అపర ఏకాదశి 2021లో ఎప్పుడు?
6
జూన్, 2021
(ఆదివారం)
అపర ఏకాదశి వ్రతము ముహూర్తం
అపర ఏకాదశి పారణ సమయము :05:22:43 to 08:09:35 on 7, జూన్ వ్యవధి :2 గంట 46 నిమిషం
ప్రపంచంలో మిగతా సంప్రదాయాల్లో కంటే పండుగలు, శుభకార్యాలు హిందు సంప్రదాయంలోనే ఎక్కువవగా వస్తాయి. వీటిల్లో అపర ఏకాదశికి ప్రముఖమైన స్థానముంది వైశాఖ కృష్ణపక్షం రోజు వచ్చే ఏకాదశిని అపర లేదా అజల ఏకాదశి(నీరు లేకుండా ఉపవాసం చేసే ఏకాదశి) అని అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సారి అపర ఏకాదశి మే 18న అంటే ఈ సోమవారం(ఈ రోజే) జరుపుకుంటున్నారు. ఈ ఉపవాసాన్ని మనం పాటిస్తే, మన దుంఖం, బాధ, అవినీతి లాంటి చెడుగుణాలు దూరమవుతాయని భక్తులు ఎంతగానో నమ్ముతారు. నేడు జరుపుకునే అపర ఏకాదశికి పలు పేర్లు ఉన్నాయి. జలకృత ఏకాదశి, అజల ఏకాదశి, భద్రకళి ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. మరి ఈ నేపథ్యంలో అపర ఏకాదశి అంటే ఏంటి, అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి పూజలు చేయాలి లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వామనావతారాన్ని పూజించాలి..
శ్రీమహావిష్ణువు అవతరించిన అవతారాల్లో ఒక్కొ అవతారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటిలో ముఖ్యంగా వామనావతరాన్ని గురించి చెప్పుకోవాలి. అపర ఏకాదశి రోజున వామనావతరంలో ఉన్న విష్ణువును పూజిస్తారు. ఈ రోజున వామన అవతారాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారని భక్తులు ఎంతగానో నమ్ముతారు. గంగాస్నానం నేడు ఎంతో ప్రత్యేకమైంది. అప ఏకాదశి రోజున గంగా స్నానం చేయడం వల్ల పూర్వకాల పాపాలు కూడా పరిష్కరమవుతాయని అంటారు. ప్రస్తుత కరోనా లాక్‌డౌన్ వల్ల ఇది సాధ్యం కాదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వద్దకు ఏ నది నీరైనా వస్తుంటే ఆ నీటితో స్నానం చేయొచ్చు.
అపర ఏకాదశి ఉపవాసం..
ఏకాదశి ఉపవాసం దశమి నుంచి మొదలై ద్వాదశి వరకు కొనసాగుతుంది. ఈ రోజు ఉపవాసం పాటించే వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి గంగా నీటితో స్నానం చేయాలి. ఉపవాసం ప్రారంభించడానికి ముందు శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం పాటించే ప్రజలు సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోకూడదని గమనించాలి. అలాగే అపరాఏకాదశి సందర్భంగా వ్యక్తి తప్పనిసరిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. అంటే మాంసాహారాన్ని భుజించకూడదు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
ఏకాదశి ఉపవాసం దశమి నుంచి మొదలై ద్వాదశి వరకు కొనసాగుతుంది. ఈ రోజు ఉపవాసం పాటించే వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి గంగా నీటితో స్నానం చేయాలి. ఉపవాసం ప్రారంభించడానికి ముందు శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం పాటించే ప్రజలు సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోకూడదని గమనించాలి. అలాగే అపరాఏకాదశి సందర్భంగా వ్యక్తి తప్పనిసరిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. అంటే మాంసాహారాన్ని భుజించకూడదు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
పూజలు..
అపర ఏకాదశి రోజు పూజ చేసేందుకు గాను ప్రత్యేక స్థలాన్ని ఎంచుకుని అక్కడ శుభ్రపరుచుకోవాలి. అనంతరం విష్ణువు, లక్ష్మి దేవి విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేయాలి. విష్ణువు విగ్రహానికి పువ్వులు, తమలపాకు, కొబ్బరి మొదలైనవి అర్పించాలి. తర్వాత మీ కోరికలన్నీ నెరవేర్చడానికి విష్ణువును ప్రార్థించాలి. సాయంత్రం విష్ణువు విగ్రహం ముందు దీపాన్ని వెలిగించాలి. ఈ రోజు బ్రాహ్మణులకు అన్న దానం చేయాలి. పూజలు చేసిన అనంతరం ప్రజలకు ప్రసాదం పంపిణీ చేయాలి. ఉపవాసం పాటించే వ్యక్తి ఆలస్యంగా నిద్రించాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు మీ భోజనంలో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి వాడకూడదు. రోజు అన్నం తినడం మానుకోండి. బదులుగా, మరుసటి రోజు అంటే ద్వాదాశిలో తినండి.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment