Monday, 12 April 2021

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కర్కాటక రాశి ఫలాలు

 




కర్కాటక రాశి ఫలితములు
పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)
ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)

ఆదాయం -14 వ్యయం-2 రాజయోగం-6 అవమానం-6

🎉ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబరు 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (అష్టమం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకరరాశి (సప్తమం)లో సంచరించును. శని సంవత్సరం అంతయూ మకరంలో (సప్తమం) సంచరించును. రాహువు వృషభంలో (లాభం) కేతువు వృశ్చికంలో (పంచమం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధిక కాలము రాహువు కేతువు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. ఇక్కడ నుండి యింకా నాలుగు సంవత్సరాలు శని సంచారం బాగుండలేదు. శని సంచారం బాగుండినప్పుడు సహజంగా మీ కోరికలకు తగినరీతిగా మీ వ్యవస్థ ఉండదు.
🎉అయితే యిక్కడ ఈ రాశివారి అదృష్టం ఏమిటి అంటే కొన్నాళ్ళు గురువు కొన్నాళ్ళు రాహువు యితర గ్రహాలు అలాగే యోగిస్తున్న కారణంగా సమస్యలు దాటవేయు అవకాశములు పొందుతారు. అద్భుతమైన గ్రహముల కలయిక వలన కాలం గడుచును. కంగారు పడవద్దు. సహజంగా ఉద్యోగ విషయాలు శోధిస్తే మీకు యితరుల సహకారం బాగుంటుంది. తద్వారా అభివృద్ధి లేకపోయిననూ నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఈ సంవత్సరం లాభంలో రాహువు తెలివిగా స్నేహంగా సంచరిస్తూ అన్ని సమస్యలను దాటవేయ మనఃప్రవృత్తి యిస్తారు. యిక్కడ వ్యాపారులు కూడా ఆశించిన రీతిగా వ్యాపారం చేయలేరు తగిన లాభాలు అందుకోలేరు. అయితే వీరియొక్క స్థితి నష్టాలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. తరచుగా మీపై అధికారులను కలిసే అవకాశం వస్తుంది. కేవలం వృత్తి విషయాలే కాదు. సామాజిక కార్యక్రమముల విషయంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాలలో ప్రయత్నాలు వైఫల్యం యిస్తాయి. వాటిని కూడా ప్రశాంతంగా ఆహ్వానిస్తారు.
🎉సంవత్సరాంతంలోను ఏప్రిల్ మాసత్రయంలోను మీరు తొందరపాటుగా మాట్లాడడం వంటివి చేసి కొన్ని చికాకులు తెచ్చుకుంటారు. ఆదాయం సాధారణ స్థాయిగా అందుతుంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. ఏదైనా ప్రతి అంశంలోను మీ కంటే తక్కువస్థాయి వారి వలన చికాకులు ఉంటూ ఉంటాయి. చతుష్పాద జంతువుల విషయంగా మనశ్శాంతి అన్నవస్త్ర విషయంగా అలంకరణ వస్తు విషయంగా లాభదాయకమైన ఫలితాలు అందుతాయి. ఏదైనా మంచి కాలముగా మీరు మార్చుకోగలరు. తరచుగా దేశాంతరవాసం చేయాలి అనే కోరిక - ప్రశాంతంగా స్వేచ్చగా జీవనం చేయాలి అనే కోరిక గలవారము అని పనులు వదిలివేసి మీకు తోచిన విధంగా ఆనందం పొందుతూ సుఖపడతారు.
🎉విద్యా విషయంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు అయినా పనులు పూర్తి అవుతాయి కానీ ధనవ్యయం కాల విలంబం ఎక్కువ అవుతుంది. కన్స్ట్రక్షన్ రంగంలోను, రియల్ ఎస్టేట్ రంగంలో వున్నవారు శ్రమ ఎక్కువ చేసి సత్ఫలితాలు అందుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారులు ధైర్యంగా వ్యాపారం చేసి వ్యవహారములు సానుకూలం చేసి కొన్ని సత్ఫలితాలు అందుకుంటారు. షేర్ వ్యాపారులు సరుకు నిల్వచేసి వ్యాపారం చేయువారి విషయంలో వ్యాపారం అంచనాల యొక్క అమలు ఆలస్యం అవుతుంది. కానీ లాభదాయకంగానే కార్యక్రమాలు ఉంటాయి. నష్టం ఉండదు. పుణ్యకార్యాసక్తత, పుణ్యక్షేత్రాసక్తత ఉన్నవారు ధన విషయంగా చికాకులు పడతారు.
🎉శుభకార్య ప్రయత్నాలలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. మీరు మొండిధైర్యం ప్రదర్శించి, ధనవ్యయం అధికంగా చేసి పనులు పూర్తి చేసుకోవాలి అని ప్రయత్నిస్తారు. కొంత శ్రమ వృథా అవుతుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి తగ్గుతుంది. శ్రమ చేసినదానికి తగిన ఫలితాలు అందవు. అయితే రైతుల విషయంలో కూడా శ్రమకు తగిన ఫలితాలు అందని రీతి గోచరిస్తోంది.
🎉కోర్టు వ్యవహారములలో వున్న వారికి గురువుబలం లేదు. సలహాలు సరియగు విధంగా అందవు. అయితే మీరు ధైర్యంగా ప్రతిపనీ చేయగలుగుతారు. పనులు ఆలస్యం అవుతాయి. కార్యఫలితం తేలదు. స్థానచలన ప్రయత్నాలలో వున్న వారికి అడ్డంకులు సృష్టించేవారు ఎక్కువ అవుతారు. ప్రయత్నాలు ఆపవద్దు.
🎉స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి పనులు ఆలస్యం అవుతాయి. సరియగు సూచనలు అందవు. మీరు స్వయంగా ప్రయత్నాలు చేసిన ఎడల కార్యసిద్ది చేకూరుతుంది. ధనవ్యయం అధికం అవుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు మీరు చేసిన సానుకూలం కాకపోవచ్చు. అలాగే మీ శ్రమకు గుర్తింపు అందదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. ఫలితాలు సంబంధం లేకుండా ధైర్యంగా ప్రయత్నిస్తారు.
🎉నూతన వ్యాపార ప్రయత్నాలు చాలా చక్కగా నడుచును. అందరూ సహకారం చేస్తారు. ధనవ్యయం ఎక్కువ. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు సంచారం అనుకూలం లేని సందర్భంగా మధ్యమధ్య బంధువుల ద్వారా చికాకులు అధికం అవుతుంటాయి. ప్రశాంతంగా ఏదీ పట్టించుకోకుండా కుటుంబ విషయంగా సంచారం చేయువారికి ఈ సంవత్సరం సుఖం శుభం చేకూరుతుంది.
🎉ఋణ విషయంలో పాత ఋణములు వున్నవారికి ఋణములు తీర్చే ప్రయత్నంలో మంచి ఆలోచనలు మార్గములు గోచరిస్తాయి. కొత్త ఋణములు పొందే ప్రయత్నాలు అవసరానికి అందక యిబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య విషయంలో జీర్ణ సంబంధమైన ఆరోగ్యసమస్యలు వున్నవారు తరచుగా యిబ్బంది పడతారు. అదేరీతిగా చర్మవ్యాధి, హృదయ సంబంధ వ్యాధి వున్నవారికి కూడా ఈ సంవత్సరం యిబ్బందికర ఘటనలు వస్తుంటాయి. యితరత్రా అందరికీ అనుకూలమే. మధ్యమధ్య కుజ సంచారం కూడా పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు పెంచుతాయి. మార్కెటింగ్ఉ ద్యోగులకు ఫలితాలు అనుకూలం తక్కువగా ఉంటాయి. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. కానీ టార్గెట్లు ఆలస్యంగా పూర్తి చేసుకుంటారు. ఈ రాశివారు మెడిటేషన్ తో చాలా లాభాలు అందుకుంటారు.
🎉స్త్రీలకు ఈ సంవత్సరం శారీరక రక్షణ విషయంలో తెలివిగా జాగ్రత్తగా వ్యవహరించి ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉద్యోగ నిర్వహణ, కుటుంబ విషయాలు సమర్థంగా గడుపుతారు. అయితే ఈ రాశికి చెందిన వ్యాపారులైన స్త్రీలు యిబ్బందులకు గురి అవుతారు. మనోనిబ్బరం కోల్పోయే అవకాశం ఉన్నది. గర్భిణీ స్త్రీలు గురువు అష్టమ సంచారం అనుకూలం తక్కువ ఒత్తిడి తట్టుకోవడం కోసం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.
🎉 పునర్వసు నక్షత్రం వారికి విశేషములు ఏమనగా అభివృద్ధికి అడ్డంకులు ఎక్కువ. అందరితో మైత్రిగా వ్యవహరిస్తారు. కార్య విజయమే లక్ష్యంగా ముందుకు వెడతారు. ప్రధానంగా రాజోద్యుగులైన ఈ నక్షత్రం వారి అభివృద్ది చాలా బాగుంటుంది.
🎉 పుష్యమి నక్షత్రం వారికి విశేషములు ఏమనగా అవ్వవేమో అనుకున్న పనులు కూడా సాధించుకుంటారు. చాలా గొప్పగా కృషి చేసి గత సమస్యలకు పరిష్కారం వెదకటంలో సక్సెస్ అవుతారు. ప్రతిపనిలోను విజయం మీ వెనుకనే ఉంటుంది.
🎉 ఆశ్లేష నక్షత్రం వారికి విశేషములు ఏమనగా అడ్డంకులు అధికంగా వస్తుంటాయి. ప్రతి పనిలోను ధనవ్యయం అధికంగా ఉంటుంది. ఎవరిని నమ్మి ఏ పనీ చేయవద్దు. మితభాషణ చాలా అవసరం. స్వబుద్ధితో చేయు కార్యములలో విజయం ఉంటుంది.
🎉నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకోయమః శౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః"
"నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజమ్ - ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ "
పఠించడం ద్వారా కార్యాలస్యం తొలగి ఆరోగ్యం సిద్ధించును.
🎉శాంతి : దోషము చేయు గ్రహములు శని గురు నిమిత్తంగా జూన్/డిశంబరు మాసములలో జపదాన హోమశాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. చతుర్ముఖి రుద్రాక్ష ధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. రోజూ గోపూజ చేయండి. గజేంద్రమోక్షం ఘట్టం పారాయణ చేయండి. ప్రదోషకాలంలో శివుడికి 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయండి.
🎉ఏప్రిల్ : మాసారంభం కంటే 14వ తేదీ నుండి అనుకూలం పెరుగుతుంది. మంచి ఫలితాలు క్రమంగా పెరుగుతాయి. ధన వ్యయంతో చికాకులు ఉంటాయి. ఆరోగ్యం అనుకూలమే. పిల్లల యొక్క అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు తరుచుగా రిపేర్ ను చూపిస్తూ ఉంటాయి. బుద్ధిమాంద్యం ఏర్పడడం, దైనందిన కార్యక్రమాలు ఆలస్యంగా పూర్తి అవడం, భోజనవసతి సరిగా లేకపోవడం వంటి చిన్న చిన్న సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
🎉మే : ధైర్యయుక్తమైన బుద్ధి ప్రదర్శించి లబ్దిపొందుతారు. ప్రధానంగా ఋణ విషయంగా, ఆరోగ్య విషయంగా సమస్యలు తగ్గుతాయి ప్రశాంతం అందుకుంటారు. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవాలి అనే ధోరణిలో శ్రమ చేస్తారు. అందరి దగ్గరి నుండి మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగా నడవడం, అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలలో సానుకూల స్థితి ఉండడం వలన ఈ నెల ప్రశాంత జీవనం గడుపుతారు. అవసరానికి తగిన కొత్త ఋణ సదుపాయాలు చేకూరుతాయి.
🎉జూన్ : ప్రయాణములు చేయునప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో కూడా కలహాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఓర్పు అవసరం. ఎవరితోనూ కలహించకుండా జీవితం సాగించాలి. ఉద్యోగ విషయంలో మీ అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే శుభకార్య ప్రయత్నాలలో మంచి వార్తలు వింటారు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన విజ్ఞాన, వినోద కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తారు. వాహన సౌకర్యం బాగా చికాకులు కలుగజేస్తుంది.
🎉జూలై: ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు పాటించండి. మానసిక శారీరక శ్రమ పెరగగలదు. ఆర్థిక వనరులు యిబ్బందికరము. ప్రతి చిన్న అంశానికి బాగా కోపావేశానికి లోనవుతారు. తద్వారా అవమానకరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు వహించండి. మీ యొక్క ఉద్యోగ, వ్యాపార విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు సమయపాలనతో కూడి లేకపోవడం వలన తరచుగా మానసికంగా ఆందోళనకు గురి అవుతారు. భయాందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది.
🎉ఆగష్టు: అంతా శుభసూచకమే అయితే తొందరపాటుగా కొత్త ప్రణాళికలు చేయవద్దు. వ్యాపారులు బహుజాగ్రత్త వహించాలి. సమయం బాగుందని కొత్త కొత్త వ్యవహారాల జోలికి పోవద్దు. అలాగే ఎవరి మీదా ఆధారపడి ఏ పనీ చేయవద్దు. స్వయంగా స్వ బుద్ధితో ఆలోచించి చేసే ప్రతిపని విజయవంతంగా పూర్తవుతుంది. మీరు ఇతరులకు సలహాలు, సహకారం చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువవుతాయి. అందరితోనూ వాగ్దోరణి నియంత్రించుకొని వ్యవహరించడం మంచిది.
