1) సూర్యుడు :
శ్రీ కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను
(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)
కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని
అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని
అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెను
సూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెను
యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు
2) చంద్రుడు :
అత్రి మహర్షి అనసూయల సంతానం
అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను
(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)
సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను
చంద్రుని పుత్రుడు బుధుడు
3) కుజుడు :
శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా "కుజుడు"(అంగారకుడు) జన్మించెను
(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)
రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను
4) బుధుడు :
సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)
బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను
5) బృహస్పతి :
సురూప ఆంగీరసులకు "బృహస్పతి" జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)
ఇతని భార్య "తారాదేవి"
ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని
"గురుడు" అనెదరు
🙏6) శుక్రుడు :
భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం
"ఉశనుడు" జన్మించెను
(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)
కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను
పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరు
అత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి
నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను
గ్రహమండలమున స్థానంపొందెను
7) శనిభగవానుడు :
సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను
(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)
ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు
త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు గ్రహమండలమున స్థానం పొందెను జీవులకు అఖండ ఐశ్వర్యమును కలిగించు శక్తులు గలవాడు.మోక్షకారకుడు.
🙏8) రాహువు :
కశ్యప మహర్షికి సింహికకును "రాహువు" జన్మించెను
ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు
(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)
క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు "మోహిని"అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది
🙏9) కేతు
విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరి
ఇతని భార్య పేరు చిత్రలేఖ
రాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి...
నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరు
ఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును
నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును (అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను.)
No comments:
Post a Comment