ఆధ్యాత్మిక పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైందిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ మాసంలోనే చతుర్మాస్ ప్రారంభమవుతుంది. ఈ నెలలో దేవశయని ఏకాదశి నుంచి దేవతలు 4 నెలలు నిద్రిస్తారని చెబుతారు. అనంతరం నాలుగు నెలల తర్వాత వచ్చే ఏకాదశి నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయని చెబుతారు. అంతేకాకుండా ఈ మాసంలో కొన్ని ప్రముఖ వ్రతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో రానున్న పూర్తి వ్రతాల జాబితాను ఈ రోజు మీకు తెలియజేయనున్నాం.
యోగిని ఏకాదశి- జులై 5...
జ్యేష్ఠ మాసం కృష్ణపక్ష ఏకాదశిని యోగిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు వ్రతం చేయడం వ్లల భక్తులకు అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా ఈ వ్రతం వల్ల ప్రాపంచీక ఆనందాన్ని, పరలోకంలో విముక్తిని పొందుతారని చెబుతారు. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే 88 వేల మంది బ్రాహ్మాణులకు అన్నదానం చేసిన పుణ్యాన్ని పొందుతారని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఈ ఏడాది ఈ పర్వదిన జులై 5 సోమవారం నాడు రానుంది.
ప్రదోష వ్రతం- జులై 7..
పరమేశ్వరుడిని ఆరాధించే ఈ పండుగ ఈ సారి జులై 7న రానుంది. ఈ వ్రతం ప్రతి నెల త్రయోదశి రోజు వస్తుంది. ఈ రోజు ఉపవాసముండటం వల్ల పిల్లలు ఆనందంగా ఉండటమే కాకుండా కోల్పోయిన డబ్బు తిరిగి పొందుతారు. మరోవైపు పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా దీర్ఘాయువును పొందుతారు. జీవితంలో సుఖ, సంతోషాలను కలిగి ఉంటారు.
మాస శివరాత్రి- జులై 8..
ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ సారి జులై 8న రానుంది. ప్రతి నెల రావడం వల్ల దీన్ని మాస శివరాత్రి అని అంటారు. ఈ రోజు ఉపవాసం చేయడం ద్వారా అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని చెబుతారు. ఈ ఉపవాసం ఆనందం, మోక్షం పొందడానికి దారితీస్తుంది. ఈ నెల ఉపవాసం జులై8న వస్తుంది.
బోనాలు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఉత్సవాలు బోనాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సారి జులై 11న గోల్కొండ, జులై 25న సికింద్రాబాద్, ఆగస్టు 1న లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి. ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ పండుగ మొదటి, చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. అంటే దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాటు పాలు, పెరుగు, బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండల్లో తలపై పెట్టుకొని డప్పు కోలాహాలతో గుడికి వెళ్తారు.
బక్రీద్- జులై 21..
ముస్లీంల ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. ఈద్ జరిగిన రెండు నెలల తర్వాత సరిగ్గా చెప్పాలంటే 70 రోజుల తర్వాత జరుపుకుంటారు. త్యాగాన్ని స్మరించుకొని నమస్కరించే పండుగ. ఇస్లామిక్ క్యాలెండర్లో దీన్ని ఈద్ ఉల్-అజా అని పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ చివరి నెలల్లో జూ-అల్-హిజ్ జరుపుకుంటారు. ఈ సారి జులై 21 బక్రీద్ పండుగను జరుపుకుంటారు. వాస్తవానికి ఈద్ తేదీ చంద్రుడిని చూసిన తర్వాత నిర్ణయించబడుతుంది.
గురు పూర్ణిమ- జులై 24..
ఆషాడ మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు గురు పుజా విదానం ఉంటుంది. ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు మహాభారత రచయిత వేద వ్యాస మహర్షి పుట్టినరోజు. ఆయన గౌరవార్ధం గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ ఏడాది గురు పూర్ణిమ జులై 24న రానుంది.
సంకష్ఠి చతుర్థి..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment