Monday, 12 April 2021

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి ఫలాలు

 






మేష రాశి ఫలితములు
అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)
ఆదాయం-8 వ్యయం-14 రాజయోగం -4 అవమానం-3
🎉 ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబరు 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (లాభం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకర రాశి (దశమం)లో సంచరించును. శని సంవత్సరం అంతయూ మకరంలో (దశమం) సంచరించును. రాహువు వృషభంలో (ద్వితీయం) కేతువు వృశ్చికంలో (అష్టమం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధికకాలము గురు, రాహు, శని గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. శని సంచారము యిబ్బందికరము కాదు. గురువు లాభరాశి సంచారం కాలములో జరిగే మంచి ఆర్థిక లావాదేవీలు సంవత్సరం అంతా కూడా మీకు అనుకూల స్థితిని కలుగచేయునవిగా ఉంటాయి. అంతేకాకుండా మధ్యమధ్యలో నెలకు ఒకసారి మారే రవికుజ శుక్రల సంచారం ప్రభావం చేత కూడా యింకా విశేషాలు అందే అవకాశం ఉంది.
🎉 దైనందిన కార్యక్రమములు అన్నీ సవ్యంగా ఉన్నాయి. రోజురోజుకు అనుకూల స్థితి పెరగడం దృష్ట్యా మీకు భవిష్యత్తు మీద ఆశ జనియిస్తుంది. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. అందరి నుండి ప్రోత్సాహం బాగా అందడమే కాకుండా కొత్త వ్యాపార అంశాలకు పాత వ్యవహార చికాకుల పరిష్కారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. పురోభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయడమే కాదు సమస్యా పరిష్కారం మీద దృష్టి పెట్టి ఎన్నో అభివృద్ధి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో సంవత్సరారంభంలోను మరియు అక్టోబరు, నవంబరు మాసాలలో చిన్న చిన్న చికాకులు ఉత్పత్తి అవుతుంటాయి. మీకు మీ పై అధికారుల సహకారం ఉండడం వలన సమస్యలను దాటవేయగలుగుతారు. కీర్తి ప్రతిష్ఠలకు యిబ్బంది లేకుండా గౌరవప్రదమైన జీవనం సాధిస్తారు. సాంఘిక కార్యకలాపాలు మీకు లాభిస్తాయి. మీకు మీ దగ్గర పనిచేయువారు బాగా సహకరించడం వలన ఎన్నో అంశాలలో విజయం అందుతుంది.
🎉 వ్యాపారులకు మంచి పోటీతత్వంతో వ్యాపారం నడిచి లబ్దిని అందుకునే కాలము. శుభవార్తలు వింటారు. మీరు స్వేచ్ఛగా ఏవిధమైన జీవన ప్రణాళిక చేసుకుంటారో దానిని చక్కగా అమలు చేసి ఆనందంగా జీవనం సాగిస్తారు. అవసరానికి తగిన ధనం సమయానికి అందడం, అదేరీతిగా ప్రోత్సాహకరమైన వాతావరణం అన్ని అంశాలలో ఉండడం ద్వారా మంచి ఫలితాలు అందుతాయి. సమయాన్ని వృధా చేయకుండా కాలాన్ని సానుకూలం చేసుకొనే ప్రయత్నంలో ముందుకు వెడితే అంతా శుభసూచకమే. మీరు మీవాక్ నియంత్రించుకోవలసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కొన్ని సందర్భాలలో వ్యర్థ సంచారం చేయు పరిస్థితి కూడా నెలకొని ఉంటుంది. అంతా లాభదాయకమే అయినా కొన్ని సందర్భాలలో అసంతృప్తి ఉంటుంది. మిమ్మల్ని విశ్వసించనివారు కూడా ఈ సంవత్సరం మిమ్మల్ని విశ్వసిస్తారు. స్వతంత్రంగా చేయు పనులలో లాభం ఎక్కువ. భోజనం, వస్త్రం అలంకరణ వంటివి పూర్తి స్వేచ్చగా అనుభవించే అవకాశం ఉంటుంది.
🎉 విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు వేగం అయి శుభవార్తలు అందుతాయి. విద్యానిమిత్తంగా వెళ్ళేవారికి కూడా ఎటువంటి యిబ్బందులు లేకుండా పనులు పూర్తయి లాభం అందుకుంటారు. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు అన్ని విధాలుగా సానుకూల వాతావరణమే ఉంటుంది. గత సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగంలో వారికి మంచి ఫలితాలు అందుతాయి. అలాగే శుభకార్య ప్రయత్నాలలో వున్నవారికి అంతా అనుకూల వాతావరణమే.
