అష్టాదశ శక్తి పీఠం శృంఖలాదేవి. - 3వ శక్తి పీఠం - ప్రద్యుమ్నం - పశ్చిమబెంగాల్
“ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖలానామ భూషితే!శ్రీవిశ్వమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ!!
👉ఈ చరాచర ప్రపంచానికంతటకు తల్లి అయిన ఆ జగన్మాత నిత్యం బాలింతరాలుగా నడికట్టుతో కొలువుదీరి, తన బిడ్డలను రక్షించే తల్లిగా పేరుపొందిన దేవి. ‘శృంఖలా దేవి ‘కొలువు దీరిన దివ్యక్షేత్రం – ప్రద్యుమ్నం. ప్రద్యుమ్నం అష్టాదశ శక్తిపీఠములలో మూడవది అయిన శృంఖలాదేవి శక్తిపీఠము.
నేటి బెంగాల్ బంగ్లా దేశముగా, వంగ దేశముగా విడిపోయి ఉన్నది. హుగ్లీ జిల్లాలోని పాండుపా గ్రామంలోని దేవినే “శృంఖలాదేవి” అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లొని హుగ్లీ జిల్లాలోగల కలకత్తా (కోల్‌కతా) పట్టణానికి సుమారు 80 కి.మీ. దూరంలో పాండవ ప్రాంతమయిన “ప్రద్యుమ్న” అనే ప్రదేశంలో ఈ శృంఖలాదేవి క్షేత్రం ఉండేదని ఆర్యుల ప్రామాణికం. దాన్ని అనుసరిస్తే కలకత్తాకు 135 కి.మీ. దూరంలో గల గంగా సాగర్ క్షేత్రం శక్తి పీఠముగా పిలువబడుతోంది. ఈ క్షేత్రంలో సతీదేవి కన్ను పడిందని కొందరూ, స్థనము పడిందని మరికొందరి వాదన.
త్రేతాయుగంలో ‘ఋష్యశృంగ మహర్షి ‘ శృంఖలా దేవిని ప్రతిష్టించినట్లు తెలుస్తుంది. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ.
ఈ క్షేత్రంలో వెలిసిన దేవీ విగ్రహంలో కనిపించే మాతృప్రేమను అర్ధం చేసుకోలేని సాధకులకు ఇది శృంగార క్షేత్రంగా కనిపించేది. కనుక పూర్వంకాలం నాటి గురువులు తమ శిష్యులలో నిర్వికారులైన ఉత్తమమైన వారిని మాత్రమే ఈ క్షేత్రదర్శనానికి అనుమతించేవారు. దీనికి పురాణకాలం నాటి కథ ఒకటి ఆలంబనగా ఉంది.
స్థలపురాణం:
త్రేతాయుగంలో దశరథుని పుత్రిక ఐన శాంతను వివాహం చేసుకున్న రుష్యశృంగ మహర్షి సతీసమేతుడై దేవిని చాలాకాలం ఉపాసించాడు. ఆయనకు దేవి యొక్క విచిత్రమైన ఆజ్ఞ మనస్సులో వినిపించసాగింది. అపుడు రుష్యశృంగ మహర్షి అక్కడనుండి దక్షిణ పశ్చిమ దిశగా వచ్చాడు. శృంఖలాదేవి యొక్క దివ్వశక్తి రుష్యశృంగ మహర్షిలో ఉంది. అలా వచ్చిన మహర్షి శృంగగిరి శిఖరపై తపస్సు చేసి ఆత్మానందం పొందుతాడు. తరువాత ఆ శృంగగిరి ప్రాంతంలో కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరచి వాటిలో శృంఖలాదేవి శక్తిని భాగాలుగా స్థాపించుతాడు. శృంగ మహర్షి స్థాపించిన దేవతలు కనుక సాధకులు ఆ దేవతలను శృంఖలా దేవతలుగా పిలిచారు.
శ్రుంఖలము అనగా బందనం అని అర్థము. బాలింత కట్టుకొనే నడి కట్టుని కూడా శ్రుంఖళ అనవొచ్చు. అమ్మవారు జగన్మాత కాబట్టి ఇక్కడ ఒక బాలింత రూపము లో నడి కట్టు తో ఉంటారు. అందువలనే శృంఖలా దేవి అని పేరు వచ్చింది అని అంటారు.
మరికొందరు ఈ దేవి ని విశృంఖల అని కొలుచుకుంటారు. విశృంఖల అంటే ఎటువంటి బంధనాలు లేని తల్లి అని అర్థము.
సమస్త జగత్తను కన్న తల్లి గా, బాలింత నడి కట్టు తో అలరారే ఈ తల్లి నీ శాంతా సమేతముగా రుష్య శ్రుంగ మహర్షుల వారు పూజించారు అని, అమ్మ వారి పూజకు మెచ్చి అనుగ్రహించింది అని అంటారు. ఆ ఋషి పేరు మీదగా శృంఖల అని అమ్మ పేరు అని కొందరు అంటారు.
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా (శృంగళా)దేవిగా భావిస్తారు.
కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది.
పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.
ఇంకొక కధనం ప్రకారం జమ్మూకి దగ్గరలోని జింద్రాహ ప్రాంతంలోని నాభాదేవి ఆలయం అమ్మవారి నాభి పడిన ప్రాంతంగా చెబుతారు.
కలియుగంలో ఆదిశంకరాచార్యులు శారదాదేవి విగ్రహాన్ని మహిష్మతీ నగరం నుంచి తీసుకొని వస్తూ శృంగగిరి ప్రాంతానికి వస్తాడు. ఇక్కడ అమ్మ శక్తితరంగాలకు లోనవుతాడు. తరువాత ఈ ప్రాంతంలోనే శారదా మాతను ప్రతిష్టిస్తాడు.
శృంఖలాదేవి భక్తుల సమస్యల సంకెళ్ళు తొలగించే తల్లిగా పేరుపొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు. దీనికి బాలింత నడికట్టు అని పేరు. దీనికే శృంఖల అనే పేరు వుండడం వల్ల క్రొత్తగా ప్రసవించిన బాలింత చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుందని భక్తుల నమ్మకం.
No comments:
Post a Comment