Thursday 8 April 2021

ఈ మొక్కలు నాటితే సంపదతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది.. ఏంటంటే?




మొక్కలు ఆక్సిజన్ ను  ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. కాలానికి తగినట్లు వర్షాలు పడాలన్నా, ప్రకృతికి మేలు చేయాలన్నా చెట్లను తప్పకుండా నాటాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం మొక్కలను విధిగా నాటడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే సమస్యలను సానుకూల శక్తి ద్వారా అధిగమించవచ్చని చెబుతారు. ఈ సానుకూల శక్తిని మొక్కల ద్వారా ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని మొక్కలను నాటితే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి రోడ్డు పక్కన 5 వట వృక్షాలను వాటితే ఎన్నో శుభఫలితాలు ఉంటాయాని పేర్కొంది. అంతేకాకుండా ఈ మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అవరోధాలు, సమస్యలు వాటంతటా అవే వెళ్లిపోతాయి. అంతేకాకుండా జాతకులను వెంటాడుతున్న అనేక రకాలైన కష్టాలు, ఇబ్బందులు ముగిసిపోతాయి. సానుకూల శక్తి లభించి జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది.

​మోదుగ చెట్టు నాటితే..

జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రజల జీవితాల్లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్నట్లయితే 5 మోదుగ చెట్లను నాటాలి. అవి కూడా రోడ్డుకిరువైపులా నాటితే మంచిది. ఒకవేళ కుదరకపోతే పొలంలో నాటితే మంచిదని గుర్తుంచుకోండి. ఇంట్లో లేదా ఇంటి చుట్టూ ఎప్పుడూ వీటిని నాటకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఐదు మోదుగ చెట్లను నాటడం ద్వారా జాతకులకు 10 రెట్లు అధికంగా పుణ్యాన్ని పొందుతారని విశ్వసిస్తారు.

​పారిజాత మొక్కలను నాటితే..

ఎవరైనా వ్యక్తి జాతకంలో అంగారక దోషమున్నట్లయితే వారు 2 పారిజాత మొక్కలను నాటడం ఉత్తమమని చెబుతారు. ఇలా చేయడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తారని నమ్ముతారు. ఫలితంగా అంగారక దోషం తొలగి శుభకరంగా ఉంటుంది. ఈ రెండు పారిజాత మొక్కలను హనుంతుడి ఆలయంలో ఎక్కడైనా నాటాలి. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తికి స్వర్ణదానం చేసినంత పుణ్యం కలుగుతుందని చెబుతారు. అంతేకాకుండా జీవితంలో సమస్యలను కూడా అధిగమిస్తారని విశ్వసిస్తారు.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371














No comments:

Post a Comment