Wednesday, 8 November 2023

నాగదోషం (కుజ దోషం)

 


 మనలోని శుక్రకణం  సర్పాకారం లో  ఉంటుంది.అది సవ్యంగా జనింఛి ,దానిలో వీర్యం బలం కలిగి ఉండాలి .అప్పుడే బలవంతులు ,తెజోవంతులు ,మేధస్సు కలిగిన వాళ్ళు పుడతారు.శుక్రకణo బలంపైన సంతాన౦ బలం ఆధారపడి ఉంటుంది.మేధస్సు ,ఓజస్సు ,తేజస్సు,బలం వీటిలోనే ఉంటుంది.జీవుడు శుక్రకణ౦ ద్వారా స్త్రీ గర్బం లోని శోణితంలోనికి ప్రవేశిస్తాడు.ఇది అది రెండు సర్పాకార౦లొ ఉంటాయి.రెండు పాములు పెనవేసుకొన్న విగ్రహను గుడి లో చెట్టుక్రింద ఉంచుతారు.ఆ రెండు కలిపితే అది సుబ్రహ్మణ్యంస్వామి ఆకారం.సంతానం కలగడానికి సంతాన అభివృద్ధి కి తరువాత కలిగే జీవిత అవా౦తరలు ,విఘ్నాలు మనకు పట్టకుండా ఉండటానికి ,భూత ప్రేత పిశాచ నివారణకు కూడా సుబ్రహ్మణ్యస్వామి ని పూజించాలి.సుబ్రహ్మణ్యస్వామి ని కుమారుడు అని కూడా అంటారు.నాగదోషం సర్పదోష౦గా పిలవబడింది.

  సర్పం కర్మ వశాత్తు దోషంగా ఏర్పడుతుంది.కారణం స్త్రీ ల పట్ల అపచారాలు చేసిన వారికి నిస్సందేహంగా సర్ప దోషాలు కలుగుతాయి.అదేవిధంగా పురుషుల యెడల అపచారం చేసిన స్త్రీ లకు కూడా సర్ప దోషం తప్పదు.దీనినే మన౦ కుజ దోషం అంటాము.కుజుడు కుమార శక్తి లో ఒక అంశ.అంటే కుమార శక్తిని మనం స్త్రీ పరంగానో ,పురుషుని పరంగానో దుర్వినియోగము చేస్తే అది మన లో సర్ప దోషంగా ఏర్పడి అసలు వివాహాలే కావు.జరిగిన సంతానం కలగదు.కలిగిన వాళ్ళు బాగుండరు.అది సర్పదోషం యొక్క భాద ,కుజదోష భాధ.

       కుజ దోషం ఉంది ఈ అబ్బాయికి ,లేదా అమ్మాయికి అంటుంటారు ,కుమారుని అగ్రహమే కుజదోషం .కుమారుడు ఎప్పుడు అగ్రహిస్తడంటే పురుషుని యందు స్త్రీ ,స్త్రీ యందు పురుషుడు మక్కువపడి ఏదో చేసుకొంటే కుమారుడు పట్టిచ్చుకొడు.స్త్రీ యందు పురుషుడు అపచారం చేసిన ,పురుషుని యందు స్త్రీ అపచారం చేసిన తరువాత జన్మ నుండి అది పామై పడుతుంది.అందుచేత కొన్ని జాతులలో ఈ వంశాలలో పిల్లలు పుట్టరు.పిల్లలు పుట్టకపోవడం ఎందుకు జరుగుతుంది అంటే ఆ వంశలో ఎక్కడో ఒకచోట అపచారం జరిగిఉంటుది.అందుకని పిల్లలు పుట్టరు.పుట్టిన ఏదో ఒక వైకల్యం ,మందబుద్ది,బుద్దిహినత .పుట్టకలోనే మానసిక వైకల్యం ఉన్నవాళ్ళు పుడతారు.శుక్ర కణం పవిత్రంగా ఉండాలంటే సంకల్పం పవిత్రంగా ఉండాలి .స్త్రీ ,పురుష సంపర్కం పవిత్రంగా ఉండాలి. నిర్వహణ పవిత్రంగా ఉండాలి.

విపరీత వ్యవహారములవలన ,ప్రవర్తన వలన స్త్రీ పురుషులకు ఇటువంటి దోషాలు ఏర్పడతాయి.దీనికి నివారణ కుమారుని ఆరాధన చేయడమే.కుమారుని ఆరాధన ద్వారా మనం సర్పదోషాలను నివారించుకోవచ్చు.సంతానం కలగనటువంటి వారికి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేసుకొని ,సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలను దర్శించువవడం మంచిది.


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment