మేషం... పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.
వృషభం.... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం.... వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. ధనవ్యయం. దూరపుబంధువుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కర్కాటకం.... కొన్ని పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఇబ్బందులు.
సింహం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కన్య.... కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఆలయాలు సందర్శిస్తారు. పనులు పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
తుల... కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం.... ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో ఆటంకాలు. పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
ధనుస్సు.... బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.
మకరం.... కుటుంబంలో కొత్త సమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కుంభం.... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment