జై హనుమాన్ జీ !!!
దీపావళికి ఒక రోజు ముందు ఛోటీ దీపావళి జరుపుకుంటారు.ఛోటీ దీపావళిని నరక చతుర్దశి అని కూడా అంటారు.కార్తీక కృష్ణ పక్ష చతుర్దశి తేదీని నరక చతుర్దశిగా జరుపుకుంటారు.నరక చతుర్దశి రోజున హనుమంతుడిని, యమరాజును, లక్ష్మీదేవిని పూజించాలని నియమం ఉంది.
ఈరోజు దీపావళి హనుమాన్ పూజ. శ్రీరాముడు రావణాసురుడి తో యుద్దం ముగించుకొని సీతా దేవితో దీపావళి రోజున అయోధ్యా నగర ప్రవేశం చేశాడు. హనుమంతుని భక్తి శ్రద్దలకి మెచ్చి, తనని పూజించడానికి ముందే భక్తులు హనుమంతున్ని పూజించే వరం ప్రసాదించాడుట. అందుకని భక్తులు దీపావళి ముందు రోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారు. ఈరోజు ఆంజనేయ స్వామి పూజ చేయడం వలన తమ శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి అని,దుష్ట శక్తుల ప్రభావం తమపై ఉండదు అని భక్తుల నమ్మకం. అయోధ్యలోని హనుమాన్ దేవాలయం లో ఈరోజు హనుమాన్ జయంతి గా వేడుకలు జరుపుతారు. హనుమాన్ పూజ చేయడానికి అనుకూల సమయం ఈరోజు రాత్రి 11.35 నుండి రాత్రి 12.26 వరకూ ఉంటుంది.

No comments:
Post a Comment