Thursday, 2 November 2023

#కర్మలు_మూడు_రకాలు

 


1.ఆగామి కర్మలు

2. సంచిత కర్మలు

3.ప్రారబ్ద కర్మలు

1. ఆగామి కర్మలు అనగా మనము చేసే పనుల వల్ల ప్రాప్తిమచే కర్మలు, కొన్ని వెంటనే ఫలితాలను ఇస్తాయి.

2. సంచిత కర్మలు అనగా పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు. ఉ: తండ్రి చేసిన అప్పు కొడుకు తీర్చవలసిందే.

3. ప్రారబ్ద కర్మలు అనగా పూర్వ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల కలిగే కర్మలు..

1. పూజలు, యజ్ఞ యాగాదులు, దైవ దర్శనం, మహాత్ముల సందర్శనం ఇత్యాదులతో ఆగామి కర్మల నుండి విమోచనం పొందవచ్చు. పుష్కర స్నానాలు కూడా అందుకే. మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. వెళ్ళే దారిలో చీమలు వంటి సూక్ష్మ జీవులను చంపడం లాంటివి. ఇలా తెలియకుండా చేసిన పాపాల నుండి విమోచన కోసమే, ఈ పూజలు, వ్రతాలు, పుష్కర స్నానాలు వగైరా...

2.పితృదేవతలకు తర్పణం ఆరాదన, యజ్ఞము, హోమము వాటితో కొంతవరకు సంచిత కర్మల నుండి విమోచనం పొందవచ్చు ..

3. ప్రారబ్ద కర్మల ను మాత్రం అనుభవించాల్సిందకే. కర్మ వారనుభవింపక ఎవరికైనను ఎవరు చేసిన తప్పదన్నా.. ఏనాడు ఏ తీరో ఎవరు చెప్పాగలరు. అనుభవించుట తథ్యమన్నా! అలనాటి పాండవులు ఆకులు అలములుమేసి అడవి పాలైపోయరన్నా! రాముడంతటి వాడు రమణి సీతనుబాసి పావురునివలె ఏడ్చెనన్నా! ఏనాడు ఏ తీరో ఎవరు చెప్పాగలరు అనుభవించుట తథ్యమన్నా!" అంటూ ఇటీవలికాలం దాకా ఊళ్లల్లో సాధువులు తంబుర చేతబట్టి తత్వాలు పాడుతుండేవారు. మానవుని సుఖ దుఃఖములకు తన మనోవాక్కాయ కర్మలే కారణం. ఎవరు చేసిన కర్మ తాలూకూ ఫలాన్ని వారు అనుభవించే తీరాలి. సృష్టి క్రమంలో భగవంతుడు సంకల్పించిన, మన వేద విజ్ఞానం ప్రవచించిన, అందరికీ వర్తించే, ఎవరూ తప్పించుకోజాలని ఇనుప గొలుసులతో మానవాళిని బంధించిన భగవంతుని కఠినమైన చట్టం కర్మఫలం. ఎట్టి విత్తనమో అట్టి మొక్క, ఎట్టి తిండో అట్టి తేనుపు. అయితే కర్మ ఫలాలను అనుభవించటానికి పట్టే సమయంలో, కాలంలో తేడాలుండవచ్చు. కానీ ఎప్పటికైనా అనుభవించక తప్పదు. చేసిన తక్షణమే ఫలితమందించే కర్మలు కొన్ని. నెలలు, సంవత్సరాల తర్వాత ఫలితమందించేవి మరికొన్ని వందల, వేల సంవత్సరాల తర్వాత ఫలితాలనందించే కర్మలు కూడా ఉంటాయి. మనం నడుస్తుంటే కాలు జారి కింద పడతాం. తక్షణమే ఎముక విరుగుతుంది. భుజించిన ఆహారం జీర్ణమై శక్తినందించటానికి కొన్ని గంటలు పట్టవచ్చును. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తటానికి కొన్ని రోజులు, వృక్షమై ఫలాలను అందించడానికి సంవత్సరాలు పడుతుంది. కర్మఫలం కూడా అంతే. ఈ సత్యాన్ని గుర్తించనివారు.. 'ఫలానా వాళ్లు ఎన్నో దుర్మార్గాలు చేసి సొమ్ము కూడబెట్టుకుంటునన్నారు. ఆస్తులు సంపాదిస్తున్నారు. వారి అక్రమాలకు బలై ఎందరో ఆక్రోశిస్తున్నారు. మరి ఆ బాధ పెట్టేవారు సుఖంగా, ఆనందంగా ఉన్నారు గదా! అనుకుంటారు. కానీ, దైవచట్టం వారు వీరు అనే తేడా లేకుండా అందరికీ అనుభవంలోకి వస్తుంది. అయితే ఎంతకాలంలోపు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేం. ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్న వారికి కష్టాలు అనుభవించే రోజు ఒకటి ఉంటుంది. కర్మఫలాన్ని కొంతమేర తప్పించుకోవటానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే దైవానుగ్రహం. అది అంటే ఇతర గ్రహాలు ఏమీ చేయలేవు. భగవంతుని మెప్పించేది మన ఉత్తమ ఆలోచనా విధానం, మనం చేసే మంచి పనులు, మనం మాట్లాడే మంచి మాటలు మాత్రమే..

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment