Tuesday 30 May 2017

పంచబిల్వ దళాలు - విభూతి

1. బిల్వపత్రం :

 దీన్ని మారేడు అంటారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా ఉపయోగపడుతుంది.మారేడు లేదా బిల్వము (Bael) హిందూ దేవతలలో ఒకడైన శివపూజలో ముఖ్యం. * శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు భావించెదరు. శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉన్నది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించినాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం

శ్రీనివాసుని అష్టోత్తరంలో "శ్రీ బిల్వపత్ర అర్చన ప్రియాయే నమ:" అని ఉంటుంది.
లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. * బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.
మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.
మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.
మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధి కి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. ఆయుర్వేదము లో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడ పనిచేస్తుంది.
సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేవులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.
మారేడు లో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది.
జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది.
విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుము గా చేసినది బాగా ఉపకరిస్తుంది.
మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు
1.మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడ పనిచేస్తుంది.
2.సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
3.విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుము గా చేసినది బాగా ఉపకరిస్తుంది.
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.

మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది. ఉపయోగాలు
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.
ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి.
మొలలకు ఇది మంచి ఔషధము.
దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది .
కడుపు లోను , పేగుల లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు , ఫలాలకు ఉన్నది ,
మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు , ఫలాలకు ఉన్నది ,
బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది .
బిల్వ వేరు , బెరడు , ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి.
క్రిమి , కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది .


2.తుర్యా పత్రం(తులసి):-





తులసి (ఆంగ్లం Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్ (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. షోడశోపచార పూజా విద్ధానములో తులసికి విశిష్ట స్థానం ఉన్నది.నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడువది వది.
శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి
చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా ఉపయోగపడుతుంది. 2.తుర్యా పత్రం(తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు ...

హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్ధం పోస్తారు. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది.ఆ వాయువును పీల్చుట వలన ' యజ ' చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది.కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి,వాతావరణ కాలుష్యాన్ని నివారించి,ఆరోగ్యాన్ని రక్షించుకొని,తులసి తీర్ధం సేవించండి.త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ వ్రతములకంటే మిన్నగా శరీరశుద్ధియగును.తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణికోటి పవిత్రులు,నిర్వికారులు కాగలరు.తులసి మొక్క వున్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వ దేవతలు నివసింతురు.తులసి దళములందు పుష్కరాది తీర్ధములు,గంగ మొదలగు నదులు,వాసుదేవది దేవతలు నివసింతురు.
వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంధం చరక సంహితంలోనూ, అంతకంటే పురాతనమైన ఋగ్వేదంలోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా గృహ వైద్యంచిట్కాలలో కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేశే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం. ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్)గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి.
తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.

కొన్ని ఉపయోగాలు
తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా,
జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.

తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.
పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.
ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలను దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక COX-2 inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న యూజినాల్'(Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్). ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక డయాబెటిస్ (చక్కెర వ్యాధి) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది

'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి. అలాగే కంటి శుక్లాల సమస్యకు కూడా.

తులసికి సంబంధించిన ఆచారాలకు మౌలికమైన నమ్మకాలు:
తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు. విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు.
తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది.
తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు.
ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి.
కార్తీక శుక్ల ఏకాదశి నాటినుండి పౌర్ణమి వరకు తులసీ వివాహం ఉత్సవం జరుగుతుంది.


3.ఉసిరి ఒక చెట్టు. 

ఉసిరికాయల గురించి వీటిని పెంచుతారు. ఉసిరి కాయను ఆంగ్లంలో The Indian gooseberry (Phyllanthus emblica, syn. Emblica officinalis), అనీ, హిందీలో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో "ఆమలక" అనీ అంటారు. దీనిలో విటమిన్ సి. పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు-ముఖ్యంగా చ్యవన ప్రాశ్‌లో. మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధం. షాంపూలో కూడ ఉసిరి కాయను వాడతారు. దీని శాస్త్రీయనామం ఫిలాంథస్‌ ఎంబ్లికా(Phyllanthus emblica). ఇది ఫిలాంథిసియా కుటుంబానికి చెందిన వృక్షం.
ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదంలో చ్యవన్ ప్రాస్ దీని నుండి తయారుచేస్తారు.
దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయ క్రింద లేదా ఉప్పు, కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు.
హిందువులు ఉసిరిచెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీకమాసంలో వనమహోత్సవాలలో ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం అన్ని నమ్ముతారు.
ఉసిరి కాయలను పచ్చడికి, జాం, జెల్లీ, సాస్ తయారీల్లోకూడ వుపయోగిస్తారు.
ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది.
ఉసిరికాయ కంటి చూపును పెంచడములో సహాయపడుతుంది.
ఉసిరి కాయలలో విటమిన్ 'సీ' అధికముగా వున్నది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విదంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉపిరి తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం , గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .

జీర్ణమండలం :
దాహం ,మంట,వాంతులు ,ఆకలిలేకపోవుట ,చిక్కిపోవుట ,ఎనీమియా ,హైపర్ -ఎసిడిటి , మున్నకు జీర్ణ మండల వ్యాదులను తగ్గిస్తుంది .

ఉపిరితిత్తులు :
ఆస్తమా ,బ్రాంకైటిస్ ,క్షయ ,శ్వాసనాలముల వాపు , ఉపిరితిత్తులనుండి రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .

గుండె :
ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది . ఉసిరి వల్ల ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది . శరీరము లో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .

కాలేయము :
కామెర్లు ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వల్ల తగ్గుతాయి . కాలేయం లో చేరిన మలినాలు , విషపదార్ధాలు ను తొలగిస్తుంది , 'యాంటి ఆక్షిడెంట్' గా పనిచేస్తుంది .


4.అపామార్గ పత్రం(ఉత్తరేణి): -


ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి)
ఉత్తరేణి లేదా అపామార్గం (ఆంగ్లం: Prickly Chaff Flower; సంస్కృతం: अपामार्ग) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఆరొ వది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా.
ఇంద్రుడు వృత్తాసురుని చంపిన తరువాత నముచి అనే రాక్షసుని చంపడానికి అతనితో కపట స్నేహం చేస్తాడు.[2] నముచి విశ్రాంతి తీసుకొంటుండగా ఇంద్రుడు అతని తలను నరికివేస్తాడు. ఆ తెగిన తల మిత్రద్రోహి అని అరుస్తూ ఇంద్రుని తరుముకొస్తుంది. దానితో భయపడిన ఇంద్రుడు బృహస్పతిని సంప్రదించి ఒక యాగము చేసి నముచి తల బారినుండి తప్పించుకుంటాడు. ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం. ఇందులో ఉత్తరేణి ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు, నముచికి కనబడడు. అలా అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపామార్గం సార్ధకనామం అయింది.వినియక చవితి పూజల్లో అధినాయుకుడికి ఇష్టమైన 21 ప్రతులలో ఒకటి.సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్‌ ఆస్పరా.
ఉత్తరేణి ఆకుల రసం కడుపునొప్పికి, అజీర్తికి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.
ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి.
ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంధి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.
1 జీర్ణకారి. శరీరములో క్రొవ్వును కరిగిస్తుంది.
2 కడుపుబ్బరమును తగ్గిస్తుంది
3 నులి పురుగులను నశింప చేస్తుంది

దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.

5 .సింధువార పత్రం(వావిలాకు):-




వావిలి (సంస్కృతం: సింధువార; ఆంగ్లం: Five-leaved chaste tree; హిందీ: Nirgundi) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ (Vitex negundo). దీని ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాల్లో లభిస్తుంది.
వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు.[2]
దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు మరియు గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.
ఆయుర్వేద, సిద్ధ వైద్యంలో మొక్కలోని అన్ని భాగములకు తిక్తకషాయ, కటురసం, కటువిపాకం, ఉష్ణవీర్య, కఫహర, లఘు గుణములు ఉన్నాయని, దీని ఔషధ ఉపయోగం ఈ విధంగా ఉదహరించి ఉన్నారు. వెంట్రుకలకు, కంటికి, వాపులకు, నొప్పులకు, అమావాతానికి, కడుపులో పురుగులకు, పుండ్లకు, చెవి వ్యాధులకు, మలేరియాకు, కఫాన్ని తగ్గించడానికి ఉపయోగకరము.
వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి.
వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది.
పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ కు బాగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి, తల క్రింద పెట్టుకొని పడుకుంటే, తరచుగా వచ్చే తలనొప్పి, జలుబు మటుమాయం అవుతుందని అంటారు. పత్రాల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, ప్రధమ చికిత్సగా పనిచేస్తుంది. వావిలి పత్రాలలో గాడిదగడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, గుంటగలగర, కుప్పింటి కలిపి రసం తీసి, నువ్వులనూనెలో వేసి కాచి, కీళ్ల వాపులకు పై పూతగా వూస్తారు. పత్రాల రసంలో అల్లరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.

కీల్లనోప్పులకు మంచి మందు.


విభూతి








హోమంలో దర్బలు మరియు ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని కూడా అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి (విభూది) ప్రతి శివాలయంలోనూ తప్పక ఉంటుంది.
హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.
హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి.
హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పలును నిరాటకంగా జరుగుతాయి.
భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.
వివిధ హోమభస్మాలు చేసే మేలు:

శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.
శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.
శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.
శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.
శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి
శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.
శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.
శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.
హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.
గమనిక: హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.



బిల్వ భస్మం / వీభూధి వలన సమస్త గ్రహచార దోషములు శాంతించును . జన ఘోష ,నరఘోష ,దృష్టి దోషములను నియంత్రించును .


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు 
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment