Wednesday 28 April 2021

కరోనా వైరస్ కి బ్రహ్మ గారు చెప్పిన మంత్రం

 



కరోనా వైరస్ కి బ్రహ్మ గారు చెప్పిన మంత్రం
యోగ వాసిష్ఠం లో ఉంది
కర్కటి అని ఓ మహారాక్షసి . దానిది అంతులేని ఆకలి. ఎన్ని వందల, వేల మంది మనుషుల్ని అప్పడాల్లా నమిలేసినా దానికి ఆకలి తీరేది కాదు. ఇలా కాదు; భూలోకంలోని సమస్త ప్రాణులనూ ఒకే సారి మింగ గలిగితే ఎంత బాగుండు ! అప్పుడు కానీ నాకు కడుపు నిండదు - అని ఆ రాక్షసికి ఓ చిన్న కోరిక పుట్టింది. ఎడతెగని ఆకలి బాధ తీరటానికి అదొక్కటే దారి అని దానికి తోచింది. ఎలాగైనా దాన్ని సాధించి తీరాలని ఒంటికాలి మీద నిలబడి తీవ్రమైన తపస్సు చేసింది. హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ళ పాటు సాగిన రాక్షసి భీకర తపస్సు ధాటికి లోకాలు అల్లాడాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి వరం కోరుకోమన్నాడు.
" ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయం లోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపారా భోం చేయాలి. ఆ ఒక్క వరమివ్వు చాలు "అన్నది కర్కటి. బ్రహ్మగారు సరే అన్నాడు. నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో 'విషూచిక' అనే పేరుగల వాత రోగానివి అవుతావు. ప్రజల ప్రాణవాయువుద్వారా ముక్కులోంచి ప్రవేశించి మనుషుల హృదయప్రదేశాన్ని ఆక్రమిస్తావు. గుండె, కాలేయం ,ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు ' అని వరమిచ్చాడు. అయితే దానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నాడు.
అవేమిటంటే :
1. 1. తినకూడని వాటిని తినేవారిని, చెయ్యకూడని పనులు చేసేవారిని , చెడు ప్రదేశాల్లో ఉండేవారిని , శాస్త్రవ్యతిరేకంగా నడిచేవారిని, దుర్మార్గులను సుబ్బరంగా హింసించి ఆరగించవచ్చు.
2.మాయరోగం అన్నది వ్యాపించాక , చెడ్డవాళ్ళతో పాటు మంచి వాళ్ళూ దాని బారిన పడతారు. అయితే దానినుంచి బయటపడటానికి బ్రహ్మగారు మంత్రరూపంలో ఓ ఎస్కేప్ రూట్ ఇచ్చాడు. ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే చాలు గుణవంతులు విషూచికావ్యాధి కోరలనుంచి తప్పించుకోగలరట!
వేల సంవత్సరాల కిందటి యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకరణం లో ఈ కథవింటే దానికీ మనలను ఇప్పుడు వొణికిస్తున్న కరోనా వైరస్ కూ చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ వైరస్ కూడా ముక్కుద్వారానో , మూతిద్వారానో , చేతుల ద్వారానో ప్రాణవాయువుతోబాటు లోపలికి పోయి గుండెలోనో, దానిదగ్గరి ఊపిరి తిత్తులలోనో, పక్క వాటాలోనో కాపురంపెట్టి నానా బీభత్సం చేస్తుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. కప్పలు, పాములు తినే చైనా వాళ్ళూ , ఎద్దు మాంసం లేనిదే ముద్దదిగని తూర్పు, పడమర దేశాల వాళ్ళూ , మతం పేర రక్తపుటేర్లు పారించిన వాళ్ళూ కరోనా కోరల్లో నజ్జు అవుతున్నారు. వాటికన్ , మక్కా లాంటి క్షేత్రాలే మనిషి జాడలేకుండా మూతపడి , ఇటలీలాంటి దేశాలు మొత్తానికి మొత్తం దిగ్బంధమై , చైనావాళ్ళు పైకి చెప్పుకోలేని ఘోరకలితో గొల్లుమంటూ ప్రపంచమంతటా హాహాకారాలు దద్దరిల్లుతున్నా , ముంచుకొచ్చిన పీడకు మందు ఏమిటో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం చేతులెత్తేసిన స్థితిలో పాత పురాణం లో బ్రహ్మ చెప్పిన ఈ విషూచికా మంత్రమే రేపు బాధిత జనాలకు తారకమంత్రం అవుతుందేమో?! ఎవరు చెప్పగలరు ?
( ఈ మంత్రాన్ని ప్రతీ రోజు ఉభయ సంధ్యలలోను 11 పర్యాయాలు తక్కువ కాకుండా మీరు చేయగలిగినన్ని సార్లు పఠిస్తే తప్పక విషూచిక నుంచి బయటపడుతారు అని యోగావాసిష్టంలో ఉంది.)
ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణు శక్తయే నమః
ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం
ఓం హరహర నయనయ పచపచ మథమథ
ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్ఛ జీవ
సః సః సః చంద్రమండల గతోసి స్వాహా!


ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి

సర్వే జనాః సుఖినో భవంతు, శుభమస్తు. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. follow us : plz like , share , follow and subscribe facebook page https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888 Whats app group https://chat.whatsapp.com/Br5vhG7L4L8HhQ1uUWldui Telegram link https:/https://t.me/joinchat/B2gE2ZlZuac1MDhl Signal link https://signal.group/#CjQKIL_2Z4ElJmED1q-b2WYKhULMt23wwje-H5NNDf5ph7K9EhBAvxGFTFNRTxpnP-6Nki-C YouTube https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw Printerest https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/ Twitter https://twitter.com/VidhathaAstrolo Instagram https://www.instagram.com/sreevidhathapeetam/ Blog https://vidhaathaastronumerology.blogspot.com/ జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (AKAANKKSHA YEDUR) (MCA, GNIIT, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371
















No comments:

Post a Comment