"గణపతి" అంటే గణాలకు పతి అని అర్థం. ఏమిటా గణాలు? మన ఇంద్రియాలు,ప్రాణాలు,మనసు,బుద్ధి,అహంకారం. ఇవే గణాలు. ఈ గణాలను ఎవరైతే తమ అధీనంలో(control)లో పెట్టుకొని ఉంటారో ఆయనే "గణపతి"..
అయితే ఈ గణపతికి అమ్మవారు ఒక పెద్ద పనిని అప్పజెప్పింది.ఏమిటది అంటే? "ఓ గణపతి..నీవు విఘ్న యంత్రాన్ని చ్చేదించి మహా గణపతివి కావాలి.అప్పుడే నేను ప్రహర్షిత ను అవుతాను,అంటే నిన్ను కన్నందుకు నేను చాలా సంతోషిస్తాను నా ముద్దుల కన్నా" అని గణపతిని ఆదేశిస్తుంది అమ్మవారు.
అయితే ఒక్క గణపతికే కాదండీ, మనందరికీ కూడా అమ్మవారు
ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. మనం కూడా ఆ
విఘ్న యంత్రాన్ని చ్చేదించి మహా గణపతులము కావాలి అని
అమ్మవారి కోరిక.
ఇంతకూ ఏమిటా విఘ్న యంత్రం? సంసార తాపత్రయమే ఆ విఘ్న యంత్రం. మనకు మూడు రకాల తాపాలు ఉన్నాయి. వాటి వల్ల మనకు మూడు విఘ్నాలు(ఆపదలు,బాధలు) కలుగుతున్నాయి. అవే ఆధ్యాత్మిక,ఆధి భౌతిక,ఆధి దైవిక తాపాలు. మన శరీరం వల్ల,మనసు వల్ల కలిగే బాధలు ఆధ్యాత్మిక తాపం.ఇతరుల వల్ల,ఇతర జంతువుల వల్ల మనకు కలిగే ఆపదలు ఆధి భౌతిక తాపం. ఇక ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే..భూకంపం, వరదలు,అగ్ని ప్రమాదం వీటి వల్ల కలిగే ఆపదలు ఆధి దైవికం.
ఈ విధంగా మనకు మూడు విఘ్నాలను కలిగించేది సంసారం అనే విఘ్న యంత్రం. అయితే మనం ఈ విఘ్న యంత్రాన్ని దాటాలి అంటే
ఏమిటి మార్గం? మనం అయ్యవారి తత్త్వాన్ని(శివ తత్త్వాన్ని) మరియు అమ్మవారి తత్త్వాన్ని(శక్తి తత్త్వాన్ని) బాగా తెలుసుకోవాలి.
శివశక్తుల నామాలను బాగా భావన చేయాలి. అప్పుడే మనం సంసార విఘ్న యంత్రాన్ని దాటి ఆ శివ శక్త్యైక రూపాన్ని దర్శించి
మహా గణపతులం అవ్వగలం. అప్పుడే మన నిజమైన తల్లిదండ్రులు అంటే శివుడు,అమ్మవారు మనల్ని చూసి
చాలా సంతోషిస్తారు.
ఎన్నో జన్మల నుండీ మనం శరీర సుఖాలను మరిగి ఈశ్వర భావన
చేయకుండా బతుకుతున్నాం. మనవి భావన లేని బతుకులు అయిపోయాయి.చాలా బాధగా ఉంది. ఈశ్వర భావన చేయని బతుకు వ్యర్థం.కనీసం ఈ జన్మలో అయినా ఈశ్వర భావన చేద్దాం.
మన జన్మను అర్థవంతం చేసుకుందాం.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
FACEBOOK GROUP :
YOUTUBE
PRINTEREST
TWITTER
INSTAGRAM
BLOG
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371
No comments:
Post a Comment