మేషం
సింహంలో అంగారకుడు ఆగమనం వల్ల మీ రాశి వారికి అంత ప్రభావవంతంగా ఉండదు. ఈ సమయంలో మీరు కొన్ని ఆందోళనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గౌరవ, మర్యాదలు లోపిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
వృషభం..
రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నవారికి విజయం లభిస్తుంది. తల్లితో సంబంధం మధురంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారాన్ని పెంచడానికి మీరు ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే అందులో విజయం సాధిస్తారు. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ కారణంగా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో మీరు బయటకు వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు. ఇది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
మిథునం..
మిథున రాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు ఉంటుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. పనిప్రదేశంలో అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి.
కర్కాటకం..
అంగారకుడు రవాణా మీ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రతి పనిలోనూ ధైర్యం, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలాగే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే మంచి ఆఫర్లను పొందవచ్చు. వ్యాపార ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాలు స్నేహాపూర్వకంగా ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి ఆప్యాయత లభిస్తుంది. సామాజిక రంగంలో పనిచేసే వారికి గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.
సింహం..
సింహ రాశి ప్రజలకు ఈ సమయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. కెరీర్ కు సంబంధించి ఫలవంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఫలితంగా సంపూర్ణం ఆనందం కలుగుతుంది. అయితే ఈ రోజు మీ ఆరోగ్యం కొద్దిగా ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆహారం, పానీయాల విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి.
కన్య..
సింహంలో అంగారకుడు ఆగమనం వల్ల కన్యా రాశి ప్రజలకు శుభకరమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రోజు మీరు చాలా ప్రదేశాల నుంచి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు.
తుల..
మీ రాశి వారికి అంగారకుడు రవాణా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యాపారంలో సంపాదనకు మంచి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు ఎక్కువగా ప్రయత్నం చేయకుండానే పురోగతికి మంచి అవకాశాలను పొందగలుగుతారు. జీవిత భాగస్వామిని విశ్వసించండి. ప్రతి సమస్య నుంచి మీరు బయట పడటానికి అవకాశముంది. కుటుంబ స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
వృశ్చికం..
సింహంలో అంగారకుడు రాశిపరివర్తనం వల్ల వృశ్చిక రాశి వారికి శుభకరమైన ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో మీ పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. సాయంత్రం సమయంలో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
ధనస్సు..
అంగారకుడి రవాణా ధనస్సు రాశి వారికి శుభకరంగా ఉంటుంది. మీరు మీ కృషి ద్వారా విజయాన్ని సాధిస్తారు. సంపదను కూటబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో పాత అప్పులను తొలగిస్తారు. మీరు కుటుంబం కోసం కొన్ని సౌకర్యవంతమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలకు వెళ్లే అవకాశముంది. మంచి కళాశాలలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు విజయం వరిస్తుంది. అదృష్టం కూడా అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీ కలలను సాకారం చేసుకోగలుగుతారు.
మకరం..
సింహంలో అంగారకుడు ఆగమనం వల్ల మకర రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడి పనిచేసినా లాభం అంతగా ఉండకపోవచ్చు. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా మీ భావాలను వారితో పంచుకుంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
కుంభం..
సింహంలో అంగారకుడు ఆగమనం వల్ల కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం కూడా చాలా బలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికి శుభకరంగా ఉంటుంది. ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. మీరు స్నేహితుడు లేదా పరిచయస్తుల సహాయం తీసుకోవచ్చు. వ్యాపార పర్యటనలు సమీప భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యమైన విషయంలో కుటుంబంతో చర్చలు ఉండవచ్చు.
మీనం..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment