బాల్యం భగవంతుడు ఇచ్చిన వరం...
బాల్యం అమ్మనాన్నల కంట్లో ఆనంద సరోవరం...
బాల్యం ఆటల్లో సంతోషం నింపే స్వరం...
బాల్యం చెప్పలేని మధురానుభూతుల తీరం...
బాల్యం బ్రతుకువనంలో మనోహరం...
బాల్యం గర్భానికి భూగర్భానికి మధ్య మెరిసే వజ్రం...
బాల్యం కల్మషం లేని చిరునవ్వుల వసంతం...
బాల్యం భారాల దూరాలు తెలియని బంగారుతనం...
బాల్యం గోళికాయలా బొంగరంలా తిరిగే భూగోళం...
బాల్యం సకల సంతోష ఆనంద మధుర క్షణాల ఖగోళం...
బాల్యం చదువులమ్మ ఒడిలో ఓనమాలను నేర్పించే సుగుణం...
బాల్యం పవిత్రమైన పరమాత్మ ప్రతిబింబ పరిమళ తీర్థ తటాకం...
బాల్యంలో మునిగి...
యవ్వనంలో ఎదిగి...
వృద్ధాప్యంలో ఒదిగి...
మరణంలో మరుగున పడడమే జీవనం...
ఈ జీవవనంలో అద్భుతం అమోఘం
*బాల్యదశలో ఉన్న పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
No comments:
Post a Comment