🎉 మీ యొక్క గ్రహచారం దృష్ట్యా పుణ్యక్షేత్రాలు సందర్శించడం, గురువులను, పూజ్యులను సందర్శించడం వంటి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు గురుబలం బాగుంది. అయితే శ్రమకొద్దీ మంచి పలితాలు అందుతాయి. వీరికి అంతా శుభమే. రైతులు ఈ రాశికి చెందిన వారి విషయంలో అంతా శుభపరిణామములే ఉంటాయి. లబ్ది పొందుతారు. కోర్టు వ్యవహారములలో వున్న వారికి ఈ సంవత్సరం అంతా యిబ్బందికర అంశాలు ఎదురౌతాయి. అవకాశం ఉన్నంతవరకు ప్రతిపనీ స్వయంగా చేసుకోవడం మంచిది. అయితే విజయం వస్తుంది. స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి పనులు సానుకూలం అయి మంచి ప్రాంతమునకు చేరుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి పనులు వేగవంతం అవుతాయి.
🎉 ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో యింకా కార్యసానుకూల అవకాశములు ఉన్నాయి. శుభ పరిణామాలు ఉంటాయి. ప్రమోషన్ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. అధికారులు తోటివారు ఈ విషయంలో సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు బాగా అనుకూలము. ఆశించిన రీతిగా ప్రణాళికలు సాగి సత్ఫలితాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేయువారికి అన్ని సకాలంలో సమకూరి కార్యజయం అందుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా వున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. అంతేకాకుండా బంధువుల నుండి సహకారం, కావలసిన సందర్భంలో అందుతుంది. అలాగే భార్యాభర్తల మధ్యలోను - భార్యాపిల్లలలోను వుండే అవాంతరములు తొలగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులు సమిష్టి నిర్ణయాలతో కొన్ని మంచి కార్యములు చేయు అవకాశం ఉన్నది.
🎉 ఋణవిషయంలో పాత ఋణములు వున్నవారికి ఋణములు ప్రతిబంధకం అవ్వవు. కొత్తవి కావలసి ఉంటే సమయానికి తగిన విధంగా అందుతాయి. ఐశ్వర్యప్రదమైన జీవనం సాగిస్తారు అని చెప్పవచ్చును. ఆరోగ్య విషయంలో అంతా అనుకూలమే అయితే కొత్తగా వచ్చే సమస్యలు ఏమీ ఉండవు కానీ హృద్రోగులు చర్మ వ్యాధులు వున్నవారు చిన్నచిన్న చికాకులు పొందే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. అవివాహితులకు గురువు కుంభంలో వుండగా సంబంధాలు నిశ్చయం అయ్యే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి అయి సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో తెలియక కొన్ని పొరపాట్లు చేసి వాటిని సరిచేసుకునే ప్రయత్నంలో చికాకు పడతారు.
🎉 స్త్రీలకు ఈ సంవత్సరం గత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగం చేయువారికి అధికారుల ప్రోత్సాహం, వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరం అవుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేయు విషయంగా ఎక్కువ కాలక్షేపం అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. గర్భిణీ స్త్రీలు చాలా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. సుఖప్రసవ అవకాశం ఉంటుంది.
🎉 అశ్వినీ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా ప్రతికోణంలోను లాభదాయకమైన ఫలితాలు అందుతాయి కానీ అసంతృప్తి ఉంటుంది. కుటుంబ విషయాలలో బంధువులతో కలహాలు తప్పవు. ప్రత్యేకంగా గృహములు కొనుగోలు వాహన కొనుగోలు విషయాలలో సక్సెస్ అవుతారు.
🎉 భరణీ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా అంతా శుభ పరిణామములే. వివాహాది శుభకార్యముల యందు తరచుగా పాల్గొంటారు. అధికమైన ధనవ్యయం ఉంటుంది. అదేరీతిగా ఆదాయం అధిక స్థాయిలోనే ఉంటుంది. భార్య తరఫు బంధువుల ద్వారా కలహప్రాప్తి.
🎉 కృత్తికా నక్షత్రం వారికి విశేషములు ఏమనగా మిత్రుల వలన యిబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అనవసర విషయాలలో కలుగచేసుకొని యిబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఉద్యోగం వ్యాపారం అద్భుతంగా సాగుతాయి. కొన్ని విశేష ఫలితాలు కూడా అందుకుంటారు.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
🎉 “ఓం నమో భగవతేతుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే” ఈ శ్లోక పారాయణ అధికంగా చేయుట ద్వారా గత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నము సానుకూల స్థితి అందుకుంటారు.
