జ్యోతిషశాస్త్రం పరంగా గ్రహాలు చాలా ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు. ఈ నెలలో 4 ప్రధాన గ్రహాలు రాశిపరివర్తనం చెందనున్నాయి. గ్రహాల యువరాజుగా పిలువబడే బుధుడు ఈ నెల ప్రారంభంలోనే రవాణా చెందనున్నాడు. బుధుడు జులై 7న తన సొంత రాశి అయిన మిథునంలో సంచరించనున్నాడు. జులై 25 వరకు ఇక్కడ ఉండి అనంతరం కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల కుటుంబానికి అధిపతి అయిన సూర్యుడు జులై 16న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం మరుసటి రోజు అనగా జులైన 17న శుక్రుడు.. సూర్యుడు రాశి అయిన సింహంలోకి ఆగమనం చెందనున్నాడు. ఈ మూడు గ్రహాలు కాకుండా చివరగా జులై 20న అంగారకుడు సింహంలో ప్రవేశిస్తాడు. ఈ నేపథ్యంలో జులై మాసంలో గ్రహాల రాశిపరివర్తనం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
మిథునంలోకి బుధుడు ..
జాతకులందరికీ మార్గనిర్దేశం చేసి, వివేకం అందించే బుధుడు జులై 7న మిథునంలోకి ప్రవేశించనున్నాడు. జులై 25 వరకు ఈ రాశిలో ఉండి అనంతరం కర్కాటకంలో వెళ్తాడు. బుధుడు ఈ రవాణా వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉండే చాలా మందికి నూతన అవకాశాలు రావచ్చు. అంతేకాకుండా బుధుడు ఈ మార్పుతో అదృష్టం కూడా కలిసి వస్తుంది. జులై 25న బుధుడు మిథునం నుంచి కర్కాటక రాశికి ప్రయాణిస్తుంది. ఫలితంగా రాశులపై కొంత ప్రభావం పడుతుంది.
కర్కాటకంలోకి సూర్యుడు .
ఈ సమయంలో సూర్యుడు ఆశీర్వాదం అవసరం. కొన్ని కంపెనీల ఉద్యోగులు ఈ సంవత్సరం అప్రైజల్ రావడం వల్ల ఆనందంగా ఉంటారు. మరికొంత మంది ఉద్యోగులు డబ్బు పెంచుతారని వేచి ఉంటారు. చంద్రుడు రాశిలో సూర్యుని ప్రవేశం వృత్తిపరమైన కారకంగా పరిగణించే కొన్ని రాశుల వారికి కష్టమవుతుంది. మరికొందరికి సానుకూల ఫలితాలు ఉంటాయి. జులై 16న సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు.
శుక్రుడు సింహంలోకి ..
జ్యోతిషశాస్త్రం ప్రకారం అందం, రిలేషన్ షిప్ కారకంగా శుక్రుడిని పరిగణిస్తారు. శుక్రుని శుభప్రభావంతో ప్రేమ మాధుర్యం అందరి జీవితాల్లో ఉంటుంది. ఈ సారి శుక్రుడు సూర్యుడు రాశి అయిన సింహంలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు జులై 17 వరకు జరుగుతుంది. జులై 17న సింహంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. అంతేకాకుండా మరి కొన్ని రాశుల వారు నిరాశ చెందాల్సి ఉంటుంది.
అంగారకుడు సింహంలోకి..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment