Monday 12 April 2021

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీన రాశి ఫలాలు

 



మీన రాశి ఫలితములు
పూర్వాభాద్ర 4 వ పాదము (ది)
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝ, థా)
రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)


ఆదాయం -11 వ్యయం-5 రాజయోగం-2 అవమానం-4


🎉ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబరు 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (వ్యయం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకరరాశి (లాభం)లో సంచరించును. శని సంవత్సరం అంతయూ మకరంలో (లాభం) సంచరించును. రాహువు వృషభంలో (తృతీయం) కేతువు వృశ్చికంలో (భాగ్యం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధిక కాలము శని, గురువు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. సెప్టెంబరు నుండి నాలుగు మాసములు కుజుడు అనుకూలింపక అదే సమయంలో గురువు వ్యయంలో కుంభంలో సంచారం చేయుకాలము మాత్రమే యిబ్బందికరము. మిగిలిన కాలము అంతా అనుకూలముగా ఉంటుంది.
🎉అన్ని కోణాలలోను శ్రమకు తగిన ఫలితాలు చక్కగా అందుతాయి. ప్రతి విషయంలోను అందరి నుండి మంచి సూచనలు సహకారము లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక కార్యకలాపాలు యిబ్బంది లేకుండా నడచిపోతాయి. ఆదాయం, వ్యయం రెంటినీ సమర్థంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా దైనందిన కార్యక్రమములు చక్కగా నిర్వహింపబడి మీ వలన ఎవరికీ యిబ్బంది లేకుండా మీరు సుఖంగా జీవనం చేయుటకు అనుకూలమైన కాలము నడుచుచున్నది. అనవరస ఖర్చులు నియంత్రిస్తారు. ధనంతో ముడిపడిన ప్రతి అంశమును చక్కగా సాధించుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ బాగా సాగుతుంది. తోటివారి సహకారం మరియు పై అధికారుల సహకారం బాగుంటాయి.
🎉ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేకుండా కాలక్షేపం చేస్తారు. మీ యొక్క వ్యాపార విషయాలు కూడా నష్టం లేకుండా చక్కగా జరుగుతాయి. గురువు మకరంలో వున్నకాలం అంతా ఎంతో లాభదాయకంగా కాలక్షేపం జరుగుతుంది. అవివాహితులకు గురువు మకరంలో సంచారంలో ఉండగా శుభపరిణామాలకు అవకాశం ఉంటుంది. మీ కుటుంబ ఆచార వ్యవహారములను చక్కగా నిర్వహిస్తూ వాటికి సంబంధించిన అన్ని పనులను సమర్థంగా నడుపుకుంటారు. అలంకరణ వస్తువులు తరచుగా కొనుగోలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యములలో పాల్గొంటారు. గృహనిర్మాణ యోచన బాగా సాగుతుంది.
🎉సాంఘిక కార్యకలాపాల యందు తరచుగా పాల్గొంటారు. ఇష్టార్ధ సిద్ది చేకూరుతుంది. ప్రశాంత చిత్తంతో జీవనం సాగిస్తారు. ముఖ్యంగా అన్ని విషయాలలోను మీకు కావలసిన పనులు చక్కగా జరగడం దృష్ట్యా ఎంతో లాభదాయకంగా కాలక్షేపం చేస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చాలావరకు సానుకూలమే. అందులోను విద్యాపరంగా వెళ్ళేవారికి సంవత్సరం అంతా అనుకూలమే. అలాగే ఉద్యోగ విషయంగా విదేశాలలో ప్రయత్నాలు చేయువారికి గ్రహచారం అనుకూలంగా కనబడుతోంది. అందరూ సహకరిస్తారు. కన్స్ట్రక్షన్ రంగంలోను, రియల్ ఎస్టేట్ రంగంలో వున్నవారి విషయంలో ఈ సంవత్సరం సమస్యలు తీర్చుకొని కొత్త కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉన్నది.
🎉ఫైనాన్స్ వ్యాపారులు కూడా అదే రీతిగా అడుగు ముందుకు వేసి లబ్ధిపొందే అవకాశం ఉన్నది. షేర్ వ్యాపారులకు, సరుకులు నిల్వ చేసి వ్యాపారం చేయువారి విషయంలోను ప్రశాంతంగా వ్యాపారం చేయు అవకాశములు వస్తాయి. సర్వత్ర విజయం సాధిస్తారు. యిక శుభకార్యముల విషయంలో గురువు మకరంలో సంచారం చేయుకాలము చాలా అద్భుతంగా అనుకూలించే కాలము. పుణ్యకార్య ప్రయత్నాలు చక్కగా నడుచును. విద్యార్థులకు గురువు మకరంలో ఉండగా అధిక సానుకూల ఫలితాలు, గురువు కుంభంలో ఉండగా సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు కాలం అనుకూలమే కానీ సంవత్సరాంతంలో ధనం వెసులుబాటు తగ్గుతుంది. కోర్టు వ్యవ హారములలో వున్నవారికి కార్యసాఫల్యం లక్షణాలు గోచరిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాలలో అనవసర భయము, ధనవ్యయము గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు అవసరం.
🎉స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి అంతా శుభంగా గోచరిస్తున్నా పనులు స్వయంగా చేసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి మీరు స్వయంగా చేయు పనులు సానుకూలం అవుతాయి. గురువు కుంభంలో వుండగా అయితే ధనవ్యయం అధికం అవుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. అప్రయత్నంగా ప్రమోషన్లు అందుకునే కాలము. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. చేస్తున్న ఉద్యోగంలో నుండి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి.
🎉నూతన వ్యాపార ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. అన్ని కోణాలలోను శుభపరిణామాలు ఉంటాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా యిబ్బందులు ఏమీ ఉండవు. అభివృద్దిగా ఉండి మీరు ధైర్యంగా జీవిస్తారు. అలాగే పిల్లల విద్య ఉద్యోగం సంతానం వంటివాటిలో కూడా మంచి వార్తలు వింటారు. ఆనందంగా ఉంటుంది. కుటుంబ విషయంగా కుటుంబ సభ్యులు అందరికీ స్నేహపూర్వక వాతావరణం నడుచును. బంధుమిత్రుల రాకపోకలు వారు మీ యొక్క శుభకార్య పుణ్యకార్య విషయాలలో సహకారం చేయడం మీ సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుంది. ఋణ విషయంలో పాత ఋణములు వున్నవారికి యిబ్బందులు ఉండవు. ఋణదాతల నుండి ఎటువంటి యిబ్బందికర వాతావరణము ఉండదు. అదే రీతిగా కొత్త ఋణములు అనుకున్న రీతిగా అందుతాయి.
🎉ఆరోగ్య విషయంలో యిబ్బందులు ఏమీ వుండవు అనే చెప్పాలి. కుంభంలో గురువు వుండగా కుజుడు సెప్టెంబర్ నుండి కన్య తుల రాశులలో సంచారం చేయు కాలంలో యిబ్బంది పెరిగే అవకాశం ఉంటుంది. అందువలన శరీర పుష్టి తగ్గడం, జ్వరబాధలు రావడం అనేవి ఉంటాయి. ఈ సందర్భంలో కుజ గురువుల దృష్ట్యా రోజూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు తేలికగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కుకుంటారు. కొన్ని అంశాలలో మర్యాదహాని జరిగే అవకాశం ఉంటుంది. మీరు తగు జాగ్రత్తగా వాక్ థోరణిని ప్రదర్శించడం మంచిది.
🎉స్త్రీలకు ఈ సంవత్సరం అంతా శుభపరిణామాలే. అందరితో స్నేహంగా ఉంటూ చాలావరకు కార్యములు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెడతారు. ఉద్యోగంలో వృద్ధి వ్యాపారంలో అభివృద్ది కుటుంబపరంగా అంతా విజయమే ఉంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడం వంటివే కాక సంతృప్తికర జీవనం సాగిస్తారు. గర్భిణీ స్త్రీలు సెప్టెంబరు నుండి డిశంబరు వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలినకాలం అంతా శుభప్రదమే.
🎉 పూర్వాభాద్ర నక్షత్రం వారికి విశేషములు ఏమనగా సంవత్సరాంతంలో అధిక లాభాలు అందుకుంటారు. ప్రతిపనీ విజయవంతం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తూ ఎక్కువగా శ్రమిస్తారు. కొన్నిసార్లు మోసపూరిత వాతావరణం మీతోపాటే ప్రయాణం చేస్తుంది.
🎉 ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి విశేషములు ఏమనగా సాధ్యం కాని పనులు కూడా సాధించుకుంటారు. రోజూ పని ఒత్తిడి పెరుగుతుంది. అన్ని అంశాలలో ధనవ్యయం అధికం అవుతుంది. జీవనోపాధి విషయాలలో ఎంతో విశేష ఫలితాలు ఉంటాయి.
🎉రేవతీ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా భార్య తరఫు బంధువుల ద్వారా కలహప్రాప్తి. ఉద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కొన్నిసార్లు విశేష లాభాలు కొన్నిసార్లు విశేష చికాకులు మీకు సంప్రాప్తం అవుతాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో విజయం సాధిస్తారు.
🎉నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
“నమోస్తు రామాయ సలక్ష్మణాయ - దేవ్యైచ తస్యై జనకాత్మజాయై - నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో - నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః”
– ఈ శ్లోకం అధిక సంఖ్యలో పారాయణ చేయుట ద్వారా శుభ పరిణామములు చేరువ అవుతాయి.
🎉శాంతి : దోషము చేయు గ్రహములు గురు కుజ నిమిత్తంగా ఏప్రిల్, నవంబరు మాసములలో జపదాన హోమశాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. పంచముఖ రుద్రాక్షధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. రోజూ గోపూజ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. రోజూ రుద్రాభిషేకం చేయించుకోవడం బీదలకు విద్యా విషయపు దానం చేయడం శ్రేయస్కరం.
🎉ఏప్రిల్ : శుభంగా కాలం గడుచును. అందరితోను స్నేహంగా కాలక్షేపం చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. కుటుంబసభ్యులు అన్ని వ్యవహారాలలోనూ బాగా సహకరిస్తారు. ప్రధానంగా మొండిధైర్యంతో ముందుకు వెళ్ళి చాలా వ్యవహారాలను సానుకూలం చేసుకుంటారు. అవకాశం ఉన్నంతవరకు కొత్త వ్యవహారాలు జోలికి పోవడం కంటే పాత సమస్యల మీద దృష్టి కేంద్రీకరించడం మీకు చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యల్ని తీర్చుకొనే అవకాశాలు బాగా వస్తాయి.
🎉మే : అద్భుతమైన కాలము. మీకు ఆదాయం వ్యయం రెండు అధికంగా ఉంటాయి. ప్రతిపనీ వేగంగా చేస్తారు. శ్రమకు తగిన లాభం ఉంటుంది. వ్యాపార విషయంలో వర్కర్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీకు కుటుంబ వ్యవహారాలకు, వృత్తి వ్యవహారాలకు సమన్యాయం చేస్తూ పనులు చేసే అవకాశాలు తగ్గుతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో అనవసర వ్యవహారాలలో కలుగజేసుకొని సమస్యలు కొనితెచ్చుకుంటారు. అవకాశం ఉన్నంతవరకు ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. మితభాషణ, ఓర్పు చాలా అవసరమని గ్రహించండి.
🎉జూన్ : ప్రశాంత జీవనం సాగుతుంది. కొత్త ప్రయోగాలు ఏమీ చేయవద్దు మీ యొక్క అనవసర ఖర్చులు నిరోధించండి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. రోజువారీ కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు అలాగే దూరంలో ఉన్నటువంటి మీ సంతతి ఈ నెలలో మీ దగ్గరికి రావడం, తద్వారా మీ దైనందిన కార్యక్రమములు అన్నీ కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంటుంది. కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆర్థిక, ఆరోగ్య, వృత్తి విషయాలలో వచ్చే సమస్యలు తెలివిగా సరిచేసుకుంటారు.
🎉జూలై: అంతటా శుభ పరిణామములే. స్నేహపూర్వకంగా అందరి తోనూ మంచి సహకారం అందుతుంది. గౌరవమర్యాదలు పెరుగుతాయి. మీ పిల్లల దగ్గర, మీ భార్య తరపు బంధువుల దగ్గర గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా సంప్రదాయ బద్ధంగా వ్యవహరించి కుటుంబ పరంగానూ, సామాజిక పరంగానూ ఉన్నతంగా జీవనం చేస్తారు. ఉద్యోగ, వ్యాపార విషయాలలో మీకు అందరినుండి మంచి సహకారం లభిస్తుంది. ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతారు.
🎉ఆగష్టు: ప్రశాంతంగా జీవనం గడిపే ప్రయత్నం చేయాలి. రోజూ పనులు ఆలస్యం అవుతాయి. అయితే వృత్తి సౌఖ్యం బాగుండడం ప్రత్యేక లాభం. ఏ పనీ సకాలంలో పూర్తి చేయకపోయినా, ఉద్యోగ వ్యాపార విషయాలలో ఇబ్బందులు ఉండవు. కుటుంబ సభ్యులు కూడా బాగా అనుకూలంగా ఉంటారు. మాసారంభం కంటే మాసాంతంలో మంచి ఫలితాలు బాగా ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బందులు లేకుండా సాగే అవకాశం ఉంటుంది.
🎉సెప్టెంబర్ : ప్రశాంతంగా వుండడానికి సాధన చేయవలసిన కాలము. ఎవరికీ ఎటువంటి హామీలు యివ్వవద్దని ప్రత్యేక సూచన. ఆర్థిక వ్యవహారాలలో ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరుగు తాయి. కుజుడు యొక్క సంచారం రాబోయే మూడు మాసాలు అనుకూలం తక్కువగా ఉన్న కారణంగా ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పరిధి దాటే అవకాశం ఉంటుంది. విజ్ఞాన, వినోద కార్యక్రమాలలో పాల్గొనే విధంగా ప్రయాణాలు ఎక్కువ చేయవలసి వస్తుంది.
