దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది.
అంతే కాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి.
ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు.
శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం. అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..‘ధన త్రయోదశి’ అన్నారు.
ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి.ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’.
అందుకే., ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు.
సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఉంటుంది.
కనుక ఈ సమయంలో శ్రీమహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు.
🙏లక్ష్మీ కుబేర వ్రతం🙏
ధన త్రయోదశి సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు , వ్యాపార అభివృద్ధి అదే విధంగా నూతన వ్యాపారం ప్రారంభించబోయే వారు , ఉద్యోగ అభివృద్ధి కోరుకుంటున్నారు మరియు అప్పుల బాధలు ఉన్నవారు తప్పకుండా చేయవలసిన లక్ష్మీ కుబేర వ్రత విధానం.ఈ వ్రతమును అక్షయ తృతీయ రోజు , ధన త్రయోదశి రోజు , కార్తీక శుక్ల పంచమి రోజు లేదా తొమ్మిది గురువారాలు లేక శుక్రవారాలు చేసుకోవచ్చు.

No comments:
Post a Comment