Monday, 13 November 2023

🙏ధర్మం” అంటే ఏమిటి🙏

 



             

🙏ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం…

🙏వివాహ ధర్మం! 

తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం…

🙏భార్య ధర్మం! 

నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం…

🙏మిత్ర ధర్మం! 

సోమరితనం లేకుండటం…

🙏పురుష ధర్మం! 

విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం…

🙏గురుధర్మం! 

భయభక్తులతో విద్యను నేర్చుకోవటం…

🙏శిష్యధర్మం! 

న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం…

🙏యజమాని ధర్మం! 

భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం….                                      

🙏ఇల్లాలి ధర్మం! 

సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం…

🙏సైనిక ధర్మం! 

వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం…

🙏బిడ్డల ధర్మం! 

తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం ….              

🙏తండ్రి ధర్మం! 

తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరుప్రతిష్ఠలు తేవటం….                                          

🙏బిడ్డలందరి ధర్మం! 

తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం…

🙏ప్రతివాని ధర్మం! 

 తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం…

🙏సంసార ధర్మం

అసహాయులను కాపాడటం…

🙏మానవతా ధర్మం! 

చెప్పిన మాటను నిలుపుకోవటం…

🙏సత్య  ధర్మం 

      ధర్మో రక్షతి రక్షితః


🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment