువు పాము గా జన్మించి కప్పను తినడానికి నోట కరుచుకుంటే ఆర్తి తో కప్ప పిలువగా తను ఇచిన మాట కోసం బాబా గారు నడిచి వచ్చి ఒక్క మాట తో కప్ప ని రక్షించి దాని జీవిత గమనాన్ని మార్చారు
నోరు లేని ఒక ముగ జీవి ఆర్తి ని గ్రహించి రక్షించిన భగవంతుడు
నోరు వుండి మాట్లాడగలిగి రామ నామాన్ని చెప్పగలిగిన మానవులని ఎందుకు రక్షించరు మనసు కి రామనామాన్ని అలవాటు చేసుకో నమ్మకము తో పూజించే మనసు నీకున్నప్పుడు నిన్ను రక్షించడానికి స్వామీ ఎప్పుడూ సిద్దమే.

No comments:

Post a Comment