Tuesday 9 May 2017

300 ఏళ్ల తర్వాత వస్తున్న పౌర్ణమి... పవర్‌ఫుల్!! 10-5-2017



సుమారు 300 ఏళ్ల తర్వాత మే 10 న ఆకాశంలో అద్భుత యోగం ఆవిష్కృతం కానుంది. వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ-ఆదిత్య యోగం అంటే బుధుడు, సూర్యుడు కలిసి ఒకే స్థానంలోకి వస్తారు. ఇలాంటి అరుదైన యోగం 300 ఏళ్ల కిందట మాత్రమే సంభవించింది. అంతేకాదు బృహస్పతి (గురు), అంగారక (కుజ) గ్రహాలు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటాయి. దీంతో బృహస్పతి, వరుణ గ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తాయి. ఇలాంటి గ్రహస్థితి 1720 ఏప్రిల్ 22 న జరిగింది. దీని వల్ల శని, అంగారక గ్రహాలు వ్యాపారానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున చేసిన దానాలతో మంచి ఫలితం లభిస్తుంది. అలాగే ఏవైనా వస్తువులను కొనుగోలు చేసినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అనుకూలంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఏర్పడే బుద్ధ, ఆదిత్య యోగం వల్ల అద్భుతమైన విజయం, కీర్తిప్రతిష్ఠలు, వివేకం, తెలివితేటలు, సంపదలు సిద్ధిస్తాయి. తెల్లవారు జామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించాలి. పూర్వీకులను ఆరాధించడానికి కూడా ఇది మంచి రోజు. పౌర్ణమి రోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రోజున జన్మ రాశుల ప్రకారం వివిధ వస్తువులను పేదలకు దానం చేస్తే మంచి జరుగుతుంది. 

 మేష రాశి వారు మట్టి కుండలు, నీళ్లు, పండ్ల రసాలను దానం చేయాలి. వృషభ రాశికి చెందిన వ్యక్తులు పేదలకు పాదరక్షలు, బూట్లు దానంగా ఇవ్వాలి. 
 మిథున రాశి వాళ్లు పేదలకు పండ్లు దానం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్లు గొడుగులు దానం చేస్తే అదృష్టం కలిసొస్తుంది. సింహ రాశి వాళ్లు సత్తు పిండి లేదా అన్న దానం చేయాలి.
 కన్య రాశికి చెందిన వ్యక్తులు అనాథాశ్రమాలకు విరాళాలు ఇస్తే మంచి జరుగుతుంది. తుల రాశిలో జన్మించిన వ్యక్తులు తమ పరిసరాల్లో మొక్కలు నాటితే భవిష్యత్తు బాగుటుంది.
 వృశ్చిక రాశి వ్యక్తులు ఆలయాల్లోని బ్రాహ్మణులకు మట్టి కుండలు, పుచ్చకాయలను దానం చేయాలి. 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఆలయం లేదా ఇతర పవిత్ర ప్రదేశంలో భక్తుల దాహం తీర్చడానికి ఏర్పాట్లు చేయాలి
 మకరర రాశికి చెందిన వ్యక్తులు పక్షులకు గింజలు, నీరు అందిచాలి. కుంభ రాశి వ్యక్తులు పేదలకు నూలు వస్త్రాలు దానం చేయాలి. మీన రాశి వాళ్లు అన్నదానం ముఖ్యంగా యాత్రా స్థలాల్లో యాత్రికులకు దానం చేస్తే విశేష లాభం.
 శని, అంగార గ్రహాలు ఒకే స్థానంలో ఉంటే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. సైన్యం, భద్రత సమస్యలు, లోహాల ధరలు పెరగడం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.

No comments:

Post a Comment