శాంతి :
🎉 దోషము చేయు గ్రహములు తక్కువ అయినా వృద్ధి నిమిత్తంగా ఏప్రిల్, మే మాసములలో నవగ్రహ హోమశాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. పంచముఖి రుద్రాక్షధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. రోజూ “గజేంద్రమోక్షం” ఘట్టం "శ్రీమద్ భాగవతం”లోనిది రోజూపారాయణ చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి.
ఏప్రిల్ :
🎉 ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం శ్రేయస్కరం. మితభాషణ చేయడం ఈ నెల మీకు శ్రీరామరక్ష. శుభ సంబంధమైన వ్యవహారాలలో ఈ నెల మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ విషయంగా అన్ని కోణాలలోనూ మంచి ఫలితాలు అందుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ప్రతి విషయంలోనూ చేకూరి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా పుణ్యక్షేత్ర సందర్శన జరుగుతుంది.
మే :
🎉 అలంకరణ వస్తురూపంగా కొనుగోలు ధనవ్యయం అవుతుంది. ఖర్చులు నియంత్రణ చేయలేరు. శుభకార్యములలో పాల్గొంటారు. ఖర్చులు శారీరక శ్రమ ఎక్కువ అవుతాయి. తరచుగా ప్రయాణాలు చేయవలసి వచ్చి కొంత శారీరక శ్రమ ఉష్ణప్రకోపం ఎక్కువ అవుతాయి. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా కూడా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు బాగా ఒత్తిడి ఎక్కువ. ఆర్థిక లావాదేవీలు అన్నీ స్వయంగా చూసుకోవడం వలన చాలావరకు సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది.
జూన్ :
🎉 మొండిధైర్యంతో పనులు చేసి విజయం సాధిస్తారు. అయితే ఈ నెల యిబ్బందికర ఘటనలు చాలా తక్కువ అనే చెప్పాలి. తొందరపాటుగా ఎవరికీ ఎటువంటి హామీలు ఇవ్వవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాము. మీరు అన్ని విషయాలలోనూ తగు జాగ్రత్తతోనూ, మంచితనంతోనూ ప్రవర్తిస్తున్నప్పటికీ తగిన గుర్తింపు రాకపోవడం మీకు విచారాన్ని కలిగిస్తుంది. మీ యొక్క వర్కర్స్ వలన కుటుంబంలోనూ, వృత్తిలోనూ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి.
జూలై:
🎉 స్వేచ్ఛా ప్రవర్తనకు అవకాశం ఉన్నది. సజ్జనగోష్ఠి వాహన లాభం విద్యావ్యాసంగం బాగుంటాయి. శుభకార్యములలో పాల్గొంటారు. ఏపనైనా సమయపాలనతో కూడుకొని చేయుట కష్టతరమవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలలో అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ తెలివిగా సరిచేసుకుంటూ నష్టం లేకుండా కాలక్షేపం చేస్తారు. బంధువుల రాకపోకలు తద్వారా ఖర్చులు పెరుగుతాయి. మితభాషణ, ఓర్పు ఎక్కువగా ప్రదర్శించ వలసిన కాలం.
ఆగష్టు:
🎉 చిన్న చిన్న ఆటంకాలు మినహా మొత్తం మీద నెల అంతా బాగానే ఉంటుంది. స్నేహితులతో బహుజాగ్రత్త వహింపవలసిన అవసరం ఉంటుంది. అలాగే బంధువులతో కూడా కలసి వ్యాపారం, వ్యవహారములు చేయు సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పార్టనర్ షిప్ బిజినెస్ లో ఉన్నవారు ఈ నెల మానసిక వ్యత్యాసములు రాకుండా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. వస్తువుల కొనుగోలు విషయంలో ధనవ్యయం బాగా జరుగుతుంది. సహకరించే వ్యక్తులు తక్కువ అవుతారు.
సెప్టెంబర్ :
🎉 ధైర్యయుక్తమైన బుద్ధి ప్రదర్శిస్తారు. కుటుంబ విషయంగా చికాకులు వస్తాయి. వినోద కార్యములలో ఎక్కువగా పాల్గొంటారు. శుభకార్య నిమిత్తంగా ప్రయాణం చేయటం, తద్వారా శారీరకంగానూ, ఆరోగ్య విషయంగానూ కొన్ని చికాకులు ఉండడం జరుగుతుంది. ఈ నెలలో తరచుగా శుభవార్తలు వింటారు. అలాగే నిరుద్యోగులు వారి ప్రయత్నాలలో పురోభివృద్ధిని తెలుసుకుంటారు. అన్ని రకాల వ్యవహారములలోనూ ధనవ్యయం జరిగి పనులు పూర్తి అవుతాయి.
అక్టోబర్ :
🎉 అన్ని అంశాలు కలహప్రదముగా ఉంటాయి. రోజూ ధనవ్యయం మీ పరిధిని దాటి ఉంటుంది. భార్యాపుత్ర కలహం రాకుండా చూసుకోండి. రావలసిన ఆదాయం సకాలంలో అందకపోవడం వలన బాగా మానసిక ఆందోళనకు గురి అవుతారు. ప్రతి విషయంలోనూ తొందరపాటు ధోరణి ప్రదర్శించి సమస్యకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలలో మీ యొక్క నడవడి ఇతరులకు ఇబ్బంది కలిగి తద్వారా కలహములు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
నవంబర్ :
🎉 ప్రతి పనిలోనూ అవాంతరములు ఉంటాయి. ఆరోగ్య విషయములు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. శుభవార్తలు వింటారు. మితభాషణ చేయాలి. పూజ్యులను, గురువులను తరచుగా కలుసుకుంటారు. మీ కుటుంబ సంబంధమైనటువంటి ఆచార వ్యవహారములను పాటిస్తూ ఆనందంగా గడుపుతారు. మీ కిష్టమైన పనులు తరచుగా చేసుకోవడంలో దృష్టిని కేంద్రీకరిస్తారు. ఈ నిమిత్తంగా ప్రాకృత ధర్మంగా చేయవలసిన ఉద్యోగ, వ్యాపార, విధి నిర్వహణ కొంచెం ఇబ్బందికరం అవుతుంది.
డిసెంబర్ :
🎉 దైనందిన కార్యక్రమములు చక్కగా నడుచును. మితభాషణ, ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టితో సుఖజీవనం చేస్తారు. కాలం అద్భుతంగా సహకరిస్తుంది. కుటుంబసభ్యులందరూ అన్ని విధాల ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం మీకు సహకరించడం తద్వారా మీరు నూతనోత్సాహంతో అన్ని వ్యవహారాలను సానుకూలం చేసుకోవడం జరుగుతుంది. ఇబ్బంది లేనటువంటి కాలక్షేపం ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఉంటుంది.
జనవరి :
🎉 చక్కని శుభకాలం నడుచుచున్నది. అన్ని అంశాలలోను పెద్దల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాదులలో అధికారుల సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలలో ఆదాయం, ఖర్చు రెండూ కూడా మీ పరిథిలోనే ఉంటుంది. మీ యొక్క సలహాలు, సూచనలు పాటించి మీ తోటివారు సక్సెస్ అవ్వడం చూసి ఆనందిస్తారు. ప్రతి ప్రయత్నంలోనూ మీకు అన్నివిధాల అనుకున్న సమయం కంటే ముందుగానే పనులు పూర్తి అవుతూ ఉంటాయి.
ఫిబ్రవరి :
🎉 కుటుంబ అంశాలు సానుకూలంగా ఉండడం వలన ఈ నెల ప్రతిరోజు మంచి ఫలతాలతో కాలక్షేపం అవుతుంది. అందరూ బాగా గౌరవిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మీ క్రింద పనిచేసేటటువంటి వ్యక్తులు మీకు బాగా సహకారం చేస్తారు. సమస్యాత్మకమైనటువంటి ప్రతి పనిలోనూ మీకు ఇతరుల సహకారం బాగా లభిస్తుంది. అన్నిరకాలైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులను తేలికపాటి ప్రయత్నాలతోనే సాధిస్తారు. ప్రధానంగా అందరికీ ఆరోగ్యం బాగుండడం మీకు ఆనందంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు, బంధువులు తరచుగా కలవడం వలన మంచి కాలక్షేపం జరుగుతుంది.
మార్చి :
🎉 మంచి జీవనం సాగుతుంది. ప్రతి విషయాలలోను ధైర్యంగా ముందుకు వెడతారు. అందరి ప్రోత్సాహం అన్ని అంశాలలోను లభిస్తోంది. వృత్తి సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విధి నిర్వహణలో ప్రోత్సాహకరమైనటువంటి అంశాలను మీరు సద్వినియోగం చేసుకొని, లాభదాయకమైన ఫలితాలను అందుకుంటూ ముందుకు వెళతారు. ఆర్థిక లావాదేవీలు శుభకార్య ప్రయత్నాలు బాగుంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన తరచుగా జరుగుతూ ఉంటుంది.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371














No comments:

Post a Comment