మేషం.. పనులు చకచకాసాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
వృషభం.. ముఖ్య వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం.. సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.
కర్కాటకం.. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం.. కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనాలు, భూములు కొంటారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
కన్య.. రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యవహారాలలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలం.
తుల.. శుభవార్తలు. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఉద్యోగలాభం.
వృశ్చికం.. పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు.. కొత్త వ్యక్తుల పరిచయం. దూరపు బంధువుల కలయిక. కుటుంబంలో వివాదాలు సర్దుకుంటాయి. ఆలయ దర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మకరం.. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కుంభం.. వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మీనం.. ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment