Wednesday, 31 August 2016

సెప్టెంబర్ 1 న సూర్య గ్రహణం

సెప్టెంబర్ 1 న సూర్య గ్రహణం 

 

 ఉదయం 6 గంటల 13 నిమిషాలనుండి  9 గంటల 01నిమిషం వరకు ఏర్పడుతుంది.మొత్తం గ్రహణం నిడివి 3 నిమిషాల 6 సేకేన్లు.ఈ గ్రహణం సౌత్ ఆసియ, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటిక లలో కనిపిస్తుంది.హైదరాబాద్ లో కనిపించదు .

తర్వాతి సూర్య గ్రహణం 26 Feb 2017 న ఏర్పడుతుంది.

 

1 September 2016 — Annular Solar Eclipse


The annular solar eclipse will be visible from Madagascar and locations in Central Africa. The Moon's shadow will also cross parts of the Atlantic and Indian Oceans.
For most viewers in Africa, the eclipse will be a partial solar eclipse.
The eclipse will begin at 06:13 UTC on September 1, 2016. The maximum point will take place at 09:01 UTC, and the annularity will last for 3 minutes and 6 seconds.

What the Eclipse Will Look Like Near the Maximum Point

 

Where to See the Eclipse

Regions seeing, at least, a partial eclipse: South in Asia, West in Australia, Much of Africa, Atlantic, Indian Ocean, Antarctica.
Is this eclipse visible in Hyderabad? .....not visible in hyderabad.


Area seeing the annular solar eclipse.
More than 90% of the Sun is covered.
Up to 90% of the Sun is covered.
Up to 40% of the Sun is covered.
Eclipse is not visible at all.
Note: Percentage values (%) relate to moon coverage of the Sun and depends on location. Visibility is weather permitting.

When the Eclipse Happens Worldwide

The eclipse starts at one location and ends at another. The times below are actual times (in UTC) when the eclipse occurs.
EventUTC TimeTime in Hyderabad*
First location to see the partial eclipse begin1 Sep, 06:131 Sep, 11:43
First location to see the full eclipse begin1 Sep, 07:171 Sep, 12:47
Maximum eclipse1 Sep, 09:011 Sep, 14:31
Last location to see the full eclipse end1 Sep, 10:551 Sep, 16:25
Last location to see the partial eclipse end1 Sep, 12:001 Sep, 17:30
* Local times shown do not refer to when the eclipse can be observed from Hyderabad. Instead, they indicate the times when the eclipse begins, is at its maximum, and ends, somewhere else on Earth. The corresponding local times are useful if you want to view the eclipse via a live webcam.
 

Next Annular Solar Eclipse will be on 26 Feb 2017.



శీతల అమావాస్య

శీతల అమావాస్య



శివుని ఆరాధించే వారు శైవులు , విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు , ఆదిశక్తి ని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత పొలిమేరమ్మ.మసూచి,ఆటలమ్మ లాంటి కొన్ని రోగాలొస్తే అమ్మవారు పోసిందనటం అర్ధరహితం కాపాడే దేవతపై అపనిందమోపటమే అవుతుంది.సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తి పోలేరమ్మఅంటారు.పోలేరమ్మను తెలంగాణాలో పోచమ్మ అంటారు.మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు.బహుజన సంస్కృతి పరిరక్షకులు.సమాజంలోని బడుగుకులాలవారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతరల వల్ల సాధ్యమయ్యింది. వర్షాలు పడాలని పోలేరమ్మ తిరునాళ్లు, కొలుపులు చేస్తారు.పోలేరమ్మకు జంతు బలులు ఇస్తారు. మేకలు,పొట్టేళ్ళు, కోళ్ళను నరకడం ,పొంగళ్ళు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం జరుగుతుంది.

పోలేరమ్మ వ్రతము

పార్వతి శివునితో కలియుగంలో స్త్రీలు మిక్కిలి పాపాత్ములుగా , సంతానలేమితో ఉంటారు కాబట్టి వారికి పుణ్యము నిచ్చే ఒక వ్రతమును చెప్పుమని కోరితే పోలేరమ్మ వ్రతము అని చెప్పాడట. బాధ్రపద బహుళ అమావాస్య నాడు పోలేరమ్మవ్రతము చేస్తారు.

పోలేరమ్మ జాతర

పూర్వం కలరా వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభించి అధిక సంఖ్యలో జన నష్టం జరగడంతో శీతల యాగం జరిపించి గ్రామాల్లో అష్టదిగ్బంధన యంత్రాన్ని కట్టించి అత్యంత వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతరను జరిపించారట.అందువల్లనే ఈ అమావాశ్యని శీతలా అమావాస్య గా పిలుస్తారు. పోలేరమ్మ జాతర ఆచారంగా మారింది.పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండి ...పోతురాజుకు టెంకాయ కొట్టండి ... పగలక పోతే మానెత్తిన కొట్టండి' అంటు భిక్షాటన చేస్తారు.జాతర సందర్భంగా ప్రతి ఇంటికి వేపాకు తోరణాలు కట్టి అమ్మవారికి ఇష్ట నైవేద్యమైన అంబలిని ప్రసాదంగా పంచి పెడతారు. చిన్న, పెద్ద, పేద, ధనిక తారతమ్యం లేకుండా మడిభిక్షాలు ఎత్తి అమ్మవారి జ్ఞాపకార్థం జాతరలో వాటిని వెచ్చిస్తారు. అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరులు అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు. ఎటువంటి అలంకరణ లేని ప్రతిమను ముందు అమ్మవారి అత్తవారి ఇంటికి తీసుకు వెళతారు. అక్కడ సాంగ్యాలతో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారి చెళ్ళెళ్లు గాలిగంగలు. జాతర రోజులలో శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. ఆ రోజు గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అందువలన శుభకార్యాలు చేపడితే అరిష్టం కలుగుతుందని మూఢనమ్మకం . బ్రాహ్మణేతరులే పోలేరమ్మకు అనాదినుంచీ పూజారులు. కాలం గడిచేకొద్దీ బ్రాహ్మణపూజారులు కూడా మారి ఈదేవతకు పూజారులు గా వస్తున్నారు. సారాయి తాగి బాధలన్నీమరచి చిందులువేసే భక్తులకు కులాలు గుర్తురావు. అంటరానితనం ఉండదు. సర్వమానవ సమానత్వంఈ జాతరల్లో వెల్లివిరుస్తుంది. అదే పోలేరమ్మ గొప్పతనం.

పోలేరమ్మ చద్ది (అంబలి)

బర్రె పాడి చల్లగా ఉంటే పోలేరమ్మకు పెరుగన్నంతో పెట్టిన చద్ది ని వీధిలోని పిల్లలందరినీ పొద్దున్నే పిలిచి పంచిపెడతారు.




పొలాల అమావాస్య

 పొలాల అమావాస్య  
(ఈ రోజు (1-9-2016)




ఈ వ్రతం శ్రావణ మాసం చివరి రోజున చేసుకుంటారు. శ్రావణ మాసం చివరగా వొచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున పిల్లలుగల ఆడవారు ప్రొద్దునే లేచి, తల స్నానం చేసి, మడితో వంటను చేస్తారు. ఈ కాలం లో మడితో వంట కష్టం కాబట్టి, ముందు రోజునే వంట గదిని శుభ్ర పరుచుకొని, ఉతికిన బట్టలు కట్టుకొని, అమ్మవారిని మదిలో తలచుకుంటూ వంట చేస్తారు.
ఆ రోజున మూడు రకాల పులుసులు, అన్నం పాయసం, బొండాలు, వడం, ఐదు రకాల కూరలు, మూడు రకాల రోటి పచ్చళ్ళు, రెండు రకాల పెరుగు పచ్చళ్ళు చేసి అమ్మవారికి నైవేద్యం గా పెడతారు.
ఆ రోజున అమ్మవారి ముందు పొలాల రూపును తాయారు చేస్తారు. అనగా, మట్టితో చిన్న స్తలంలో పొలం లాగ చేసి, మట్టితో, ఎడ్లను, గోయపోల్లడిని తాయారు చేసి ఆ పొలాల తయారీ లో పెడతారు. ఈ వ్రతం పిల్లలు చల్లగా ఉండాలని, పంటలు బాగా పండాలని చేసేవారు. ఆ కాలం లో పంటలు పండించటమే వృత్తిగా ఉండేది. ఈ మధ్య ఆ వృత్తి చాల అరుదుగా కనిపిస్తూ ఉంటుంది కనుక పిల్లల సంక్షేమం కోసం ఈ వ్రతం చేస్తారు. అమ్మవారిని నానావిధ పుష్పాలు, పండ్లతో, శుచిగా వండిన వంటతో కొలుస్తారు. అమ్మవారిని ఎల్లవేళలా పసుపు కుంకుమలు కాపాడమని, పిల్లలను చల్లగా చుడమని వేడుకుంటారు.
ఈ రోజున అమ్మవారి కథ చదువుకొని, ముతైదువకు పసుపు కుంకుమలు ఇచ్చి, వారికి పసుపు తో చేసిన తోరంని చేతికి మెడలో కడతారు. అలాగే ముతైదువచే వ్రతం నోముకున్న వారు పసుపు తోరంను చేతికి మెడలో కట్టించుకుంటారు.

                                                    పొలాల అమావాస్య అమ్మవారితయారి 




 శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' అంటారు. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు
 తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు
అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం 
నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి,వరిపిండితోఅందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను  వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి,   ఆతర్వాత ఆకందమొక్కలోకి మంగళగౌరీదేవినిగానీ, సంతానలక్ష్మీదేవినిగానీ ఆవాహనచేసి,షోడశోపచారాలతోఅర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లుగారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు   ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో  కట్టాలి. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు.  ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు,మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే..,పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. ఇంకా పనసఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ  పిండి అందు లో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు.  నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
 
 
 
వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు.  అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి వాటికి పూజ చేస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ... ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు.
జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ... ఆర్ధికంగాను ఆదుకుంటాయి.
తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను ... పెద్దలను ... పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ ... వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది. 
 



ఈ వ్రతంలో ముఖ్యమైన కధ ప్రచురణలో వుంది అది :
"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులుఅందరికీ పెళ్లిళ్ళు చేస్తారుఅందులోఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడుకానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడుఅలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుందిఅప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు పండుగ జరుపుకోలేకపోతున్నారు అని బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసిఉంచేస్తుందిఅందరూ పూజ చేసుకుంటారుఅది అయ్యాకఆమె  బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుందిఅదిచూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి  "ఎవరమ్మా నీవుఎవరా బాబుఎందుకు ఏడుస్తున్నావు?" అనిఅడుగుతారుదానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుందిదానికి వారు - "మేమే ఆర్చేవారము -తీర్చేవారము - చెప్పవమ్మాఅంటారుఆమె తన గోడు చెప్పుకుంటుందివారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహాఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారువారిని చూసిన ఆశ్చర్యంలో దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరుఅప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుందిఅక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారుఅప్పటినుండి ఆమె ప్రతి ఏటతప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు.

 కథ విన్న తరువాత చెప్పినవారు
 పోలేరమ్మనీ ఇల్లు పాలతోనేతితో అలుకుతానునా ఇల్లు ఉచ్చతోపియ్యతో అలుకు", అంటారు.వినడానికి కొంచం వింతగా వుంటుంది.  కాని  అది వారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది  కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు.

శ్రీ సాయిసచ్చరిత్రము17


శ్రీ సాయిసచ్చరిత్రము17

శ్రీ సాయిసచ్చరిత్రము /16-17వ అధ్యాయములు
శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ రోజూ పారాయణము శనివారము 16-17వ అధ్యాయములు బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట!
గత అధ్యాయములో చోల్కరు తన మ్రొక్కు నెట్లు చెల్లించెనో బాబా దాని నెట్లు అమోదించెనో చెప్పితిని. ఏకొంచెమైనను భక్తిప్రేమలతో నిచ్చినదానిని అమోదించెదననియు, గర్వముతోను అహంకారముతోను ఇచ్చిన దాని తిరస్కరించెదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణసచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టెడివారు కారు. ఎవరైన భక్తి ప్రేమలతో నేదైన సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనెడివారు. నిజముగా సద్గురుసాయికంటె నుదారస్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరినదెల్ల నిచ్చు కామధేనువు కూడ బాబాతో సమానము కాదు. ఏలన, యవి మనము కోరునవి మాత్రమే యిచ్చును. కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమునై అత్మసాక్షాత్కారము ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ యిచ్చట చెప్పుదును.
సకలైశ్వర్యముల ననుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడిండ్లను ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వాని కనేకమంది సేవకులుండెడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగనే శిరిడీకి పోయి బాబా పాదముల పైబడి బహ్మజ్ఞానము ప్రసాదించుమని బాబాను వేడుకొనెదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియు వలదనియు, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడిట్లనెను: "బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులభమైనపని కాదు. ముఖ్యముగా నీవంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీవంటివానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నీవొక పైసయయిన దానము చేయనివాడవే! నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదకునప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు?"
తన స్నేహితుని సలహలను లక్ష్యపెట్టక, రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు శిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి, బాబాను జూచి వారి పాదములకు సాష్టాంగనమస్కారము చేసి యిట్లనేను: "బాబా! ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును జూపెదరని విని నేనింతదూరమునుంచి వచ్చితిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును". బాబా యిట్ల బదులు చెప్పెను: "ప్రియమైన స్నేహితుడా! అతురపడవద్దు. త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మను జూపెదను. నాది నగదు బేరమే గాని యరువు బేరము కాదు. అనేకమంది నా వద్దకు వచ్చి ధనము, అరోగ్యము, పలుకుబడి గౌరవము, ఉద్యోగము, రోగనివారణము మొదలగు ప్రాపంచికవిషయములనే యడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వుమని యడుగువారు చాల తక్కువ. ప్రపంచ విషయములు కావలెనని యడుగువారికి లోటు లేనే లేదు. పారమార్దక విషయమై యోచించువారు మిక్కిలి యరుదు. కావున నీవంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెనని యడుగు సమయము శుభమైనది; శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించినవాని నన్నింటిని జూపెదను."
ఇట్లు బాబా వానికి బ్రహ్మమును జూపుటకు మొదలిడెను. వాని నక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటి కాతడు తన ప్రశ్న తానే మరుచునట్లు చేసెను. ఒక బాలుని బిలిచి నందుమార్వాడి వద్దకు బోయి 5 రూపాయిలు చేబదులు తెమ్మనెను. కుఱ్ఱవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటివద్ద లేడనియు వాని యింటి వాకిలికి తాళము వేసి యున్నదనియు చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి యప్పు తెమ్మని బాబా యనెను. ఈ సారి కూడ కుఱ్ఱవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితము లేకపోయెను.
సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మవతారమేయని మనకు తెలియును. అయినచో 5 రూపాయిల అప్పు చేయవలసిన యవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో నేమి పనియని ఎవరైన అడుగవచ్చును. వారికి అ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా యింటివద్ద లేరని వారికి తేలిసియే యుండును. ఇది యంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చినవాని కొరకై జరిపించి యుందురు. అ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట యుండెను. అతనికి నిజముగా బాబా వద్దనుంచి బ్రహ్మజ్ఞానము కావలసి యున్నచో, బాబా యంత ప్రయాసపడుచున్నప్పు డతడూరకనే కూర్చుండడు. బాబా యా పైకమును తిరిగి యిచ్చి వేయునని కూడ వానికి తెలియును. అంత చిన్న మొత్తముయినప్పటికిని వాడు తెగించి యివ్వలేకపోయెను. అట్టివానికి బాబా వద్దనుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట! నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయల తీసి యిచ్చియుండునే కాని ప్రేక్షకునివలె ఊరికే చూచుచు కూర్చుని యుండడు. ఈ పెద్దమనిషి వైఖరి శుద్ద విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞన మివ్వుమని తొందరపెట్టుచుండెను. అప్పుడు బాబ యిట్లనేను: "ఓ మిత్రుడా! నేను నడుపుచున్నదాని నంతటిని గ్రహించలేకుంటివా యేమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై 5 వస్తువులను సమర్పించవలెను. అవి యేవన: - 1. పంచ ప్రాణములు 2. పంచేంద్రియములు 3. మనస్సు 4. బుద్ది 5. అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా యాత్మసాక్షాత్కారమునకు బోవు దారి చాల కఠినమయినది. అది కత్తివాదరవలే పదునైనది.
అట్లనుచు బాబా విషయమునకు సంబంధించిన సంగతులన్నియు జెప్పెను. వాని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరచితిమి:
బ్రహ్మజ్ఞానము లేదా అత్మసాక్షాత్కారమునకు యోగ్యత
అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము.
1. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు త్రీవమయిన కోరిక
ఎవడయితే తాను బద్దుడనని గ్రహించి బంధనములనుండి విడివడుటకు కృతినిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు అధ్యాత్మికజీవితము కర్హుడు.
2. విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట
ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థికరంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.
3. అంతర్ముఖత (లోనికి జూచుట)
మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు కనుక మనుష్యుడెప్పుడు బయట నున్న వానిని చూచును. కాని అత్మసాక్షాత్కరము లేదా మోక్షము కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడవలయును.
4. పాపవిమోచన పొందుట
మనుష్యుడు దుర్మార్గమార్గమునుండి బుద్దిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సు చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడ అత్మసాక్షాత్కారము పొందలేదు.