🎉అక్టోబర్ : మంచి జీవనం చేయు అవకాశములు వచ్చినా అవరోధములు అధికం అవుతుంటాయి. ఎవరినీ నమ్మి ఏ కార్యము చేయవద్దు. స్థానచలన ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. ఉద్యోగరీత్యా అనుకూల స్థితి లేకపోయినప్పటికీ, వ్యాపారస్థులకు వర్కర్స్ అనుకూలించటం వలన పనులు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు చేయడం కంటే పాత సమస్యలను పరిష్కరించే రీతిగా ముందుకు వెళ్ళడంలో అనుకూలస్థితి ఎక్కువ ఉంటుంది. కుటుంబ విషయంగా క్రమక్రమంగా మంచి మార్పులు వస్తాయి.
🎉నవంబర్ : మంచి జీవనం చేస్తారు. పుణ్యకార్యములు శుభ కార్యములలో అధికంగా పాల్గొంటారు. అలంకరణ వస్తు విక్రయం జరుగుతుంది. గృహోపకరణాలు కొనే ప్రయత్నంలో ధనవ్యయం బాగా జరుగుతుంది. అనుకున్న రీతిగా ఆదాయం అందడం, ప్రతిపనీ కూడా సమయపాలనతో పూర్తవ్వడం వలన చాలా ప్రశాంత మైన జీవితం చేస్తారు. దైనందిన కార్యక్రమాలు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపార విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. తరచుగా శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. అన్ని కోణాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగా అందుకునే అవకాశం ఉంటుంది.
🎉డిసెంబర్ : అద్భుతమైన జీవనోపాధి విషయాలు ఉంటాయి. లాభదాయక జీవనం సాగుతుంది. ఆర్థిక ఆరోగ్య స్థితిలో అనుకూలముగా ఉంటాయి. గత సమస్యలు పరిష్కరించుకొనే ప్రయత్నంలో చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు. ఈ నెలలో కావలసిన ఋణ సౌకర్యం చేకూరుతుంది. ప్రతి విషయంలోనూ మీ ఆలోచనా తీరు అమలు చేసే విధానం తద్వారా పొందే ఫలితాలు అన్నీ సానుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో ఉన్నవారికి పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి ఫలితాలు సానుకూలం.
🎉జనవరి : శుభవార్తలు వింటారు. సర్వత్రా కార్యసిద్ధికి అవకాశం ఉన్నది. కుటుంబపరంగా మంచి ఫలితాలు అందుతాయి. దైవదర్శ నానికి ఎక్కువ యిష్టపడతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సానుకూల స్థితి ఏర్పడు తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ఈ నెలలో పనులు వేగంగా సాగే అవకాశం ఉంటుంది. తొందరపాటు ధోరణితో ఎవరితోనూ చర్చలు చేయవద్దని సూచన. అయితే దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంటుంది.
🎉ఫిబ్రవరి : అన్ని రంగాలలో నిరంతరం చక్కటి సాధన చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. డబ్బు ఖర్చు బాగా అవుతుంది. అయితే నూతనోత్సాహంతో కాలక్షేపం చేస్తారు. ప్రతి వ్యవహారాన్ని సానుకూలం చేసుకునే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేస్తారు. కొన్ని సందర్భాలలో మీ ఓర్పు మీకు బాగా లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. ధనవ్యయం ప్రతి అంశంలోనూ ఎక్కువ స్థాయిలో అవుతుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనపరచవలసిన అవసరం ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు తరచుగా వినే అవకాశం ఉంటుంది.
🎉మార్చి : రోజూ అన్ని కోణాలలో మంచి ఫలితాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలలో అనుకూల స్థితి ఏర్పడి ఉత్సాహంగా జీవనం సాగిస్తారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీ తోటివారు మీకు మంచి సహకారం అందిస్తారు. ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలలో కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఈ నెల రోజులు చాలా తక్కువగా ఉంటుందనే చెప్పాలి. తరచుగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవల్సిన అవసరం ఉంటుంది.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371





No comments:

Post a Comment