🎉సెప్టెంబర్ : చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. యితరుల వ్యవహారములు అసలు కల్పించుకోకండి. దూరప్రాంత ప్రయాణాలు ఖర్చులు పెంచుతాయి. అంతటా శుభకార్యాలలో వాటికి సంబంధించిన పనులు చేయటంలో కాలక్షేపం చేస్తారు. తరచుగా బంధుమిత్రులతో కలిసి ఆనందంగా అనుకూలమైనటువంటి వాతావరణంలో ప్రశాంత జీవనం గడిపే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార సమస్యల్ని మర్చిపోయి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం కాకుండా ఉండేలాగా ముందుజాగ్రత్త పడతారు.
🎉అక్టోబర్: మీ ప్రయత్నాలు వేగం అవుతాయి. శుభ పరిణామాలు జరిగిన వార్తలు వింటారు. లాభదాయక జీవనం ఉంటుంది. కాలం అనుకూలంగా ఉంది. సమయం వృధా చేయకుండా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కొత్త కొత్త పనులలో వేగవంతమైన ఫలితాలు తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేయండి. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారు అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారు ఈ నెలలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
🎉నవంబర్ : పుణ్యకార్యములు బాగా చేస్తారు. కుటుంబ సౌఖ్యం తక్కువ. వ్యాపారులు యితరులను నమ్మి ఏ పనీ చేయవద్దని సూచన. గురువులను, పూజ్యులను కలుసుకొనే ప్రయత్నంలో దూరప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అదేరీతిగా కుటుంబ అవసరాల నిమిత్తంగా ఖర్చులు పెరగడంతో కోపావేశాలు పెరుగుతూ ఉంటాయి. బంధుమిత్రుల యొక్క రాకపోకలు వారి వలన మీ యొక్క ప్రాకృత ధర్మానికి సంబంధించి సమయపాలన లేకపోవడం ఇబ్బందికరం అవుతూ ఉంటుంది.
🎉డిసెంబర్ : అనవసర విషయాలలో కలహాలు వచ్చే సూచన ఉన్నది. మీ వృత్తి విషయాలలో యిబ్బందికర ఘటనలు రాకుండా జాగ్రత్త పడండి. అధికారులతో సంభాషణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క ప్రతి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచండి. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకోవడం, కొత్త ఋణములు చేయకుండా ఉండడం ఈ నెలలో చాలా అవసరం. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే ప్రయత్నంలో అనుకోని అవరోధాలు ఎక్కువగా ఎదురౌతాయి.
🎉జనవరి : కొన్ని సందర్భాలలో అనుకూలంగా, కొన్ని సందర్భాలలో ప్రతికూలంగా ఉంటాయి. ఎవరితోనూ అతి పరిచయం శ్రేయస్కరం కాదు. ఓర్పు అవసరం. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయాలలో ఇబ్బందికరమైన ఘటనలు ఎదురై ఖర్చులు బాగా పెరగడం, అదేరీతిగా మీ యొక్క వ్యవహారములు సమయానికి పూర్తి కాకపోవడం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. ఆర్థిక కార్యకలాపాలు, ఆరోగ్య విషయాలలో బహు శ్రద్ధ, జాగ్రత్త కనపరచ వలసిన అవసరం కనపడుతుంది.
🎉ఫిబ్రవరి : పనులు ఆలస్యం అవుతాయి. అయితే మీరు ధైర్యంగా వ్యవహరిస్తారు. రోజువారీ కార్యములు కూడా సరిగా సాగవు. ఉద్యోగ భద్రతకు పెద్ద పీట వేయండి. నూతనోత్సాహంతో ప్రతి పనిని పూర్తయ్యేవరకు వెంబడిస్తారు. ఉద్యోగ, వ్యాపార విషయాలు వదలి ఇతర వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరణ చేయవద్దని ప్రత్యేక సూచన. వృత్తి విషయాలలో ప్రతిపనిని స్వయంగా చేసుకుంటూ వెళ్తే చాలా వరకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సంబంధమైన అవసరాలు తీర్చే ప్రయత్నంలో ఆలస్యం చేసి కలహాలకు అవకాశం ఇస్తారు.
🎉మార్చి : మంచి వ్యవహార సానుకూల ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో వ్యతిరేకంగా ఉంటారు. అన్ని కోణాలలోను జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలలో మీ అధికారులు మీకు బాగా తోడ్పాటు చేయటం వలన బాగా ఆనందంగా వృత్తి వ్యవహారాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధన వ్యయం బాగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాలలో జాగ్రత్తలు పాటించండి.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371










No comments:

Post a Comment