5. సరియయిన నడవడి
ఎల్లప్పుడు సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు బ్రహ్మచారిగ నుండిగ గాని అత్మసాక్షాత్కారము లభించదు.
6. ప్రియమైనవాని కంటె శ్రేయస్కరమైనవానిని కోరుట
లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది ప్రీతికరమయినది. మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో నొకదానినే అతడెంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటిదానిని అనగా శుభమైనదానిని కోరును. బుద్ది తక్కువవాడు రెండవదానిని కోరును.
7. మనస్సును ఇంద్రియములను స్వాధినమందుంచుకొనుట
శరీరము రథము; అత్మదాని యజమాని; బుద్ది ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱముల వలె) వాడు గమ్యస్థానమును చేరలేడు. చావుపుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించుశక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనముందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱము వలె) ఎవడు తన బుద్దిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు; విష్టుపదమును చేరగలడు.
8. మనస్సును పావనము చేయుట
మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించని యెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైన దానిని కనుగొనుట) వైరాగ్యము (అసత్యమైన దానియందభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా అత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, అత్మసాక్షత్కారమున కవకాశము లేదు. దేహమే ’నేన’ నుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమందభిమాన ముండుటయే బంధమునకు కారణము. నీవాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో యీ యభిమానమును విడువవలెను.
9. గురువుయొక్క యావశ్యకత
అత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమునైనది. ఎవ్వరైన తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక అత్కసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమందు నడచియున్నవారు కావున శిష్యుని సులభముగా అధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీదనుంచి యింకొక పైమెట్టునకు తీసికొని పోగలరు.
10. భగవంతుని కటాక్షము
ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమునుండి తరింపజేయగలడు. "వేదము లభ్యసించుటవల్ల గాని మేధాశక్తి వల్లగాని పుస్తక జ్ఞానమువల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. అత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు"నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.
ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా యా పెద్దమనుష్యుని వైపు తిరిగి "అయ్యా! నీ జేబులో బ్రహ్మము యాబదింతలు 5 రూపాయల నోట్లు రూపములో (250) నున్నది. దయచేసి దానిని బయటకు దీయుము" అనెను. అ పెద్ద మనుష్యుడు తన జేబునుంచి నోట్లకట్టను బయటకు దీసెను. లెక్కపెట్టగా సరిగా 25 పదిరూపాయల నోట్లుండెను. అందరు మిక్కిలి యాశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను జూచి వాని మనస్సు కరగెను. బాబా పాదములపైబడి వారి యాశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా యిట్లనేను. "నీ బ్రహ్మపు నోటుకట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాసను, లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమైయున్నదో, వాడా యాభిమానమును పోగొట్టుకొననంతవరకు బ్రహ్మము నెట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండము వంటిది. అది యసూయ యహంభావమును మొసళ్ళతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్దవైరము గలవి.
ఎక్కడ పేరస గలదో యక్కడ బ్రహ్మము గూర్చి యాలోచించుటకు గాని, దానిని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాసగలవాడు విరక్తిని, మోక్షమును ఎట్ల సంపాదించగలడు? లోభికి శాంతిగాని సంతుష్టిగాని, దృఢ నిశ్చతముగాని యుండవు. మనస్సునందేమాత్రము పేరాసయున్నను సాధనలన్నియు (అధ్యాత్మిక ప్రయత్నములు) నిష్ర్పయోజనములు.
ఎవడు ఫలాపేక్షారహితుడు కాడో, ఎవడు ఫలాపేక్షకాంక్షను విడువడో, ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్ప చదువరియైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది. అత్మసాక్షాత్కారము పొందుట కిది వానికి సహయపడదు. ఎవరహంకారపూరితులో, ఎవరింద్రియవిషయముల గూర్చి యెల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిష్ర్పయోజనములు. మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. అది లేనిచో మన అధ్యాత్మిక ప్రయత్నములన్నియు అడంబరము డాంబికము కొరకు చేసినట్లుగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజనా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన దాని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకొన యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షీంచవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అ సత్యములు పలుకను!"
ఒక యతిథిని ఇంటికి బొలిచినప్పుడు, ఇంటిలోనివారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు గూడ అతిథి తో పాటు విందులో పాల్గొందురు. కావున నప్పుడు మసీదులో నున్నవారందరు బాబా అ పెద్దమనిష్యునకు చేసిన యీ అధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా యాశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట నున్నవారందరును, అ పెద్ద మనిషితో సహ, మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందినవరై వెళ్ళిపోయిరి.
బాబావారి వైశిష్ట్యము
అనేకమంది సన్యాసులు ఇండ్లు విడచి యడవులలోని గుహలలోను, అశ్రమములలోను, నొంటరిగా నుండి జన్మరాహిత్యమునుగాని, మోక్షముగాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరులగూర్చి యాచించక అత్మానుసంధానమందే మునిగి యుందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లుగాని, భార్యగాని, సంతానముగాని, బంధువులుగాని లేరు. అయిన్నప్పటికి వారు సమాజములోనే యుండెడివారు. బాబా నాలుగయిందిండ్లు నుండి భిక్షచేసి, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చునెడువారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు, ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలయునో బోధించెడువారు. అత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట గూడ ప్రజలు క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి యరుదు. అట్టివారులో శ్రీసాయిబాబా ప్రథమగణ్యలు.
కనుక హేమడ్‌పంతు ఇట్లు చెప్పెను. "ఏ దేశమునందు సాయిబాబా యను యీ అపూర్వము అమూల్యము యైన పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము! ఏ కుటుంబములో వీరు పుట్టిరో యదియు ధన్యము! ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు!’
శ్రీ సాయినాథాయ నమః 16-17వ అధ్యాయములు సంపూర్ణము
సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు
 శుభం భవతు

నవదుర్గాస్తోత్రం



శైలపుత్రీ-
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం |
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం ||
బ్రహ్మచారిణీ-
దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలః |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
చంద్రఘంటా-
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
కూష్మాండా-
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
స్కందమాతా-
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
కాత్యాయనీ-
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
కాళరాత్రీ-
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||
వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||
మహాగౌరి-
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||
సిద్ధిదాత్రీ-
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్సిద్ధిదా సిద్ధిదాయినీ ||


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




ఇంటికి వాడే పెయింటింగ్స్‌లో రంగుల ఫలితాలు

ఇంటికి వాడే పెయింటింగ్స్‌లో రంగుల ఫలితాలు


మీ ఇంటికి కొత్తగా పెయింట్ వేస్తున్నారా? అయితే నలుపు రంగును ఎక్కడా వేయకుండా జాగ్రత్త వహించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. నలుపు రంగు నీటికి చిహ్నం అయినప్పటికీ.. దీనిని ఎక్కువగా వాడకూడదని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పైకప్పుల మీద, దూలాలకు ఈ రంగును పొరబాటున కూడా వాడకూడదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇంకా నలుపు రంగును గృహానికి వేయించే పెయింట్‌లో ఎక్కడా వాడకుండా ఉండటమే మంచిది.

కానీ దూలాలకు, పైకప్పులకు తెలుపు రంగును వాడటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే గృహంలో పడమర దిక్కున తెలుపు రంగుతో కూడిన పోస్టర్లును తగిలిస్తే కుటుంబ సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. 

ఇక ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను మీ గృహంలోని దక్షిణ, ఆగ్నేయ, ఈశాన్య దిశల్లో ఉపయోగించడం ద్వారా అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. రాబడికి ప్రతి రూపం ఎరుపు రంగు. అందువల్ల దక్షిణం వైపు ఎరుపు రంగు పోస్టర్లు, కర్టెన్‌లు, కార్పెట్‌లు వుంచితే లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు సమసిపోతాయి.

ఆగ్నేయం వైపు ఆకుపచ్చ రంగు సంపదకి ప్రతిరూపం. ఇదే రంగు తూర్పువైపు కూడా వేయిస్తే శుభఫలితాలుంటాయి. అందువల్ల రంగురంగుల పూల మొక్కల కుండీలను ఆగ్నేయ, తూర్పు దిశల్లో వుంచడం ద్వారా సంపద పెరుగుతుంది. ఇకపోతే.. నీలం రంగును ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు ఉంచడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి.

contact for selecting  colour options to homes and officess as per fengshui 9000123129

శని, కుజులు పరస్పర సంఘర్షణ వృశ్చిక రాశిలో


శని, కుజులు పరస్పర సంఘర్షణ వృశ్చిక రాశిలో


శని, కుజులు పరస్పర శత్రు గ్రహాలు. ఈరెండు వృశ్చికరాసిలో కలవటం తో పాటు బుధవారం (౩౦-8-2016) ఖగోళం లో ఉభయ గ్రహాలూ కొన్ని దశాబ్దాల అనంతరం ఒకే బిన్డువుపైకి రావటం జరిగింది.దీని పరిణామం గా ప్రకృతి వైపరీత్యాలు అయిన తీవ్ర  వర్షపాతం ,భూకంపాలు లాంటివి ఏర్పడుతాయి.ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 న కుజుడు  వృశ్చిక రాసి లోకి ప్రవేసిన్చినప్పటికి వక్రగమనం వల్ల తిరిగి వెనకకి తులరాసి లోకి వెళ్ళింది.గ్రహాల సంఘర్షణ ముందు చివరి రోజులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.శని కుజుల కలయిక ఆగస్ట్ 23 నుండి అక్టోబర్ 11 వరకు వుంటుంది.సెప్టెంబర్ 1 నాడు ఏర్పడబోయే సూర్యగ్రహణం పై కూడా శని దృష్టి పడుతుంది.శని కి వృశ్చిక రాసి శత్రు స్థానం మరియు కుజుడు శత్రు గ్రహం అందువల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఈ 50 రోజుల  కాలం లో ప్రకృతి వైపరీత్యలె కాకుండా రాజకీయ సంక్షోభాలు కూడా జరుగుతాయి.12  రాసులపైన కూడా ప్రభావం ఉంటుంది. కృతిక, రోహిణి ,మృగశిర నక్షత్ర జాతకులకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వృత్తి ,వ్యాపార,ఆరోగ్యం ,ఉద్యోగ,వాహన, కోర్ట్ కేసు ,పెట్టుబడులు, బాకీలు మొదలైన వ్యవహారాలలో జాగ్రత్త  వహించండి.
ఈ 50 రోజులు  లలిత సహస్ర నామాలు పటించడం తో పాటు  problems తీవ్రం గా  ఉన్న వాళ్ళు మరియు కృతిక,రోహిణి,మృగశిర నక్షత్ర జాతకులు సుదర్శన శతక పారాయణ చేయించుకోండి .

కాంటాక్ట్ 9000123129

ఏ కాక్షి నారికేళం

 ఏ కాక్షి నారికేళం

ఆస్తికుల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి ఎలాంటి వస్తువులలో నివాసం ఉంటుందంటే వారు చెప్పే సమాధానాలు ఇవి :
1. దక్షిణావర్త శంఖం
2. ముత్యాల శంఖం
3. ఏకాక్షి నారికేళం 

4. లక్ష్మి కారక గవ్వలు
5. శ్రీఫలం
6. గోమతి చక్రాలు
7. తామర గింజలు
8. రాఖ్తబీజాలు (గురిగింజలు)
9. శ్రీ యంత్రం
10. శ్రీ కూర్మం
11.పంచలోహాలు-నవరత్నాలు
ఈ వస్తువులను పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
 



ఏ కాక్షి నారికేళం
              ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు.
ఏ కాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్ధం.సాధారణంగా అన్ని కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి.ఈ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను  ఒక కన్ను వెడల్పు గాను ఉంటుంది.వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్ళను రెండు కళ్ళ గాను చెబుతారు.ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను ,ఒక నోరు ఉంటుంది.ఇవి దొరకటం చాలా కష్టం.వేలాది కొబ్బరికాయల్లో ఏ ఒక్కదాంట్లోను ఇలా రావచ్చు.మార్కెట్ లో తాటికాయలనే ఏకాక్షి నారికేళం గా అమ్ముతున్నారు.వీటితో పూజిస్తే ఫలితం శూన్యం.ఏ కాక్షి అంటే ఒక్కటే కన్ను ఉంటుందని అనుకుంటారు కాని ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను,ఒక నోరు ఖచ్చితంగా ఉంటాయి.


లక్ష్మీదేవి పూజలో ఏకాక్షి నారికేళం ప్రాధాన పాత్ర పోషిస్తుంది ... దీనిని ఉపయోగిస్తూ పూజ చేయడం వలన ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందని అంటారు. ఇక ఈ పూజ 'దీపావళి' రోజున చేసినట్టయితే అది మరింత విశేష ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తోంది. ఏకాక్షి నారికేళాన్ని పూజా మందిరంలో వుంచడం వలన సుఖసంపదలు ... కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.

ఇక ఈ ఏకాక్షి నారికేళం ఇంట్లో ఉన్నంత వరకూ ఎలాంటి దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించలేవు. ఎవరైనా పిశాచ బాధలు పడుతున్నట్టయితే వారి ఒడిలో ఏకాక్షీ నారికేళాన్ని వుంచినట్టయితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. గర్భవతులైన స్త్రీలకు ఏకాక్షి నారికేళం వాసన చూపించడం వలన సుఖ ప్రసవం జరుగుతుందని అంటారు. సమస్త సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తూ ..ఉంటుంది ఈ మహిమాన్వితమైన ఏకాక్షి నారికేళం.

ఏకాక్షి నారికేళాన్ని అభిసేకించి లక్ష్మీదేవికి అర్పించి పూజిస్తే తనకి అత్యంత ప్రీతికరమైన ఏకాక్షి నారికేళాన్ని సమర్పించినందుకు కోరిన సంపదలనిస్తుంది. అష్టైశ్వర్యాలను కలుగచేస్తుంది.

పూజా విధానం;-
           ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఏ కాక్షి నారికేళాన్ని శుబ్రమైన నీటితో గాని,గంగా జలంతో గాని కడిగి పసుపు,కుంకుమ,చందనములతో నారికేళాన్ని అలంకరించాలి.
ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఉంచి, ఎర్రని వస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి, ధనలాభం చేకూరుతుంది .          
  ఏ కాక్షి నారికేళానికి పూలు,అక్షింతలతో లక్ష్మి  సహాస్త్రనామంతో పూజ చేయాలి.ఈ పూజలో గవ్వలు,గోమతిచక్రాలకు కూడ పూజ చేయవచ్చు.
             ఏ కాక్షి నారికేళాన్ని ఇంటి పూజా మందిరంలోగాని,షాపు పూజామందిరంలో గాని,విధ్యా సంస్ధలలో గాని,ప్యాక్టరీలలోగాని దీనిని ప్రతిష్టించవచ్చు.
             ఏకాక్షి నారికేళాన్ని శుక్రవారం గాని,దీపావలి రోజులలో గాని విశిష్ట పూజ చేస్తే మంచిది.
                                                       మంత్రం
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మహాలక్ష్మీం స్వరూపాయ ఏకాక్షి నారికేళాయ నమః సర్వసిద్ధి కురుకురు స్వాహా!
 అనే మంత్రాన్ని 108 సార్లు పఠించటం మంచిది.



ఉపయోగాలు:-
           


            ఏకాక్షి నారికేలాన్ని పూజించేవారి ఇళ్లలోని కుటుంబ సబ్యులపై ఎటువంటి తాంత్రిక దుష్ప్రభావాలు పనిచేయవు. రోగాలు,కష్టాలు దూరమవుతాయి

           ఏకాక్షి నారికేళాన్ని  శివాలయంలో ఆలయంలో  దానం చేసిన కోర్టు భాదలు,రుణ భాదలు ఉండవు.
           ఏకాక్షి నారికేళం పూజ చేసే వారికి ఉద్యోగ రంగంలో ఉన్నత స్థానం కలుగుతుంది.
           ఏకాక్షి నారికేళం పోటీ పరీక్షలలో విజయం సాదించవచ్చును.
           ఏకాక్షి నారికేళం ఉన్నచోట శత్రుభాదలు ఉండవు.
           బిడ్డలు కలగని స్త్రీకి ఏకాక్షి నారికేళాన్ని శుభ్రంగా నీటిలో కడిగి ఆ నీటిని తాగటం వలన గర్బప్రాప్తి కలుగుతుంది.
          ఏకాక్షి నారికేళం ఆయువృద్ధికి,ఐశ్వర్య వృద్ధికి హేతువు.ఏ కాక్షి నారికేళం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో                   
           దుష్టశక్తుల,నరదృష్టి ప్రభావం ఉండదు.
          ఏకాక్షి నారికేళం ఉన్న ఇంటిలో ఎటువంటి భాదలు గాని,గొడవలు గాని,అపోహలు గాని ఉండవు.కుటుంబ సభ్యులందరి మధ్య సహాయ సహాకారాలు,అన్యోన్యత,అనురాగాలు,ఆప్యాయతలు కలిగి ఉంటారు.
          ఏకాక్షి నారికేళం ఉన్న షాపులోగాని,ప్యాక్టరీలలో గాని,విధ్యా సంస్ధ లలో గాని ఉంచి పూజ చేసిన ఆకర్షణ,వ్యాపారాభివృద్ది కలుగుతాయి
         పిల్లలలో తెలివితేటలు,చదువుపై శ్రద్ధ,పోటితత్వం కలుగుతాయి.
        ఏకాక్షి నారికేళం ఉన్నచోట సర్వవిదాల అభివృద్ధి,సర్వకార్యసిద్ధి,జనాకర్షణ కలుగుతాయి.