మేషం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.
వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం: స్థిరాస్తుల వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. బంధువుల ద్వారా ధనలాభం. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
సింహం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.
కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. కొత్త పనులు చేపడతారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
తుల: ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం: శుభవార్తలు వింటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
ధనుస్సు: కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మకరం: రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
కుంభం: నూతన ఉద్యోగాలలో పురోగతి. సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు.
మీనం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. పనుల్లో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment