మేషం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
వృషభం: కొత్తగా అప్పులు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పదు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవచింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.
మిథునం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అరుదైన పురస్కారాలు.
కర్కాటకం: శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి. గౌరవమర్యాదలకు లోటు ఉండదు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.
సింహం: రాబడి కన్నా ఖర్చులు అధికం. పనులలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.
కన్య: కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనులలో అవాంతరాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో మార్పులు.
తుల: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
వృశ్చికం: ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. దేవాలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
ధనుస్సు: ధనవ్యయం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో చిక్కులు.
మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం: ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. దైవదర్శనాలు. ఆస్తిలాభ సూచనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.
మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment