మేషం: కొత్త వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తప్పవు.
మిథునం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: శుభకార్యాలపై ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత.
కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
తుల: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.
వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలుసర్దుకుంటాయి.
ధనుస్సు: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి.
మకరం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
కుంభం: కష్టానికి ఫలితం దక్కదు. వ్యవహారాలు నెమ్మదిస్తాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
మీనం: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment