Monday 26 April 2021

27 ఏప్రిల్ 2021, మంగళవారం, చైత్ర పూర్ణిమ



చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. అదేగాక ఇంకో కధనం కూడా ఉంది. చైత్రపూర్ణిమ నాడు ఆంజనేయస్వామి వారి అసురసంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా, హనుమాన్ విజయోత్సవంగా జరుపుతారట.
ఈ చైత్ర పూర్ణిమ నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల పాటు హనుమాన్ మండల దీక్షను చేపడతారు. కఠిన బ్రహ్మచర్యం మొదలైన నియమాలు పెట్టుకుని, నిత్యం ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. అంత కఠిన నియమాలు పాటించకున్నా, మనం కూడా నిష్ఠగా ఈ మండలం రోజులు నిష్ఠగా ఒక్కసారి లేదా 5 సార్లు చాలీసా పారాయణ చేస్తామని సంకల్పం చెప్పుకోవచ్చు. నిజానికి ఇప్పుడిది అత్యవసరం కూడా. ఎందుకంటే హిందూ సమాజంలో జాడ్యం, బద్దకం, నిర్లిప్తత, తమస్సు మొదలైన గుణాలు పెరిగిపోయాయి. అవన్నీ వదలాలంటే, తప్పకుండా ఆంజనేయ స్వామి వారిని వేడుకోవాలి. అప్పుడే హిందువుల్లో చైతన్యం ఉట్టిపడుతుంది, జడత్వం నశిస్తుంది. కనుక సనాతన ధర్మ పునర్వైభం, భారతదేశ సంరక్షణ, ప్రపంచ శాంతి అనేవి సంకల్పాలుగా చేసుకుని, మనం కూడా ఈ 40 రోజుల పాటు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు. మన కోసం చేసిన పూజ కంటే, పదిమంది మేలు కోరి చేసింది, మరింత ఫలితం ఇవ్వడమే కాదు, మనకు శీఘ్ర ఫలాన్ని, రక్షణను, కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని ఇస్తుంది.
ఓం శ్రీ హనుమతే నమః
శ్రీ రామదూతం శిరసా నమామి
జై శ్రీ రామ
రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ


ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి

సర్వే జనాః సుఖినో భవంతు, శుభమస్తు. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. follow us : plz like , share , follow and subscribe facebook page https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888 Whats app group https://chat.whatsapp.com/B57snQO4QZ7KI1EH7p2qi5 Telegram link https:/https://t.me/joinchat/B2gE2ZlZuac1MDhl Signal link https://signal.group/#CjQKIL_2Z4ElJmED1q-b2WYKhULMt23wwje-H5NNDf5ph7K9EhBAvxGFTFNRTxpnP-6Nki-C YouTube https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw Printerest https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/ Twitter https://twitter.com/VidhathaAstrolo Instagram https://www.instagram.com/sreevidhathapeetam/ Blog https://vidhaathaastronumerology.blogspot.com/ జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (AKAANKKSHA YEDUR) (MCA, GNIIT, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

No comments:

Post a Comment