తిరుమల, 2023 నవంబరు 08: డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు, రోజుకు 2 వేలు చొప్పున 20 వేల శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించాల్సిందిగా కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

No comments:
Post a Comment