Monday, 12 April 2021

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యా రాశి ఫలాలు

 



కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు


ఆదాయం: 5 
వ్యయం: 5

రాజపూజ్యం: 5
అవమానం: 2

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 5 అవమానం: 2 ఈ రాశివారికి ఈ ఏడాది అన్నివిధాలా అనుకూలతలున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తులవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. స్థిరాస్థి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. శుభకార్యం తలపెడతారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. నిరుద్యోగులకు యోగకాలం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. రైతులకు ఆశాజనకం. వ్యవసాయ దిగుబడులు సంతృప్తినిస్తాయి. పంట డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఏజెన్సీలు దక్కించుకుంటారు. పదవుల స్వీకరణకు అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు చేపడతారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత ప్రధానం. పోటీపరీక్షలు ఆందోళన కలిగిస్తాయి. న్యాయవాదులు ప్రోత్సాహకరం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. తరచు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

*  ప్రతి శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి, పచ్చని పూలతో శనిని పూజించిన సర్వదోషాలు తొలగిపోతాయి.
* ఈ రాశివారు శ్రీమన్నారాయణుని తులిసి దళాలతో పూజించడం వలన సర్వదోషాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
* ఉత్తరా నక్షత్రం వారు స్టార్‌రూబి, హస్తా నక్షత్రం వారు స్పందనముత్యాన్ని, చిత్త నక్షత్రం వారు జాతిపగడాన్ని ధరించిన కలిసిరాగలదు. * ఉత్తరా నక్షత్రం వారు జువ్వి, హస్త నక్షత్రం వారు కుంకుడు, చిత్త నక్షత్రం వారు ఉసిరిక మొక్కను దేవాలయాలలో కానీ విద్యా సంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటిని శుభం కలుగుతుంది.





ఏప్రిల్‌

ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులకు విందు ఇస్తారు. తోబుట్టువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళిక వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.

మే

గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందున ఈ నెల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహారం, ఆతిథ్య రంగంలోని వారికి, చిన్నవ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూల సమయం. కోర్టు వ్యవహారంలో గెలవచ్చు.

జూన్‌

అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పవు. తరచూ శివార్చన చేయండి. సంతానం నుంచి శుభవార్త వింటారు. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. పర స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి . ఉద్యోగంలో అధికారు మెప్పు పొందుతారు.

జూలై

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చు. సతీమణితో కలిసి షాపింగ్‌ చేసి, కొత్త వస్తువును కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కామర్స్‌ విద్యార్థులకు సమయం బాగుంది. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.



ఆగస్టు

ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. శుభవార్త వింటారు.

సెప్టెంబర్‌

అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహార యాత్రలు చేస్తారు.

అక్టోబర్‌

ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. హామీగా ఉండొద్దు. కామర్స్‌, ఎకనామిక్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.



నవంబర్‌

అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చు కూడా పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. మీరు ఆశించిన ఉద్యోగం రావచ్చు. కానీ మీరు కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు. బంధువర్గంలో ఒకరితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి.

డిసెంబర్:

ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కామర్స్‌, టెక్నాజీ, మేథ్స్‌ విద్యార్థులకు సమయం అనుకూంగా ఉంది. స్నేహితులు తన ఉద్యోగంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసుకు సమయం అనుకూంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.

జనవరి

ఈ నెల చివరి వారం నుంచి కొంత అనుకూల సమయం ప్రారంభమవుతుంది. త్వరలో మీ కష్టాలు తొలగిపోయే అవకాశముంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రతికూల గ్రహ సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. తరచూ శివార్చన చేయించండి.

ఫిబ్రవరి

సంతానం నుంచి శుభవార్త వింటారు. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల మీద బాగా ఖర్చు చేస్తారు. శుభవార్త వింటారు.

మార్చి

ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కళా సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment