హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment